Venkateswarlu
సాధారణంగా రక్షణ కోసం సెలెబ్రిటీలు బాడీగార్డులను పెట్టుకుంటూ ఉంటారు. స్టార్లు అయితే బాడీగార్డుల కోసం కోట్లు ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే, సల్మాన్ ఖాన్ తన మాజీ బాడీగార్డు కారణంగా తరచుగా వార్తలో నిలుస్తున్నారు.
సాధారణంగా రక్షణ కోసం సెలెబ్రిటీలు బాడీగార్డులను పెట్టుకుంటూ ఉంటారు. స్టార్లు అయితే బాడీగార్డుల కోసం కోట్లు ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే, సల్మాన్ ఖాన్ తన మాజీ బాడీగార్డు కారణంగా తరచుగా వార్తలో నిలుస్తున్నారు.
Venkateswarlu
సినిమా వాళ్లకు బయట జనంలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా వాళ్లు ఎక్కడికైనా వెళితే వారి చుట్టూ జనం చేరుతూ ఉంటారు. ఫొటోలు, సెల్ఫీల కోసం కొట్టుకు చస్తూ ఉంటారు. అయితే, కొన్ని సార్లు అభిమానుల అత్యుత్సాహం కారణంగా సెలెబ్రిటీలకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సార్లు గాయాలు కూడా అవుతూ ఉంటాయి. అందుకే సినిమా వాళ్లు ఎక్కడికైనా వెళితే… స్టార్‌డమ్‌ను బట్టి పోలీసులు సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తుంటారు. లేదంటే ఈవెంట్ వారు బాడీగార్డులను పెడుతుంటారు.
ఫేమస్ సెలెబ్రిటీలకు మాత్రం వ్యక్తిగత సిబ్బంది ఉంటారు. సంవత్సరానికి కోట్ల రూపాయలు ఇచ్చి బాడీగార్డులను పెట్టుకున్న స్టార్ హీరోలు, హీరోయిన్లు మనదేశంలో చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో సల్మాన్ ఖాన్ ముందు వరుసలో ఉంటారు. ఆయనకు దాదాపు 5-6 మంది దాకా వ్యక్తిగత బాడీగార్డులు ఉన్నారు. రక్షణ కల్పించాల్సిన బాడీగార్డ్ కారణంగా గత కొన్నేళ్ల నుంచి సల్మాన్ చిక్కుల్లో పడుతున్నారు. తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. సల్మాన్ ఖాన్ మాజీ బాడీగార్డు షేరా అలియాస్ షేరు ఆయనపైనే బెదిరింపులకు పాల్పడ్డాడు.
దీంతో అతడ్ని అరెస్ట్ చేసి జైలు పంపారు. బెయిల్ మీద విడుదలైన తర్వాత కూడా షేరా తన బుద్ధి మార్చుకోలేదు. మళ్లీ పాత పంథాలోకి వెళ్లాడు. గత కొన్ని నెలలనుంచి ఓ ప్రముఖ వ్యాపారవేత్తను డబ్బు కోసం బెదిరిస్తున్నాడు. అతడి వద్దనుంచి ఏకంగా 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన వ్యాపారి జిషాన్ జకీర్‌పై గత రెండేళ్లుగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఫోన్లు చేసి బూతులు తిట్టసాగాడు. షేరు కారణంగా విసిగివేశారిపోయిన జకీర్ తాజాగా పోలీసులను ఆశ్రయించాడు.
షేరుపై ఫిర్యాదు చేశాడు. షేరు తన అనుచరులతో వచ్చి తనను కాల్చి చంపే ప్రయత్నం చేశాడని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను తృటిలో తప్పించుకున్నాని అన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. షేరు కోసం గాలిస్తున్నారు. కాగా, షేరు గతంలో సినిమా అవకాశం కోసం సల్మాన్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. సల్మాన్ సినిమా అవకాశం ఇవ్వటానికి ఒప్పుకోకపోవటంతో షేరు బెదిరింపులకు దిగాడు. ఫోన్లు చేసి తిట్టడం మొదలుపెట్టాడు.
ఈ నేపథ్యంలోనే సల్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు షేరును అరెస్ట్ చేశారు. ఇప్పట్లో ఈ వార్తల బాలీవుడ్ సర్కిల్‌లో పెను సంచలనం సృష్టించింది. మీడియాలో ఇద్దరి పేర్లు మారు మోగాయి. ఇప్పుడు మళ్లీ షేరు కారణంగా సల్మాన్ ఖాన్ వార్తల్లో నిలుస్తున్నారు. మరి, బాడీగార్డ్ కారణంగా సల్మాన్‌కు తరచుగా వార్తల్లో నిలవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.