iDreamPost
android-app
ios-app

ఆ స్టార్ హీరోకు పెళ్లైందా..? ఇంత పెద్ద కూతురు ఉందా..?

  • Published Aug 19, 2024 | 2:53 PM Updated Updated Aug 19, 2024 | 2:53 PM

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరు ఓ స్టార్ హీరో భార్య, పాప. ఆ హీరో పేరు చెబితే ఏంటీ పెళ్లయ్యిందా అన్న సందేహం కలుగుతుంది. క్రికెటర్ కావాల్సిన వాడు.. అనుకోకుండా యాక్టర్ అయిపోయాడు. అసోసియేట్ డైరెక్టర్, సపోర్టింగ్ యాక్టర్, ఆ తర్వాత హీరో అయ్యాడు. ఇంతకు అతడు ఎవరంటే..?

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరు ఓ స్టార్ హీరో భార్య, పాప. ఆ హీరో పేరు చెబితే ఏంటీ పెళ్లయ్యిందా అన్న సందేహం కలుగుతుంది. క్రికెటర్ కావాల్సిన వాడు.. అనుకోకుండా యాక్టర్ అయిపోయాడు. అసోసియేట్ డైరెక్టర్, సపోర్టింగ్ యాక్టర్, ఆ తర్వాత హీరో అయ్యాడు. ఇంతకు అతడు ఎవరంటే..?

  • Published Aug 19, 2024 | 2:53 PMUpdated Aug 19, 2024 | 2:53 PM
ఆ స్టార్ హీరోకు పెళ్లైందా..? ఇంత పెద్ద కూతురు ఉందా..?

మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే.. సినీ రంగంపై కాస్త ఫోకస్ ఎక్కువనే చెప్పొచ్చు. హీరో, హీరోయిన్ల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటుంది. ఫిల్మీ ఇన్ఫర్మేషన్‌తో పాటు ఫ్యామిలీ బ్యాగ్రౌండ్, ఏం చదువుకున్నారు. ఎక్కడ పెరిగారు. ఏం తింటారు.. అనే అంశాల గురించి సమాచారాన్ని సేకరిస్తుంటారు. అయితే మీకొక టాస్క్. ఇందులో ఇద్దరు కనిపిస్తున్నారు కదా.. ఈ ఇద్దరు స్టార్ హీరో భార్య, పాప. సినిమాల్లో తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకునే ఆ కుర్ర హీరోకు పెళ్లే కాలేదు అనుకుంటారు. అలాంటిది ఇంత పాప కూడా ఉందా అని ఆశ్చర్యపోవడం ఖాయం. ఒకప్పుడు సైడ్ యాక్టర్ నుండి నేడు స్టార్ హీరోగా ఎదిగిన ఈ హీరో.. బయట చాలా సిగ్గరి. తక్కువ మాట్లాడుతూ.. తెరపై మాత్రం బాయ్ నెక్ట్స్ డోర్‌లా ఆకట్టుకుంటాడు. ఇంతకు ఆ స్టార్ హీరో ఎవరంటే.. ఓం భీం బుష్ హీరో శ్రీ విష్ణు.

ఈ పిక్స్‌లో కనిపిస్తున్న ఇద్దరు శ్రీ విష్ణు భార్య ప్రశాంతి, ఆయన కూతురు మ్రిదా. తాజాగా భార్య పుట్టిన రోజు సందర్భంగా ఫోటోలు షేర్ చేసుకున్నాడు ఈ యంగ్ యాక్టర్. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో పుట్టిన శ్రీ విష్ణు వైజాగ్ గీతంలో చదువుకున్నాడు. కాలేజీ రోజుల నుండి థియేటర్ గ్రూప్‌లో సభ్యుడు. అండర్ 19 ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడాడు. క్రికెటర్ కావాల్సిన వాడు.. అనుకోకుండా యాక్టర్ అయిపోయాడు. చదువులు పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చేసిన శ్రీ విష్ణు.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ చేశాడు. మరో నటుడు నారా రోహిత్ స్నేహితుడు కావడంతో అలా బాణం మూవీలో ఎంట్రీ ఇచ్చాడు.

Sree Vishnu actor 1

ఆ తర్వాత సోలో, లవ్ ఫెయిల్యూర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ వంటి చిత్రాల్లో స్మాల్ రోల్స్‌లో కనిపించాడు. అతడికి గుర్తింపు వచ్చింది మాత్రం ప్రేమ, ఇష్క్, కాదల్.. ఇందులో ముగ్గురు హీరోల్లో ఒక్కడిగా కనిపించాడు. ఆ తర్వాత ఒక్కడినే, ప్రతినిధి చిత్రాల్లో మెరిశాడు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తితో బన్నీ స్నేహితుడిగా చిన్న పాత్రలో మెరిశాడు. అప్పట్లో ఒకడుండేవాడు నుండి కెరీర్‌లో ఫుల్ స్వింగ్ స్టార్ట్ అయ్యింది. ఉన్నది ఒకటే జిందగి మూవీలో సెకండ్ హీరోగా మంచి రోల్ పోషించాడు. ఇక అక్కడ నుండి సోలో హీరోగా వరుస సినిమాలు చేశాడు. మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ, వీర భోగ వసంత రాయులు, బ్రోచెవారెవురా వరుస సినిమాలు చేశాడు. గత ఏడాది వచ్చిన సామజవరగమన, ఈ ఏడాది వచ్చిన ఓం భీమ్ భీష్ సినిమాలు అతడ్ని స్టార్ హీరోను చేశాయి. ప్రస్తుతం మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Sree Vishnu (@sreevishnu29)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş