iDreamPost
android-app
ios-app

రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో సాయి పల్లవి !

  • Published Nov 23, 2024 | 4:52 PM Updated Updated Nov 23, 2024 | 4:52 PM

RC17 Update: RC 16 కూడా ఎదో మ్యాజిక్ క్రియేట్ చేసేలా ఉందని అంతా నమ్ముతున్నారు. అయితే ఈ సినిమా ఇంకా పూర్తి కాకముందే. అప్పుడే రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. బుచ్చి బాబుతో సినిమా తర్వాత చరణ్ సుకుమార్ తో ఓ సినిమా తీయబోతున్నాడట.

RC17 Update: RC 16 కూడా ఎదో మ్యాజిక్ క్రియేట్ చేసేలా ఉందని అంతా నమ్ముతున్నారు. అయితే ఈ సినిమా ఇంకా పూర్తి కాకముందే. అప్పుడే రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. బుచ్చి బాబుతో సినిమా తర్వాత చరణ్ సుకుమార్ తో ఓ సినిమా తీయబోతున్నాడట.

  • Published Nov 23, 2024 | 4:52 PMUpdated Nov 23, 2024 | 4:52 PM
రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో సాయి పల్లవి !

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మరో వైపు  చరణ్ ఒప్పుకున్న బుచ్చి బాబు ప్రాజెక్ట్ కూడా సెట్స్ పైకి వెళ్తుంది . దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాము. వీలైనంత త్వరగాఈ సినిమాను కంప్లీట్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతుందని సమాచారం. ప్రస్తుతానికైతే ఈ సినిమా మీద డీసెంట్ హైప్ నెలకొంది. ఎందుకంటే విలేజ్ నేటివిటీ ఉండే సినిమాలకు ఇప్పుడు ఎక్కువ ఆదరణ లభిస్తుంది. సో ఈ లెక్కన RC 16 కూడా ఎదో మ్యాజిక్ క్రియేట్ చేసేలా ఉందని అంతా నమ్ముతున్నారు. అయితే ఈ సినిమా ఇంకా పూర్తి కాకముందే. అప్పుడే రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. బుచ్చి బాబుతో సినిమా తర్వాత చరణ్ సుకుమార్ తో ఓ సినిమా తీయబోతున్నాడట. ఈ సినిమా అనౌన్సుమెంట్ కూడా జరిగిందట.

ప్రస్తుతం సుక్కు పుష్ప 2 సినిమాను చెక్కే పనిలో ఉన్నాడు. ఈ సినిమాతో సుక్కు దశ తిరగడం ఖాయం. అందులో ఎలాంటి సందేహం లేదు. దీని తర్వాత కాస్త రిలాక్స్ అయ్యి ‘RC 17’ మూవీ స్క్రిప్ట్ పై సుకుమార్ వర్క్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికి రఫ్ స్క్రిప్ట్ రెడీ అయినా.. ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. అసలే సుకుమార్ ప్రతి ఫ్రేమ్ ను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాడు. స్క్రిప్ట్ డెవలప్మెంట్ నుంచి మూవీ రిలీజ్ వరకు ప్రతి దానిని.. చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయడం సుక్కు దగ్గరే నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు ఈ RC 17 గురించి  ఇండస్ట్రీలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా హీరోయిన్ సాయి పల్లవిని తీసుకోవాలని అనుకుంటున్నారట మేకర్స్. సాయి పల్లవికి ఎలాంటి క్రేజ్ ఉందొ తెలియనిదని కాదు. పైగా సుకుమార్ హీరోయిన్ క్యారెక్టర్స్ ను చాలా బలంగా డిజైన్ చేస్తాడు. సో సుకుమార్ డైరెక్షన్ కు గ్లోబర్ స్టార్ ఇమేజ్ , సాయి పల్లవి లాంటి గ్లామర్ యాడ్ అయితే.. పోతారు స్క్రీన్ మీద ఆ కాంబినేషన్ చూసి మొత్తం పోతారు అని చెప్పుకోవడం ఒక్కటే తక్కువ అవుతుంది.

కథ నచ్చితే కనుక సాయి పల్లవి కూడా ఆల్మోస్ట్ ఒకే చెప్తుంది. ఇప్పటికే స్టార్ హీరోలతో సినిమాలు చేయకపోయిన సరే ఆమెకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. సో ఈ మూవీ కనుక ఒకే అయితే ఆమె క్రేజ్ డబుల్ అవ్వడం ఖాయం. ప్రస్తుతం సాయి పల్లవి తండేల్ సినిమా తో బిజీగా ఉంది. ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దానితో పాటు రన్ బీర్ తో కలిసి రామాయణం లోను నటిస్తుంది. ఇక రానున్న రోజుల్లో ఈ అమ్మడు ఎలాంటి ఆఫర్లు అందుకుంటుందో చూడాలి. ఇక RC 17 లో సాయి పల్లవి నటిస్తుందన్న మ్యాటర్ లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. కానీ ఈ న్యూస్ మాత్రం మ్యూచువల్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişgrandpashabet girişgrandpashabet