iDreamPost
android-app
ios-app

బాలీవుడ్ లో సాయి పల్లవిపై కొత్త కుట్ర.. ఇంత అక్కసు ఎందుకు?

  • Published Apr 29, 2024 | 5:49 PM Updated Updated Apr 29, 2024 | 5:49 PM

Sai Pallavi As Sita: సాయి పల్లవి నటనకు దేశవ్యాప్తంగా ఎంతో మంచి ఆదరణ ఉంది. తాజాగా ఆమె సీతగా నటిస్తున్న విషయంపై క్లారిటీ రావడంతో అంతా హ్యాపీగా ఉన్నారు. కానీ, కొత్తగా ఆమెపై బాలీవుడ్ లో ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది.

Sai Pallavi As Sita: సాయి పల్లవి నటనకు దేశవ్యాప్తంగా ఎంతో మంచి ఆదరణ ఉంది. తాజాగా ఆమె సీతగా నటిస్తున్న విషయంపై క్లారిటీ రావడంతో అంతా హ్యాపీగా ఉన్నారు. కానీ, కొత్తగా ఆమెపై బాలీవుడ్ లో ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది.

  • Published Apr 29, 2024 | 5:49 PMUpdated Apr 29, 2024 | 5:49 PM
బాలీవుడ్ లో సాయి పల్లవిపై కొత్త కుట్ర.. ఇంత అక్కసు ఎందుకు?

సాయి పల్లవి న్యాచురల్ టాలెంట్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ లోనే కాకుండా.. బాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ని పొందింది. ఏ భాష అయినా ఆమె సహజసిద్ధమైన యాక్టింగ్ కి అంతా ఫిదా అయిపోతున్నారు. అందుకే ఆమెకు అన్ని ఇండస్ట్రీల నుంచి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ లో కూడా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అది కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైన రామాయణం సినిమాలో రణబీర్ కపూర్ పక్కన సీతగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆ మూవీకి సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని నెట్టింట వైరల్ గా మారాయి. వాటి ఆధారంగా ఇప్పుడు ఆమెపై ట్రోలింగ్ తెర లేపారు.

సాధారణంగా బాలీవుడ్ అంటే ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు(ఒకప్పుడు) ఉందేమో గానీ.. ఇప్పుడు మాత్రం అక్కడ జరిగే రాజకీయాల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో జరిగే అరాచకాల గురించి, నెపోటిజం, గాడ్ ఫాదర్ థియరీ, అవుట్ సైడర్స్ పై చూపించే అక్కసు గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పటికే ఎంతో మంది స్టార్ డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు వారికి అక్కడ ఎదురైన అవమానాలు, వారిపై జరిగిన కుట్రల గురించి చాలాసార్లు చెప్పారు. తెలుగు యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా బాలీవుడ్ పై కీలక వ్యాఖ్యలు చేయడం చూశాం. అలాంటి బాలీవుడ్ ఇప్పుడు మరోసారి తమ వంకర బుద్ధిని బయట పెట్టింది. సీత పాత్రకు సాయి పల్లవి సరి తూగదు అంటూ ట్రోలింగ్ స్టార్ట్ చేసింది.

Saipallavi

ఇటీవల సోషల్ మీడియాలో రణబీర్ కపూర్ రాముడిగా.. ఆయన పక్కన సాయి పల్లవి సీతగా ఉన్న ఫొటోలు నెట్టింట ఫుల్ హంగామా చేశాయి. ఎప్పటి నుంచో వారి పాత్రలకు సంబంధించి ఊహాగానాలు విన్నాం. కానీ, తాజాగా వారిని ఆ గెటప్స్ లో చూసే సరికి అభిమానులకు, సినిమా లవర్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అయితే బాలీవుడ్ నాట మాత్రం సాయి పల్లవిని టార్గెట్ చేస్తూ ఒక వర్గం దారుణమైన ట్రోలింగ్ కి దిగింది. అసలు సీత పాత్రకు సాయి పల్లవి సరిపోవడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె సీత పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేయలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే నిజంగా సాయి పల్లవి యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నారా?

నార్త్ భామలకు కాకుండా.. సాయి పల్లవికి అంతటి గొప్ప పాత్ర దొరికిందని అక్కసుతో మాట్లాడుతున్నారో అందరికీ అర్థమవుతోంది. ఎందుకంటే సాయి పల్లవి నటన గురించి ఎవరూ ప్రత్యేకంగా సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. శ్యామ్ సింగరాయ్ సినిమాకి హిందీ ప్రేక్షకుల నుంచి కూడా ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆమె నటన, హావభావాలు, డ్యాన్స్ అన్నింటికి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు చేస్తున్న ట్రోలింగ్ పూర్తిగా ఉద్దేశపూర్వకంగా ఏదో మనసులో పెట్టుకునే చేస్తున్నట్లు తెలుస్తోంది. కావాలనే సాయి పల్లవిపై బాలీవుడ్ లో కుట్ర చేస్తున్నారు అంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ లో సాయి పల్లవిపై కుట్ర జరుగుతోందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by 🔥 DHF of Saipallavi 🔥 (@only_saipallavi)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet