Salaar: సలార్‌ ‘సూరీడు’ పాట లిరిక్స్‌.. స్నేహం గురించి ఎంత చక్కగా చెప్పాడు!

సలార్‌ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిన్న సినిమా నుంచి ఓ పాట బయటకు వచ్చింది. ‘‘ సూరీడే గొడుగు పట్టి’’ అనే పాటకు మంచి స్పందన వస్తోంది.

సలార్‌ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిన్న సినిమా నుంచి ఓ పాట బయటకు వచ్చింది. ‘‘ సూరీడే గొడుగు పట్టి’’ అనే పాటకు మంచి స్పందన వస్తోంది.

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా వస్తున్న ‘సలార్‌’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మూవీ నుంచి వస్తున్న ప్రతీ అప్‌డేట్‌ కూడా ఈ అంచనాలను మరింత పెంచుతున్నాయి. సలార్‌ డిసెంబర్‌ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్‌ అవ్వనుంది. విడుదల దగ్గరపడుతున్నా.. సినిమా టీం ప్రమోషన్ల విషయంలో పెద్దగా ఆసక్తిచూపిస్తున్నట్లు కనిపించటం లేదు.

సలార్‌ నిర్మాతలు ప్రమోషన్ల విషయాన్ని లైట్‌ తీసుకున్నారన్న టాక్‌ కూడా వినిపిస్తోంది. అందుకే సినిమాకు విడుదలకు ముందు ఓ పాట, సెకండ్‌ ట్రైలర్‌, ఇంగ్లీష్‌లో ఓ ఇంటర్వ్యూ మాత్రమే ఉండనున్నాయని సమాచారం. బుధవారం సలార్‌ సినిమా నుంచి ఓ పాట బయటకు వచ్చింది. ‘‘ సూరీడే’’ అనే పాట యూట్యూబ్‌లో విడుదలైంది.  సింగర్ హరిని ఇవటూరి పాడిన ఈ పాటకు.. రైటర్ కృష్ణకాంత్ అద్బుతమైన పదాలు సమకూర్చారు. కన్నడలో ‘ ఆకాశ గడియ’గా.. తమిళంలో.. ‘ఆగాశ సూరియన్‌’గా.. మలయాళంలో ‘ సూర్యాంగం’..

హిందీలో ‘ సూరజ్‌ హి చాహోన్‌ బంకే’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూట్యూబ్‌లో విడుదలైన కొద్దిసేపటికే ట్రెండింగ్‌లోకి వచ్చింది. గంటల్లోనే లక్షల వ్యూస్‌ తెచ్చుకుంది. దాదాపు 24 గంటల్లో మిలియన్ల వ్యూస్‌ సంపాదించింది. ముఖ్యంగా ఈ పాట లిరిక్స్‌ అందరినీ ఆకర్షిస్తున్నాయి. ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ల మధ్య స్నేహం గురించి పదాల్లో అద్భుతంగా చెప్పాడు లిరిక్‌ రైటర్‌ కృష్ణకాంత్.

సూరీడే గొడుగు పట్టి పాట లిరిక్స్‌ ..

సూరీడే గొడుగు పట్టి.. వచ్చాడే భుజము తట్టి..
చిమ్మచీకటిలోను నీడగ ఉండేటోడు..
రెప్ప వదలక కాపు కాసెడి కన్ను వాడు..

ఆకాశం విడిచి పెట్టి..
ముద్దెట్టే పొలము మట్టి..

ఎండ భగభగ తీర్చే చినుకులా దూకుతాడు
ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు

ఖడ్గమొకడైతే.. కలహాలు ఒకడివిలే..
ఒకడు గర్జన, ఒకడు ఉప్పెన వెలసి ప్రళయాలే..
సైగ ఒకడు.. సైన్యం ఒకడు.. కలిసి కదిలితే కదనమే..
ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే.. నూరేళ్లు నిలవాలే..

కంచె ఒకడైతే.. అది మించే వాడొకడే..
ఒకడు చిచ్చుర.. ఒకడు తిమ్మెర.. కలిసి దహనాలే..
వేగ మొకడు.. త్యాగ మొకడు..
గతము మరువని గమనమే..
ఒకరికొకరని నమ్మినడిచిన స్నేహమే ఇదిలే.. నూరేళ్లు నిలవాలే..

సూరీడే గొడుగు పట్టి.. వచ్చాడే భుజము తట్టి..
చిమ్మచీకటిలోను నీడగ ఉండేటోడు..
రెప్ప వదలక కాపు కాసెడి కన్ను వాడు..

మరి, స్నేహం గురించి చెప్పే ఈ పాటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments