iDreamPost
android-app
ios-app

Virat Kohli: కోహ్లీ నాకు బావ అవుతాడు! తెలుగు హీరోయిన్‌ షాకింగ్‌ స్టేట్‌మెంట్‌

  • Published Jan 11, 2024 | 2:28 PM Updated Updated Jan 11, 2024 | 3:29 PM

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో మంది కొత్త హీరోయిన్స్ వస్తుంటారు. అయితే ఈ క్రమంలో ఓ తెలుగు సినీ హీరోయిన్ కు ఓ స్టార్ క్రికెటర్ బావ అవుతారట. ఈ విషయాన్నీ స్వయంగా ఆ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. దీనితో ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో మంది కొత్త హీరోయిన్స్ వస్తుంటారు. అయితే ఈ క్రమంలో ఓ తెలుగు సినీ హీరోయిన్ కు ఓ స్టార్ క్రికెటర్ బావ అవుతారట. ఈ విషయాన్నీ స్వయంగా ఆ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. దీనితో ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

  • Published Jan 11, 2024 | 2:28 PMUpdated Jan 11, 2024 | 3:29 PM
Virat Kohli: కోహ్లీ నాకు బావ అవుతాడు! తెలుగు హీరోయిన్‌ షాకింగ్‌ స్టేట్‌మెంట్‌

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎక్కడో ఓ దగ్గర ఒకరితో ఒకరికి బంధుత్వం ఉంటుంది. అయితే, ఇక్కడ ఓ టాలీవుడ్ తారకు ఏకంగా ఓ స్టార్ క్రికెటర్ స్వయానా బావ అవుతారట. వీరిద్దరి మధ్య బంధుత్వం ఉన్న సంగతి తెలుసుకున్న నెటిజన్లు.. ఈ హీరోయిన్ గురించి తెగ వెతికేస్తున్నారు. వారు ఇంతలా సెర్చ్ చేయడానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే క్రికెట్ లో ఈ వ్యక్తి గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. దేశమంతటా ఈ ఆటగాడికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆ స్టార్ క్రికెటర్ మరెవరో కాదు భారత బ్యాట్స్మన్ “విరాట్ కోహ్లీ”. ఈ ఆటగాడి కుటుంబంతో బంధుత్వం ఉన్న హీరోయిన్ “రుహానీ శర్మ”. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ నటి .. వారి మధ్య ఉన్న బంధుత్వాన్ని బయట పెట్టింది. దీనితో ఈ విషయం సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది.

తెలుగులో చి॥ల॥సౌ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది రుహానీ శర్మ. తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళ చిత్రాల్లోనూ ఆమె నటిస్తూ ఉంటుంది. ఆమె నటించిన ప్రతి చిత్రంలోనూ మంచి పాత్రలను పోషిస్తూ.. ప్రేక్షకులలో మంచి పేరును సంపాదించుకుంది. అయితే, ఈ భామ తెలుగులో తాజాగా నటించిన చిత్రం “సైంధవ్‌”. వెంకటేష్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో రుహాని శర్మ కూడా ముఖ్య పాత్రను పోషించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీనితో ప్రస్తుతం చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో రుహాని మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి మాత్రమే కాకుండా.. తన వ్యక్తి గత విషయాలను కూడా పంచుకుంది. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ అనుష్క శర్మకు మీకు బంధుత్వం ఉంది కదా అని ప్రశ్నించగా.. ఈ భామ ఒక్కసారిగా షాక్ అయ్యి ఇలా చెప్పుకొచ్చింది. “నిజమే.. ఇది టాప్ సీక్రెట్. నా పర్సనల్ విషయాలు ఎన్నడూ, ఎక్కడా ప్రస్తావించలేదు.. మీకెలా తెలిసింది? మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా.. అనుష్కా నాకు అక్క అవుతుంది. విరాట్ కోహ్లీ నాకు బావ అవుతారు. వారిద్దరూ అందరితో చాలా మంచిగా ఉంటారు. అందుకే వారంటే నాకు చాలా ఇష్టం..” అంటూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది ఈ అమ్మడు.

kohli is my cousin

ఇక సైంధవ్‌ చిత్రం గురించి మాట్లాడుతూ.. “నేను చిన్నపటినుంచి వెంకీ సర్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పడు ఆయనతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. నేను డాక్టర్ అవ్వాలి అనుకున్నాను. కానీ, సినిమాల వలన అది సాధ్యపడలేదు. సైంధవ్‌ చిత్రంలో డాక్టర్ పాత్ర పోషించడం సంతోషంగా ఉంది. ” అంటూ రుహాని చెప్పుకొచ్చింది. సైంధవ్‌ చిత్రం జనవరి13న థియేటర్ లలో సందడి చేయనుంది. సైంధవ్‌ విక్టరీ వెంకటేష్ కు 75వ సినిమా కావడంతో.. అభిమానులకు ఇప్పటికే ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి, ఈ చిత్రం ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. ఏదేమైనా.. రుహని శర్మ ఆమెకు విరాట్ కోహ్లీకు మధ్య ఉన్న రిలేషన్ గురించి చెప్పిన తర్వాత..ఇప్పుడు అందరి దృష్టి ఆమెపైన ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త హల్చల్ చేస్తోంది. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet