రెండో పెళ్లి చేసుకోబోతున్న చైతన్య జొన్నలగడ్డ?

  • Author ajaykrishna Updated - 04:50 PM, Tue - 3 October 23
  • Author ajaykrishna Updated - 04:50 PM, Tue - 3 October 23
రెండో పెళ్లి చేసుకోబోతున్న చైతన్య జొన్నలగడ్డ?

ఈ మధ్యకాలంలో పెళ్లి విషయంలో హద్దులు చెరిగిపోయాయి. జీవితంలో ఒకటే పెళ్లి చేసుకోవాలనే ఇండియన్ కల్చర్ ని పెద్దగా పట్టించుకోవట్లేదు. అందరు అని కాదు. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొని.. మూడునాళ్ళ ముచ్చటే అన్నట్లు కొన్నాళ్ళకు విడిపోయి ఇంకో పెళ్లి చేసేసుకుంటున్నారు. ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ.. అదే పని చేయొబోతున్నట్లు తెలుస్తోంది. నిహారికతో విడాకుల అనంతరం చైతన్య.. కొన్నాళ్ళు బ్రేక్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి నిహారికతో విడిపోయి కొన్నాళ్ళు కూడా కాకముందే చైతన్య రెండో పెళ్లి అని తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

ఆ వివరాల్లోకి వెళ్తే.. 2020లో నిహారికతో చైతన్య పెళ్లి జరిగింది. సరిగ్గా రెండేళ్లు కూడా గడవకముందే ఇద్దరు మనస్పర్థల కారణంగా దూరంగా ఉండి.. ఆఖరికి విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే.. ఇద్దరు కూడా విడిపోయాక కొన్నాళ్ళపాటు మళ్ళీ పెళ్లి వైపు వెళ్ళకూడదని అనుకున్నారట. అందుకే నిహారిక ఇండస్ట్రీలో ప్రొడక్షన్ వైపు బిజీ కాగా.. చైతన్య ఇన్నాళ్లు టూర్స్ కి వెళ్ళాడు. కట్ చేస్తే.. ఇప్పుడిప్పుడే చైతన్య మళ్ళీ కెరీర్ పై ఫోకస్ పెడుతున్నాడట. దీంతో తల్లిదండ్రులు మరోసారి పెళ్లి గురించి ప్రస్తావించి.. ఒత్తిడి చేయడంతో రెండో పెళ్లికి చైతన్య అంగీకరించినట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ వార్త అటు ఇండస్ట్రీ వర్గాలలో, ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కాగా.. ఇంతకీ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరా? అని ఆరాలు తీయడం మొదలు పెట్టేశారు. అయితే.. చైతన్య ఫాదర్ ఆల్రెడీ ఏపీ పోలీస్ శాఖలో ఉన్నత అధికారి కావడంతో.. అదే డిపార్ట్మెంట్ కి చెందిన సన్నిహిత ఐపీఎస్ అధికారి కూతురుని కోడలిగా చేసుకునే ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఇటు కుటుంబాల వారు మాట్లాడుకున్నారని.. త్వరలోనే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసే సన్నాహాలు కూడా జరుగుతున్నాయని వినికిడి. ఇక చైతన్య రెండో పెళ్లి అంటూ వస్తున్న వార్తలలో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments