Venkateswarlu
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, సలార్ టీం మాత్రం ప్రమోషన్ల విషయంలో నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది.
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, సలార్ టీం మాత్రం ప్రమోషన్ల విషయంలో నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది.
Venkateswarlu
దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ‘సలార్’ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తోంది. ప్రభాస్ అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడు సైతం సలార్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న మూవీ కావటంతో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. పాత రికార్డులను సలార్ బ్రేక్ చేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 22న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
ఇండియాతో పాటే ఓవర్‌సీస్‌లో కూడా సందడి చేయనుంది. సలార్ విడుదలకు కేవలం పది రోజులు మాత్రమే ఉంది. విడుదల సమయం దగ్గర పడుతున్నా.. సలార్ టీమ్ మాత్రం ప్రమోషన్లపై దృషి పెట్టడం లేదు. డిసెంబర్ 1వ తేదీన సలార్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. 24 గంటల్లోనే వంద మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టంది. ఆ తర్వాత మూవీ టీం నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. దేశంలోని పలు ముఖ్య పట్టణాల్లో ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుందన్న ప్రచారం జరిగింది.
అయితే, అది కూడా ప్రచారంగానే మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది. సలార్ టీం ప్రమోషన్లపై అంతగా ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపించటం లేదు. తాజా సమాచారం ప్రకారం ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా లేవట. కేవలం ఇంగ్లీష్‌లో ఓ ఇంటర్వ్యూ నిర్వహిస్తారట. దాన్నే అన్ని భాషల వారికోసం ఆన్‌లైన్‌లో ఉంచనున్నారట. చిత్రం విడుదల అయ్యే లోపల ఇంకో పాట, సెకండ్ ట్రైలర్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇవి తప్పా సినిమా ప్రమోషన్లు ఏవీ జరగవట.
ప్రభాస్ స్టామినేనే దిక్కు..
సలార్ టీం ప్రమోషన్లు లేకుండా సినిమాను విడుదల చేయాలనుకోవటం సాహసోపేతమైన నిర్ణయమే అని చెప్పొచ్చు. అయితే, ఆ ధైర్యం వెనుక ఉన్నది ముమ్మాటికి ప్రభాస్ అని చెప్పాలి. ప్యాన్ ఇండియా లెవెల్‌లో ప్రభాస్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సలార్ ప్రభాస్ సినిమా కాబట్టి.. ఈ చిత్రంపై మొదటినుంచి భారీ అంచనాలు ఉన్నాయి. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా ఆయన ప్రతీ ప్యాన్ ఇండియా మూవీకి భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. ప్లాపు సినిమాలకు కూడా మొదటి రోజు 50 కోట్లుపైనే వచ్చాయి.
అలాంటిది ఎంతో హైప్ ఉన్న సలార్‌కు కలెక్షన్ల విషయంలో అడ్డు ఉండదు. సినిమా మొదటి రోజు 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్ స్టామినానే చిత్రానికి వసూళ్ల వరద వచ్చేలా చేస్తుందని అంటున్నారు. మరి, ప్రమోషన్లు లేకుండా సలార్ సినిమా విడుదలకు సిద్ధమవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.