iDreamPost
android-app
ios-app

Salaar Day 2 Box Office Collections: సలార్ ఊచకోత.. రెండవ రోజు కలెక్షన్లు ఎంతంటే..?

  • Published Dec 24, 2023 | 12:49 PM Updated Updated Dec 24, 2023 | 2:08 PM

సలార్ బాక్సాఫీసును షేక్ చేసేస్తుంది. డార్లింగ్ ప్రభాస్ మాస్ అవతారాన్ని చూసి అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. బాక్సాఫీసు వద్ద ఈ మూవీ కాసుల వర్షం కురిపిస్తుంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 180 కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ.. రెండో రోజు ఎంత వసూలు చేసిందంటే..?

సలార్ బాక్సాఫీసును షేక్ చేసేస్తుంది. డార్లింగ్ ప్రభాస్ మాస్ అవతారాన్ని చూసి అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. బాక్సాఫీసు వద్ద ఈ మూవీ కాసుల వర్షం కురిపిస్తుంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 180 కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ.. రెండో రోజు ఎంత వసూలు చేసిందంటే..?

  • Published Dec 24, 2023 | 12:49 PMUpdated Dec 24, 2023 | 2:08 PM
Salaar Day 2 Box Office Collections: సలార్ ఊచకోత.. రెండవ రోజు కలెక్షన్లు ఎంతంటే..?

రికార్డులు బద్దలు కొట్టాలన్నా, తిరిగి రాయాలన్నా ఈ కటౌట్ వల్లే అవుతుందని నిరూపించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రశాంత్ నీల్- డార్లింగ్ కాంబోలో వచ్చిన సలార్ ధియేటర్ల వద్ద ఊచకోత కోస్తుంది. కాటేరమ్మ కొడుక్కి తిరుగులేకుండా పోయింది. దేశ వ్యాప్తంగానే కాదూ ఓవర్సీస్‌లో సైతం సలార్ మూవీ హవా నడుస్తోంది. తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 178. 7 కోట్లకు పైగా వసూలు చేసింది. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ వంటి డిజాస్టర్ సినిమాలు ప్రభాస్ మేనియాను ఇసుమంతైనా తగ్గించలేదు కదా.. మరింత పెంచేశాయి. ట్రైలర్, సాంగ్ విడుదలయ్యాక.. ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేశాయి అంతే. ఇక ప్రీమియర్ షో ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద నూతన సంవత్సర వేడుకలు ముందే వచ్చేశాయా అన్నంత హంగామా చేశారు అభిమానులు.

ప్రభాస్ ఖాన్సార్ ఎరుపెక్కించడంతో.. డై హార్ట్ ఫ్యాన్స్ కళ్లల్లో ఆనందం కనబడింది. ఆరున్నరేళ్ల నుండి ఎదురు చూస్తున్నఆశలకు జీవం పోశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రభాస్‌ను తాము కోరుకున్న రేంజ్‌లో చూపించే సరికి ప్రశాంత్ నీల్‌కు తమ హృదయాల్లో గుడి కట్టేశారు అభిమానులు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరి క్యారెక్టర్ బాగా డిజైన్ చేశాడు కెప్టెన్ నీల్. ఇక రెండో రోజు కూడా కలెక్షన్లలో తన హవా కొనసాగించాడు యంగ్ రెబల్ స్టార్. శనివారం ప్రపంచ వ్యాప్తంగా సుమారు సుమారు రూ. 120 కోట్లు కొల్లగొట్టినట్లు సినీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. డే1తో పోల్చి చూసుకున్నప్పటికీ.. కాస్త తగ్గినా.. ఇక్కడ ప్రీమియర్ షో లేకుండానే ఇంత వసూళ్లు చేయడం గమనార్హం. మొత్తంగా ఈ రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 295.7 కోట్లను కొల్లగొట్టినట్లు సలార్ టీం వెల్లడించింది. ఇక ఆదివారం రెండో రోజు కలెక్షన్ల కన్నా ఎక్కువ వసూలు చేసే అవకాశాలున్నాయని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఈ మూడు రోజుల్లోనే సుమారు రూ. 450 కోట్లకు పైగా కొల్లగొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే క్రిస్ మస్ కూడా సెలవు రోజు కాబట్టి.. సోమవారం కూడా కలెక్షన్లకు వచ్చిన ఢోకా ఏమీ లేదు. మొత్తానికి ఆరేళ్ల అభిమానుల కల ఈ మూవీతో తీరింది. ఇక రెండవ భాగం శౌర్యంగా పర్వం ఇంకా ఎన్ని రికార్డులు బద్దలుకొడుతుందో వెయిట్ చేయాలి. అందులో మరింత మాస్ టచ్ ఇవ్వబోతున్నట్లు తొలి భాగం చూస్తేనే అర్థమౌతుంది. ప్రశాంత్ నీల్ తనదైన మార్క్ డైరెక్షన్‌తో తొలి భాగాన్ని తెరకెక్కించాడు. అలాగే సలార్ -2 కూడా త్వరగా థియేటర్లలోకి తీసుకురావాలని నీల్‌ను రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. తొలి భాగంలో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలకు.. మలిభాగంలో సమాధానాలు దొరకనున్నాయి. ఈ మూవీలో శృతి హాసన్, పృథ్వీ సుకుమారన్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు తదితరులు నటించారు.

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş