iDreamPost
android-app
ios-app

Salaar: వరుస సమస్యలు.. మళ్లీ వాయిదా పడ్డ సలార్‌ ట్రైలర్‌!

  • Published Dec 18, 2023 | 11:48 AM Updated Updated Dec 18, 2023 | 11:48 AM

సలార్‌ సెకండ్‌ ట్రైలర్‌ కోసం అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే, ట్రైలర్‌ విడుదల మాత్రం వరుసగా వాయిదా పడుతోంది. నిన్న, ఈరోజుతో కలిపి రెండు సార్లు వాయిదా పడింది.

సలార్‌ సెకండ్‌ ట్రైలర్‌ కోసం అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే, ట్రైలర్‌ విడుదల మాత్రం వరుసగా వాయిదా పడుతోంది. నిన్న, ఈరోజుతో కలిపి రెండు సార్లు వాయిదా పడింది.

  • Published Dec 18, 2023 | 11:48 AMUpdated Dec 18, 2023 | 11:48 AM
Salaar: వరుస సమస్యలు.. మళ్లీ వాయిదా పడ్డ సలార్‌ ట్రైలర్‌!

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటించిన సలార్‌ విడుదల కోసం ఆయన ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేక్షకుడు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. చిత్ర విడుదలకు కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డిసెంబర్‌ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రీ బుకింగ్స్‌ మొదలయ్యాయి. ప్రీ బుకింగ్స్‌లో సలార్‌ సత్తా చాటుతోంది. దేశంతో పాటు ఓవర్‌సీస్‌లో రికార్డులు క్రియేట్‌ చేస్తోంది.

 ఇతర దేశాల్లో రికార్డు స్థాయిలో ప్రీ బుకింగ్స్‌ను నమోదు చేసింది. ఇక, సలార్‌కు సంబంధించి కొద్దిరోజుల క్రితమే ఓ ట్రైలర్‌ విడుదల అయింది. ఆ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డులు క్రియేట్‌ చేసింది. తెలుగుతో పాటు మిగిలిన నాలుగు భాషల్లో కలిపి దాదాపు 100 మిలియన్లకు పైగా వ్యూస్‌ సంపాదించి రికార్డు క్రియేట్‌ చేసింది. అది కూడా 18 గంటల్లోనే ఈ రికార్డును క్రియేట్‌ చేయటం విశేషం. గతంలో కేజీఎఫ్‌ 2 సినిమాపై ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.

salar trailer postponed

అయితే, సలార్‌ టీం మూవీ విడుదల దగ్గర పడుతున్నా ప్రమోషన్లు చేయటం లేదు. ఇప్పుడు సెకండ్‌ ట్రైలర్‌ను మాత్రమే రిలీజ్‌ చేయాలని చూస్తోంది. సెకండ్‌ ట్రైలర్‌ నిన్న సాయంత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండింది. అయితే, కొన్ని టెక్నికల్‌ సమస్యల కారణంగా ట్రైలర్‌ వాయిదా పడింది. ఈ రోజు ఉదయం 10:42 నిమిషాలకు విడుదల కావాల్సి ఉండింది. ఇప్పుడు కూడా మరో సారి వాయిదా  పడింది. దీంతో ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశలో పడ్డారు. సలార్‌ టీం కొత్త టైమ్‌ను ప్రకటించింది.

ఈ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ట్రైలర్‌ విడుదల కానున్నట్లు ప్రకటించింది. అయితే, ఫ్యాన్స్‌ను మాత్రం ఏదో భయం పట్టి పీడుస్తోంది.  ఈ రోజైనా వస్తుందా? రాదా? అన్న భయంలోనే ఉన్నారు. ట్రైలర్‌ ఈ రోజు కచ్చితంగా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని సినిమా వర్గాలు చెబుతున్నాయి. కాగా, సలార్‌ సినిమాలో ప్రభాస్‌కు జంటగా శృతి హాసన్‌ నటించారు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు, ఈశ్వరీరావు, బాబీ సింహ, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

కేజీఎఫ్‌ సినిమా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించారు. హోం బలే ఫిల్మ్స్‌ సలార్‌ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించింది. రవి బస్రూర్‌ సంగీతం అందించారు. తాజాగా, ‘ సూరీడే ’ అనే పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాటకు మంచి స్పందన వచ్చింది. మరి, సలార్‌ సినిమా ట్రైలర్‌ వరుసగా వాయిదా పడ్డంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomjojobet girişjojobet güncel girişdeneme bonusu veren sitelerMariobetmadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasibombetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet