iDreamPost
android-app
ios-app

బయోగ్రఫీలో షాకింగ్‌ విషయాలు.. లేడీ సెక్రటరీతో రేఖ రిలేషన్‌!

  • Published Jul 24, 2023 | 2:20 PM Updated Updated Jul 24, 2023 | 2:20 PM
  • Published Jul 24, 2023 | 2:20 PMUpdated Jul 24, 2023 | 2:20 PM
బయోగ్రఫీలో షాకింగ్‌ విషయాలు.. లేడీ సెక్రటరీతో రేఖ రిలేషన్‌!

సినిమా వాళ్ల జీవితాలపై ఎప్పుడూ.. ఏవో ఒక పుకార్లు షికార్లు చేస్తూ ఉంటాయి. ఇలాంటి పుకార్లలో 90 శాతం అబద్ధాలు ఉంటుంటే.. కేవలం 10 శాతం మాత్రమే నిజాలు ఉంటున్నాయి. ముఖ్యంగా స్టార్‌ హీరో, హీరోయిన్ల వ్యక్తిగత జీవితాల గురించి మరీ ఎక్కువగా పుకార్లు షికార్లు చేస్తుంటాయి. తాజాగా, ప్రముఖ సీనియర్‌ నటి రేఖ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆమె గతంలో ఓ మహిళతో సహజీవనం చేసిందంటూ రేఖ జీవితంపై వచ్చిన బయోగ్రఫీలో రాయటం  సంచలనంగా మారింది.

ఆ వివరాల్లోకి వెళితే.. ప్రముఖ జర్నలిస్ట్‌ యాషిర్‌ ఉస్మాన్‌.. రేఖ జీవితంపై ‘‘ రేఖ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’’ అన్న ఓ బయోగ్రఫీ పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చాలా విషయాలను ఆయన రాసుకొచ్చాడు. యాషిర్‌ ఉస్మాన్‌ రాసిన దాని ప్రకారం.. భర్త మరణం తర్వాత రేఖ చాలా కృంగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమె తన లేడీ సెక్రటరీ ఫర్జానాతో క్లోజ్‌ అయింది. వీరిద్దరూ చాలా కాలం పాటు సహజీవనం కూడా చేశారు. రేఖ జీవితంలో ఫర్జానాకు ఉన్నతమైన స్థానం ఉంది.  ఫర్జానా రేఖకు ఓ మంచి జోడీ. ఆమెకు అన్నీ ఫర్జానానే.

రేఖ.. ఫర్జానా లేకుండా అస్సలు జీవించ లేదు. ఫర్జానాకు మాత్రమే రేఖ బెడ్‌రూములోకి వెళ్లే చనువు ఉంది. ఆమెకు తప్ప ఇంకెవ్వరికీ ఆ చనువు లేదు’’ అని పేర్కొన్నాడు. కాగా, రేఖ దాదాపు 30 ఏళ్ల క్రితం బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌తో ప్రేమ వ్యవహారం నడిపారు. అయితే, వీరి ప్రేమ వ్యవహారం ఎక్కువ కాలం సాగలేదు. చివరకు విడిపోవాల్సి వచ్చింది. రేఖకు అమితాబ్‌ను విడిచిపెట్టడం అస్సలు ఇష్టం లేదు. ఇప్పటికే అమితాబ్‌నే ప్రేమిస్తూ ఉన్నానని ఆమె చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మరి, రేఖ.. ఫర్జానాతో సహజీవనం చేసిందని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişcasibom