Venkateswarlu
Saindhav Trailer Review: సైంధవ్ జనవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం ఈ చిత్ర ట్రైలర్ విడుదల అయింది. ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది.
Saindhav Trailer Review: సైంధవ్ జనవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం ఈ చిత్ర ట్రైలర్ విడుదల అయింది. ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది.
Venkateswarlu
విక్టరీ వెంకటేష్- శ్రద్ధా శ్రీనాథ్‌లు హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సైంధవ్’. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 13వ తేదీ నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. విడుదలకు కేవలం కొన్ని రోజులే ఉన్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. గత కొంతకాలంగా టీజర్లు, పాటలు విడుదల చేస్తూ వచ్చింది. బుధవారం ట్రైలర్‌ను విడుదల చేసింది.
బుధవారం విడుదల అయిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక, సైంధవ్ మూవీలో రుహానీ శర్మ, ఆర్య, నవాజుద్ధీన్ సిద్ధిఖీ, ఆర్య, ఆండ్రియా జెర్మయ్యా తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. హిట్ సినిమాల దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఇక, ఈ మూవీనుంచి విడుదలైన ప్రతీ పాటకు మంచి స్పందన వచ్చింది.
3.36 నిమిషాల నిడివి కల ఈ ట్రైలర్‌లో దర్శకుడు తాను చెప్పాలనుకున్న పాయింట్‌ను చెప్పేశాడు. కథ మొత్తం తండ్రీ కూతురు మధ్య నడిచినా.. వెంకీ మాస్ యాంగిల్స్‌కు ఏమాత్రం కొరత లేదు. ట్రైలర్‌ను బట్టి చూస్తే.. కూతురి కోసం నేర సామ్రాజ్యాన్ని వదులుకుని ఉంటాడు వెంకీ. ఏ కూతురి కోసం అన్నీ వదిలేసి సంతోషంగా బతకాలని అనుకుంటాడో.. ఆ కూతురే ప్రమాదంలో పడుతుంది. పాప ఓ అరుదైన రోగంతో బాధపడుతూ ఉంటుంది. పాపను రక్షించుకోవటానికి కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. అలాంటి సమయంలో వెంకీ ప్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు. మళ్లీ నేర సామ్రాజ్యం వైపు వస్తాడు. ఇంతకీ అతడి ప్లాష్ బ్యాక్ ఏంటి? కూతురి కోసం మళ్లీ అందులోకి అడుగుపెట్టిన తర్వాత ఏమవుతుంది? కూతుర్ని బతికించుకుంటాడా? లేదా? అన్నదే మిగిలిన కథ.
కాగా, వెంకటేష్ చివరగా ఎఫ్3 సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఈ మూవీ 2022లో విడుదల అయింది. ఆ తర్వాత 2023లో ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులను పలకరించారు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్‌కు మంచి స్పందన వచ్చింది. వెంకటేష్‌తో పాటు రానా కూడా నటించాడు. అయితే, వెబ్ సిరీస్‌పై నెగిటివ్ కామెంట్లు ఎక్కువయ్యాయి. బూతులు ఎక్కువగా ఉన్నాయంటూ చూసిన వాళ్లలో 90 శాతం మంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. మరి, సైంధవ్ ట్రైలర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.