iDreamPost
android-app
ios-app

సాయి పల్లవి ఇంట పెళ్లి బాజాలు.. లవర్ని పరిచయం చేసిందిగా!

  • Published Jan 16, 2024 | 6:35 PM Updated Updated Jan 16, 2024 | 6:35 PM

త్వరలో లేడీ న్యాచురల్ స్టార్ సాయి పల్లవి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. తాజాగా సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన పోస్ట్.. నెట్టింట చక్కర్లు కొడుతోంది.

త్వరలో లేడీ న్యాచురల్ స్టార్ సాయి పల్లవి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. తాజాగా సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన పోస్ట్.. నెట్టింట చక్కర్లు కొడుతోంది.

  • Published Jan 16, 2024 | 6:35 PMUpdated Jan 16, 2024 | 6:35 PM
సాయి పల్లవి ఇంట పెళ్లి బాజాలు.. లవర్ని పరిచయం చేసిందిగా!

పబ్లిక్ లో ఫుల్ క్రేజ్ ఉన్న సెలెబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు.. వివాహ బంధం లోకి అడుగుపెడుతున్నారు. తమిళ, తెలుగు, మలయాళ ఇండస్ట్రీలో సహజ నటిగా పేరు పొందింది సాయి పల్లవి. ఈ అందాల భామ గురించి ఎప్పుడు చెప్పుకున్నా ప్రత్యేకమే. అయితే, ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కనిపించడమే అరుదు. ఒకవేళ కనిపించినా అది తన చెల్లిలితో దిగిన ఫొటోలే ఎక్కువగా ఉంటాయి. అవి కూడా తన చెల్లి పూజ పూజా కన్నన్‌ ఏ షేర్ చేస్తుంది. సాయి పల్లవి సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టీవ్ గా లేకపోయినా.. తన చెల్లి మాత్రం యాక్టీవ్ గానే ఉంటుంది. ఆమెకు సామాజిక మాధ్యమాలలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక సాయి పల్లవి ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయని.. తాజాగా పూజ కన్నన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ బాంబు పేల్చింది.

సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నన్ కూడా.. అక్క బాటలోనే సినిమాలలోకి వస్తుంది అనుకున్నారు అంతా. ఆమెకూడా తమిళంలో ఓ సినిమాను తీసింది. ఆ తరువాత ఇంకా ఏ సినిమాలను చేయలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం తరచు యాక్టీవ్ గానే ఉంటుంది ఈ అమ్మడు. న్యూ ఇయర్ రోజున వీరిద్దరూ దిగిన చిత్రాలు కూడా చాలా వైరల్ అయ్యాయి. అయితే , ఇప్పటివరకు వీరి ఇద్దరి పెళ్లి ప్రస్తావన ఇంతవరకు బయటకు రాలేదు. కానీ, తాజాగా పూజ కన్నన్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పెళ్లి విషయాన్నీ బయటపెట్టింది. పూజ తన ప్రియుడిని పరిచయం చేసి అందరిని ఒక్కసారిగా సర్ప్రైజ్ చేసింది. అక్క కంటే ముందు చెల్లెలు పెళ్లి చేసుకోబోతున్నమాట.

“నాకు అన్నింట్లో పార్ట్నర్‌గా ఉండే వ్యక్తి ఇప్పుడు నిజ జీవితంలో భాగస్వామి కాబోతోన్నాడు” అంటూ .. తనకు కాబోయే భర్తతో కలిసి దిగిని ఫోటోలను షేర్ చేసింది. “నిస్వార్థమైన ప్రేమను పరిచయం చేశాడు.. సహనంగా ఉండటం నేర్పించాడు.. ప్రేమలో నిబద్దతను చూపించాడు.. ఈ వినీత్ నా సూర్య కిరణం.. నా ఆశా కిరణం.. క్రైమ్‌లో నా పార్ట్నర్ అంటే నాకు ఇష్టం.. ఇక ఇప్పుడు జీవిత భాగస్వామి అవుతున్నాడు “అంటూ.. తన ప్రేమను వ్యక్త పరిచింది ఈ అమ్మడు. దీనితో అందరూ పూజని కంగ్రాట్యులేషన్స్ అంటూ విష్ చేయడం మొదలుపెట్టారు. అక్కకంటే చెల్లెలు ఫాస్ట్ గా ఉందంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. చూడబోతుంటే వీరి ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ప్రస్తుతం పూజ కన్నన్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

ఇక సాయి పల్లవి విషయానికొస్తే.. ఈ ముద్దగుమ్మకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదట. అందుకే ఆమె చెల్లెలు తన ప్రేమ విషయాన్నీ ప్రకటించినట్లు తెలుస్తోంది. కాబట్టి ముందు చెల్లెలి పెళ్లి అయిన తర్వాతనే అక్క పెళ్లి అవ్వబోతుంది. కానీ, సాయి పల్లవి పెళ్లి విషయంలో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి ఈ భామ ఎపుడు పెళ్లి వార్తను చెబుతోందో.. ఆ వార్త ఎంత మంది కుర్రాళ్ళ మనస్సును గాయపరుస్తుందో వేచి చూడాలి. కాగా, సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి తండేల్ చిత్రంలో నటిస్తోంది. ఇక ఇప్పటికైతే ఆమె చెల్లెలు పూజ కన్నన్ తన ప్రియుడి గురించి.. షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ వైరల్ అవుతోంది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Pooja Kannan (@poojakannan_97)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss