iDreamPost
android-app
ios-app

‘నిన్ను వదలను’అంటూ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న హాలీవుడ్ బ్యూటీ!

  • Published Jul 03, 2024 | 11:38 AM Updated Updated Jul 03, 2024 | 11:38 AM

Russian Actress Lyuba Palm: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో టాలీవుడ్ ఇండస్ట్రీ ఏ రేంజ్‌లో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఒకప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలే హవా సాగించేవి.. కానీ బాహుబలి తర్వాత ట్రెండ్ పూర్తిగా మారిపోయింది.

Russian Actress Lyuba Palm: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో టాలీవుడ్ ఇండస్ట్రీ ఏ రేంజ్‌లో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఒకప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలే హవా సాగించేవి.. కానీ బాహుబలి తర్వాత ట్రెండ్ పూర్తిగా మారిపోయింది.

  • Published Jul 03, 2024 | 11:38 AMUpdated Jul 03, 2024 | 11:38 AM
‘నిన్ను వదలను’అంటూ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న హాలీవుడ్ బ్యూటీ!

తెలుగు ఇండస్ట్రీలో ఇతర భాషకు సంబంధించిన హీరోయిన్లు తర అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అందులో కొద్ది మంది మాత్రమే సక్సెస్ సాధించి స్టార్ హీరోయిన్ రేంజ్ లో కొనసాగుతున్నారు. తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్లుగా సత్తా చాటారు. ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో బాలీవుడ్, కోలీవుడ్ సత్తా చాటేవి.. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి సీరీస్, ఆర్ఆర్ఆర్, కల్కీ మూవీస్ తో ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా రేంజ్ భారీగా పెరిగిపోయింది. తాజాగా ఇప్పుడు హాలీవుడ్ నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి ఓ బ్యూటీ ఎంట్రీ ఇస్తుంది. ఆ నటికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

రష్యాకు చెందిన నటి లియుబా షామ్, కుష్బు జైన్ ప్రధాన పాత్రల్లో యూవీటీ హాలీవుడ్ స్టూడియోస్ (యూఎస్ఏ), శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్ సంయుక్తంగా షిరాజ్ మెహదీ దర్శకత్వంలో వస్తున్న మూవీ ‘నిన్ను వదలను’. ఈ సినిమాకు అశోక్ కుల్లర్ నిర్మాతగా, దేవేంద్ర నెగి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుంది. ఈ మూవీలో గంగాధర్, వైజాగ్ షరీఫ్, వైజాగ్ రవితేజ, అజయ్, అనంత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ గోవా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక రష్యన్ బ్యూటీ లియుబా షామ్ విషయానికి వస్తే.. ఆమె రష్యన్ నటి, గాయని, నిర్మాత. గతంలో ‘సేవ్ ది చిల్డ్రన్’ పేరుతో ఓ డాక్యుమెంటరీ తీసి బాగా పాపులర్ అయ్యారు.

‘లవ్ ఓవర్ ఈవిల్’ టీవీ సీరీస్ కి రైటర్గా, నిర్మాతగా వ్యవహరించారు.  ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో మల్టీటాలెండెగా పేరు తెచ్చుకున్న రష్యన్ భామ లియుబా షామ్ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకునేందుకు గట్టి ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.   దర్శకుడు షిరాజ్ మాట్లాడుతూ.. ‘నిన్ను వదలను’ మూవీ హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం. ఈ మూవీతో రష్యన్ సింగర్, ప్రొడ్యూసర్ అయిన లియుబా షామ్ స్ట్రైట్ తెలుగులో ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న ఈ రష్యన్ బ్యూటీపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş