Salaar: ఈ 20 థియేటర్లలో సలార్‌ మూవీ బెనిఫిట్‌ షోలు!

ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీ బుకింగ్స్‌ మొదలయ్యాయి. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ విషయంలో దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా సలార్‌ మూవీ రికార్డులు క్రియేట్‌ చేస్తోంది.

ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీ బుకింగ్స్‌ మొదలయ్యాయి. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ విషయంలో దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా సలార్‌ మూవీ రికార్డులు క్రియేట్‌ చేస్తోంది.

సలార్‌ మూవీ విడుదలకు కేవలం ఒక్క రోజు మాత్రమే ఉంది. గురువారం అర్థరాత్రి నుంచే సలార్‌ పండుగ మొదలవుతుంది. బెనిఫిట్‌ షోలతో సినిమా మొదలకానుంది. ఇప్పటికే టికెట్ల రేట్ల పెంపు​కు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. అంతేకాదు! తెలంగాణ ప్రభుత్వం రోజులో ఆరు షోలకు అనుమతి కూడా ఇచ్చింది. గురువారం అర్థరాత్రి నుంచే సలార్‌ మూవీ సందడి చేయనుంది. అయితే, రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో కాకుండా కొన్ని థియేటర్లలో మాత్రమే బెనిఫిట్‌ షోలు ఉండనున్నాయి.

హైదరాబాద్‌లో దాదాపు 12 థియేటర్లలో బెనిఫిట్‌ షోలు పడనున్నాయి.

  • నెక్సస్ మాల్ – కూకట్‌పల్లి
  • ఏఎంబీ సినిమాస్ – గచ్చిబౌలి
  • భ్రమరాంబ – కూకట్‌పల్లి
  • మల్లికార్జున – కూకట్‌పల్లి
  • అర్జున్ – కూకట్‌పల్లి
  • విశ్వనాథ్ – కూకట్‌పల్లి
  • సంధ్య 70ఎంఎం – ఆర్టీసీ క్రాస్‌రోడ్స్
  • సంధ్య 35ఎంఎం – ఆర్టీసీ క్రాస్‌రోడ్స్
  • రాజధాని డీలక్స్ – దిల్‌సుఖ్ నగర్
  • శ్రీరాములు – మూసాపేట
  • గోకుల్ – ఎర్రగడ్డ
  • శ్రీ సాయిరాం – మల్కాజిగిరి థియేటర్లలో అర్థరాత్రి షోలు పడనున్నాయి.

రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు..

  • ఎస్వీసీ తిరుమల – ఖమ్మం
  • వినోద్ – ఖమ్మం
  • వెంకటేశ్వర – కరీంనగర్
  • నటరాజ్ – నల్గొండ
  • ఎస్వీసీ విజయ – నిజామాబాద్
  • వెంకటేశ్వర – మహబూబ్ నగర్
  • శ్రీనివాసా – మహబూబ్ నగర్
  • రాధిక – వరంగల్‌లలో కూడా అర్థరాత్రి షోలు పడనున్నాయి.

ఇక, ప్రపంచ వ్యాప్తంగా సలార్‌ సినిమా డిసెంబర్‌ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కొద్దిరోజుల క్రితం నుంచే ఓవర్‌సీస్‌తో పాటు దేశంలోని పలు ముఖ్య పట్టణాల్లో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ మొదలయ్యాయి.

ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో ప్రీబుకింగ్స్‌ ప్రారంభం అయి రికార్డులు సైతం క్రియేట్‌ చేశాయి. అయితే, రెండు తెలుగు రాష్ట్రాల ప్రీ బుకిం‍గ్స్‌కు సంబంధించి నిన్నటి నుంచే బుక్‌ మై షోలో టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. సలార్‌ టీం టికెట్ల పెంపు కోసం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను విజ్ఞప్తి చేయగా.. జీవో రావటానికి ఆలస్యం అయింది. జీవో విడుదల అయిన వెంటనే బుకిం‍గ్స్‌ మొదలయ్యాయి. వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌ దెబ్బకు సైట్‌ కూడా క్రాస్‌ అయింది.

మళ్లీ యథాప్రకారం బుకింగ్స్‌ సాగుతున్నాయి. కాగా, సలార్‌ టీం ప్రమోషన్ల విషయంలో పెద్దగా ఆసక్తి చూపలేదు. ప్రశాంత్‌ నీల్‌- ప్రభాస్‌ల మీద నమ్మకంతో ముందడుగేసింది. ఒక పాట, రెండు ట్రైలర్లు, జక్కన్నతో ఇంగ్లీష్‌లో ఓ ఇంటర్వ్యూతో సరిపెట్టింది. మొదటి ట్రైలర్‌ ఇప్పటి వరకు 175 మిలియన్ల వ్యూస్‌ సంపాదించగా.. రెండో ట్రైలర్‌ కూడా వంద మిలియన్లకు పైగా వ్యూస్‌ను కొల్లగొట్టింది. మరి, సలార్‌ మూవీపై మీ అంచనాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.

Show comments