iDreamPost
android-app
ios-app

ఓవర్సీస్‌లో దుమ్ము రేపుతోన్న సలార్ అడ్వాన్స్ బుకింగ్స్!

  • Published Dec 16, 2023 | 4:51 PM Updated Updated Dec 16, 2023 | 4:51 PM

సలార్ పాన్ ఇండియా మూవీ కాస్త.. పాన్ వరల్డ్‌గా మారిపోయింది. బాహుబలితో గ్లోబల్ స్టార్‌గా మారిన డార్లింగ్ ప్రభాస్‌కు.. ఇండియన్ ఫ్యాన్సే కాదూ.. ప్రపంచ వ్యాప్తంగా అతడికి అభిమానులు ఉన్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో టికెట్ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ కాగా..

సలార్ పాన్ ఇండియా మూవీ కాస్త.. పాన్ వరల్డ్‌గా మారిపోయింది. బాహుబలితో గ్లోబల్ స్టార్‌గా మారిన డార్లింగ్ ప్రభాస్‌కు.. ఇండియన్ ఫ్యాన్సే కాదూ.. ప్రపంచ వ్యాప్తంగా అతడికి అభిమానులు ఉన్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో టికెట్ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ కాగా..

  • Published Dec 16, 2023 | 4:51 PMUpdated Dec 16, 2023 | 4:51 PM
ఓవర్సీస్‌లో దుమ్ము రేపుతోన్న సలార్ అడ్వాన్స్ బుకింగ్స్!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ ప్రభాస్ మూవీ సలార్ రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది. కేవలం ఆరు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. అప్పుడే డార్లింగ్ ఫ్యాన్స్‌కు పండగ మొదలైంది. ఎప్పుడెప్పుడూ తమ కటౌట్‌ను వెండితెరపై చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని హోంబలే సంస్థ నిర్మిస్తున్న సంగతి విదితమే. ఇక ఓవర్సీస్‌లో సినిమా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ అయ్యాయి. అక్కడ దుమ్ము రేగిపోతున్నాయి. అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ప్రీ అడ్వాన్స్ బుకింగ్స్ కొనసాగుతున్నాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, యూరప్ దేశాల్లో టికెట్ల ఓపెనింగ్ కాగానే.. చాలా క్విక్‌గా అమ్ముడయ్యాయి. యూఎస్‌లో ఓ రేంజ్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ అవుతున్నాయని మేకర్స్ చెబుతున్నారు.

యూఎస్ మార్కెట్లో ప్రత్యంగిర సినిమాస్ విడుదల చేస్తోంది. ఈ సంస్థ ఇస్తున్న అప్డేట్ ప్రకారం.. అమెరికాలో సలార్ టికెట్స్ బుకింగ్‌లో ప్రభాస్ హవా కొనసాగుతోంది. ఇప్పటికే 9 లక్షల డాలర్ల మార్క్‌ను దాటేసింది. మిలియన్ డాలర్లను వసూలు చేసేందుకు ఇంకెంత దూరంలోనూ లేదు. ఇది ప్రభాస్ మేనియాకు ఓ నిదర్శనం. వీటితో పాటు బ్రిటన్‌లో లక్ష పౌండ్లను దాటేసింది. ఆస్ట్రేలియాలో కూడా తన ప్రభంజాన్ని చూపిస్తున్నాడు ప్రభాస్. అమెరికాలో డిసెంబర్ 21నే విడుదల కాబోతోంది. యూఎస్ మార్కెట్ సంస్థ ప్రత్యంగిర సినిమాస్ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ఉంది. అలాగే ఈ రోజు రాత్రి మరో సర్ ప్రైజ్ ఉండనున్నట్లు క్లూ ఇస్తూ ట్వీట్ చేసింది.. ఆ సర్ ప్రైజ్ ఏంటో చెప్పొచ్చుగా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇక ఓవర్సీస్‌లో ఇలా ఉంటే ఇండియాలో పరిస్థితి ఎలా ఉంటుందో.

ఇక ఇండియాలో కూడా కర్ణాటకలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అక్కడ కూడా కొన్ని గంటల్లోనే వేలల్లో టికెట్లు అమ్ముడయ్యాయి. ఇక పొరుగు రాష్ట్రంలోనే ఇలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్స్ పెడితే రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని అనుకుంటున్నారు ఫ్యాన్స్. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు నుండి ప్రీ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయని టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్‍గా విడుదల ఈ మూవీని కొంత మంది సినీ పెద్దలు చూసినట్లు తెలుస్తోంది. సలార్ లో భారీ ఫైట్లు, ఎప్పుడూ చూడని యాక్షన్ సీక్వెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఊహించని ట్విస్టులను కూడా అందించాడట ప్రశాంత్ నీల్. మరీ ఇక్కడ బుకింగ్స్ ఓపెన్ అయితే ఏ మేరకు టికెట్లు అవుతాయనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom