కాల్పుల ఘటన.. సల్మాన్ సంచలన నిర్ణయం!

ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ కాల్పులు జరిగిన తర్వాత తీవ్ర ఆందోళనకు గురైన సల్మాన్.. ఆయన కుటుంబం తాజగా ఇంటి విషయంలో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ కాల్పులు జరిగిన తర్వాత తీవ్ర ఆందోళనకు గురైన సల్మాన్.. ఆయన కుటుంబం తాజగా ఇంటి విషయంలో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. గత కొన్ని రోజులగా ఈ హీరో పేరు తరుచు వార్తలో మారుమోగుతు ఉంది. అందుకు కారణం.. సల్మాన్ కు గత కొంతకాలం నుంచి హత్య బెదిరింపులు రావడమే కాకుండా.. ఇటీవలే సల్మాన్ ఇంట కొందరు దుండగలు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అయితే కాల్పులు అనేవి ఈనెల అనగా ఏప్రిల్ 14వ తేదీ తెల్లవారు జామున జరిగాయి. కాగా, ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి సల్మాన్ ఇంటి వద్ద రెండుసార్లు కాల్పులు జరిపారు. ఇక ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయలు కాలేదు. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న ముంబై పోలీసులు కాల్పులు జరిపిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభిస్తుండా.. అంతలోనే కాల్పులు జరిపించింది తామనని లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడు అనుమోల్‌ బిష్ణోయ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. పైగా, ఇది ట్రైలర్‌ మాత్రమే అని పిక్చర్‌ ముందుందని షాకింగ్ పోస్ట్‌ చేశాడు.అంతేకాకుండా.. ఈ సారి ఇంటిపై కాల్పులు జరపమని, ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ ఆ పోస్ట్ లో పేర్కొన్న విషయం తెలిసిందే.

అయితే ఈ ఘటన తర్వాత సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అంతేకాకుండా.. ఈ ఘటన జరిగిన తర్వాత సల్మాన్ ఖాన్ తన ఇల్లు ఖాళీ చేస్తారని ప్రచారం జరుతోంది. ఈ విషయం పై తాజాగా ఈ హీరో సోదరుడు స్పందించాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే.. ఇటీవలే ముంబైలోని బాంద్రాలో గెలాక్సీ అపార్ట్‌మెంట్ సమీపంలో గల సల్మాన్ ఇంటి ముందు కొందరు దుండగలు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటన తర్వాత సల్మాన్ ఖాన్ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాగా, కాల్పుల ఘటన జరిగిన తర్వాత సల్మాన్ ఖాన్ కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక అందులో  ఇాద్దరు అపరిచితులు కాల్పులు జరపడం అనేది తీవ్ర దిగ్భ్రాంతికరం. ఇక ఈ ఘటనతో మా కుటుంబం ఆందోళన చెందుతోంది. దురదృష్టం ఏంటంటే.. మా కుటుంబానికి ఆప్తమిత్రులమంటూ కొందరు మీడియాలో తేలికపాటి ప్రకటనలు చేస్తున్నారు. అయితే  ఈ సంఘటన ఒక పబ్లిసిటీ జిమ్మిక్ అని కొందరు మాపై దుష్ఫ్రచారం చేస్తున్నారు. కానీ, అది నిజం కాదు. అలాంటి వారి మాటలను సీరియస్ గా తీసుకోవద్దు’ అని సల్మాన్ కుటుంబం ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇక ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలోనే.. కొందరు కాల్పులు ఘటనతో  తీవ్ర ఆందోళనలో ఉన్న సల్మాన్ ఖాన్ తన ఇల్లు ఖాళీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై సల్లూ సోదరుడు అర్బాజ్ ఖాన్ స్పందించి..  సల్మాన్‌కి ఇప్పట్లో ఇల్లు ఖాళీ చేసే ఉద్దేశం లేదని అర్బాజ్ ఖాన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్తే ప్రాణహాని తప్పుతుందాని అంతా భావిస్తున్నారు.. అలాగే చర్చించుకుంటున్నారు. కానీ,  అది వాస్తవం కాదు. ఎందుకంటే.. మా నాన్నగారు చాలా ఏళ్లుగా ఆ ఇంట్లోనే ఉండేవారు. సల్మాన్ ఖాన్ కూడా చాలా సంవత్సరాలు గా ఇక్కడే ఉంటున్నాడు. అది వారి ఇల్లు. ఇల్లు ఖాళీ చేస్తే మిమ్మల్ని వదిలిపెడతామని ఎవరూ అనలేదు. అలా అయితే ఇల్లు ఖాళీ చేసే ఆలోచన ఉండేది’అని అర్బాజ్ ఖాన్ క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఏప్రిల్ 16 ముంబైలోని బాంద్రా నివాసంలో సల్మాన్ ఖాన్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఇక భద్రతా విషయంలో సల్మాన్ కుటుంబ సభ్యులకు పూర్తి భరోసాని కూడా ఇచ్చారు. మరి, కాల్పులు ఘటనపై సల్మాన్ కుటుంబం అతని సోదరుడు స్పందించి తీసుకున్న నిర్ణయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments