iDreamPost
android-app
ios-app

Sai Pallavi: సాయి పల్లవి బర్త్‌డే స్పెషల్‌.. తండేల్‌ నుంచి స్పెషల్‌ వీడియో రిలీజ్‌

  • Published May 09, 2024 | 10:24 AM Updated Updated May 09, 2024 | 10:24 AM

Thandel: హైబ్రీడ్‌ పిల్ల సాయి పల్లవి బర్త్‌ డే నేడు. ప్రస్తుతం ఆమె తెలుగులో తండేల్‌ చిత్రంలో నటిస్తోంది. ఈ క్రమంలో పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక వీడియోను రిలీజ్‌ చేసింది తండేల్‌ టీమ్‌. ఆ వివరాలు..

Thandel: హైబ్రీడ్‌ పిల్ల సాయి పల్లవి బర్త్‌ డే నేడు. ప్రస్తుతం ఆమె తెలుగులో తండేల్‌ చిత్రంలో నటిస్తోంది. ఈ క్రమంలో పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక వీడియోను రిలీజ్‌ చేసింది తండేల్‌ టీమ్‌. ఆ వివరాలు..

  • Published May 09, 2024 | 10:24 AMUpdated May 09, 2024 | 10:24 AM
Sai Pallavi: సాయి పల్లవి బర్త్‌డే స్పెషల్‌.. తండేల్‌ నుంచి స్పెషల్‌ వీడియో రిలీజ్‌

సాయి పల్లవి.. తెలుగులో ఈమెకున్న క్రేజ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఈ అమ్మడికి సౌత్‌ మొత్తం ఫ్యాన్స్‌ ఉన్నారు. కారణం ఆమె టాలెంట్‌ ఒకటైతే.. ఆమె ఎన్నుకునే సినిమాలు మరోటి. ఎంతటి స్టార్‌ హీరో అయినా సరే. కథలో తన పాత్రకు తగిన ప్రాధాన్యత ఉంటేనే ఆ చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపుతుంది. లేదంటే ఎన్ని కోట్లు ఇస్తామన్నా నో చెప్పేస్తుంది. ఇక మిగతా హీరోయిన్ల మాదిరి యాడ్స్‌, బ్యూటీ ప్రొడక్ట్స్‌ వంటి వాటిని అస్సలు ప్రమోట్‌ చేయదు ఈ అమ్ముడు. నాచురల్‌ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. సౌత్‌లో వరుస సినిమాలు చేస్తూ.. బిజీగా ఉన్న సాయి పల్లవి.. ఇప్పుడు బాలీవుడ్‌ బడా ప్రాజెక్ట్‌ రామాయణతో పాన్‌ ఇండియా హీరోయన్‌గా మారింది. ప్రస్తుతం తెలుగులో తండేల్‌ సినిమాలో యాక్ట్‌ చేస్తుంది సాయి పల్లవి.

ఇక నేడు ఈ హైబ్రీడ్‌ పిల్ల బర్త్‌డే. ఈ సందర్భంగా తండేల్‌ యూనిట్‌ సాయి పల్లవిపై ఓ స్పెషల్‌ వీడియో తయారు చేసి రిలీజ్‌ చేసింది. ఆమె ఇప్పటి వరకు చేసిన సినిమాల్లోని పాత్రలను చూపిస్తూ.. తండేల్‌లో బుజ్జితల్లి క్యారెక్టర్‌ని రివీల్‌ చేశారు. షూటింగ్‌ సమయంలో చోటు చేసుకున్న చిన్న చిన్న సరదా సంఘటనలు.. లోకల్‌లో షూటింగ్‌ జరుగుతున్నప్పుడు సాయి పల్లవి వారితో ఎలా కలిసి పోయింది.. అక్కడున్న పిల్లలతో ఎలా ఆడుకుంది.. వంటి అంశాలను ఈ వీడియోలు చూపిస్తూ ఆసక్తికరంగా మలిచారు. బుజ్జితల్లి బర్త్‌డే స్పెషల్‌ మీడియో అదిరిపోయింది అంటున్నారు నెటిజనులు. ఇక తండేల్‌ నుంచి ఇప్పటి వరకు అప్డేట్స్‌ అని ప్రేక్షకులను ఆకట్టుకోగా.. సాయి పల్లవి బర్త్‌ డే వీడియో కూడా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఇప్పుడిది నెట్టింట వైరల్‌ అవుతుంది.

చందు మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా నటిస్తోన్న చిత్రం తండేల్‌. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఇటీవల ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుంది అని వార్తలు వచ్చియ. ఇక నాగ చైతన్య మూడవసారి దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో పని చేయడం ఇది మూడోసారి. తండేల్‌ చిత్రంలో వీరిద్దరూ కలిసి జాతీయవాద అంశాలతో కూడిన గ్రామీణ ప్రేమకథను రూపొందిస్తున్నారు. ఇక సాయి పల్లవి, నాగ చైతన్య కలిసి నటించడం ఇది రెండో సారి. ఇక గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబర్‌ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు  రానుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş