Salaar: ఈ కుర్రాడ్ని గుర్తుపట్టారా? ‘సలార్’ కథంతా ఇతని చుట్టే..!

‘సలార్’ సినిమాలో నటించిన ఈ కుర్రాడ్ని గుర్తుపట్టారా? ఆ మూవీ కథంతా ఇతని చుట్టూనే తిరుగుతుంది. ఈ కుర్రాడికి ‘సలార్’తో ఉన్న కనెక్షన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

‘సలార్’ సినిమాలో నటించిన ఈ కుర్రాడ్ని గుర్తుపట్టారా? ఆ మూవీ కథంతా ఇతని చుట్టూనే తిరుగుతుంది. ఈ కుర్రాడికి ‘సలార్’తో ఉన్న కనెక్షన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

‘సలార్’.. ఇండియా మొత్తాన్ని షేక్ చేస్తున్న మూవీ. రిలీజ్​కు ముందే దేశం మొత్తాన్ని ఊపేస్తోందీ సినిమా. రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు ఫిల్మ్ లవర్స్ అందరూ ఇప్పుడు ‘సలార్’ నామస్మరణ చేస్తున్నారు. జీరో ప్రమోషన్స్​తో మూవీపై ఎక్స్​పెక్టేషన్స్​ ఆకాశాన్ని అంటేలా చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రెస్ మీట్స్ లేకుండానే సినిమా మీద బజ్ నెలకొనేలా చేశారు. ప్రభాస్​తో తన కాంబో అనగానే అంచనాలు ఉంటాయని అనుకున్నట్లున్నారు. దానికి తోడు టీజర్, పాటలు, ట్రైలర్స్​కు మంచి రెస్పాన్స్ రావడంతో ఎక్స్​పెక్టేషన్స్ మరింత పెరుగుతాయనే ధీమాతోనే అలా చేశారేమో. అయితే ఆయన అనుకున్నదే జరుగుతోంది. ‘సలార్’ అడ్వాన్స్ బుకింగ్స్​లో కొత్త రికార్డులు పెడుతోంది. ఈ మూవీ టికెట్స్ కోసం ఆడియెన్స్​ ఎగబడుతుండటంతో బుక్ మై షో సర్వర్ కూడా క్రాష్ అయింది. ఇక, రిలీజ్​కు ముందు ఇందులో యాక్ట్ చేసిన నటీనటుల ఇంటర్వ్యూలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

‘సలార్’లో యాక్ట్ చేసిన ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. ఈ సినిమా మొత్తం ఆ కుర్రాడి చుట్టూనే తిరుగుతుంది. అతడు మరెవరో కాదు.. చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ దేవ్. ‘సలార్’లో చిన్నప్పటి పృథ్వీరాజ్ సుకుమారన్ రోల్​లో కనిపిస్తున్నాడు కార్తికేయ. మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ ట్రైలర్​లో కార్తికేయ దేవ్ తన యాక్టింగ్, ఇంటెన్స్ లుక్స్​తో ఆకట్టుకున్నాడు. ‘సలార్’లో తన రోల్, సినిమాలోని స్పెషాలిటీస్ గురించి పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడతను. అలాగే తన పర్సనల్ లైఫ్ గురించి కూడా పంచుకున్నాడు. తాను ప్రస్తుతం పదో తరగతి చదువుకుంటున్నానని అన్నాడు. తన సొంతూరు ప్రకాశం జిల్లా అని.. కానీ హైదరాబాద్​లో ఫ్యామిలీ సెటిల్ అయ్యిందన్నాడు. ఓ క్యాస్టింగ్ డైరెక్టర్ ద్వారా తనకు ‘సలార్​’ మూవీలో రిహార్సల్ చేసే ఛాన్స్ వచ్చిందన్నాడు. తన యాక్టింగ్ నచ్చడంతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అవకాశం ఇచ్చారన్నాడు.

సినిమా స్టార్టింగ్​లో తన పాత్ర చాలా సేపు ఉంటుందని.. అలాగే మూవీ మొత్తం తన క్యారెక్టర్​కు సంబంధించిన షాట్స్ పడుతూనే ఉంటాయని తెలిపాడు కార్తికేయ దేవ. ‘సలార్​’లో తన యాక్టింగ్ నచ్చడంతో ‘లూసిఫర్ 2’లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆఫర్ ఇచ్చారని చెప్పాడు. ‘లూసిఫర్’ సీక్వెల్​లో తన చిన్నప్పటి రోల్​కు పృథ్వీరాజ్ సెలక్ట్ చేశారని పేర్కొన్నాడు. ఇక, ‘సలార్’ నుంచి బయటకు వచ్చిన రెండు ట్రైలర్స్​తో పాటు ‘సూరీడే’ పాటలోనూ కార్తికేయ దేవ తన యాక్టింగ్​, స్క్రీన్ ప్రెజెన్స్​తో ఆకట్టుకున్నాడు. ఎక్స్​పీరియెన్స్ లేకపోయినా అతడు సినిమాలో డైలాగ్స్ చెబుతున్న తీరు, ఇంటెన్స్ లుక్స్​ ఈ కుర్రాడికి మంచి ఫ్యూచర్ ఉందనే భరోసాను ఇస్తున్నాయి. మరి.. ‘సలార్’ ట్రైలర్స్​లో కార్తికేయ దేవ యాక్టింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సూపర్ స్టార్ తో ఉన్న ఈ బుడ్డోడు.. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్!

Show comments