iDreamPost
android-app
ios-app

రిలీజ్ డేట్ దగ్గరలో ఉన్నా సరే పుష్ప 2 మీద ఇంకా ఆగని రూమర్స్

  • Published Nov 21, 2024 | 4:03 PM Updated Updated Nov 21, 2024 | 4:03 PM

Pushpa 2 Updates : రిలీజ్ డేట్ దగ్గర్లో ఉన్నా కూడా.. సినిమా మీద రూమర్స్ మాత్రం ఇంకా ఆగడం లేదు. పైగా అది కూడా మ్యూజిక్ విషయంలోనే టార్గెట్ చేసినట్లు.. దీని గురించి ఎక్కువ టాక్ నడుస్తుంది. అనేక కారణాల వలన సుక్కు లాస్ట్ మినిట్ లో చాలా పెద్ద డెసిషన్ తీసుకున్న మాట వాస్తవమే.

Pushpa 2 Updates : రిలీజ్ డేట్ దగ్గర్లో ఉన్నా కూడా.. సినిమా మీద రూమర్స్ మాత్రం ఇంకా ఆగడం లేదు. పైగా అది కూడా మ్యూజిక్ విషయంలోనే టార్గెట్ చేసినట్లు.. దీని గురించి ఎక్కువ టాక్ నడుస్తుంది. అనేక కారణాల వలన సుక్కు లాస్ట్ మినిట్ లో చాలా పెద్ద డెసిషన్ తీసుకున్న మాట వాస్తవమే.

  • Published Nov 21, 2024 | 4:03 PMUpdated Nov 21, 2024 | 4:03 PM
రిలీజ్ డేట్ దగ్గరలో ఉన్నా సరే పుష్ప 2 మీద ఇంకా ఆగని రూమర్స్

పుష్ప 2 మీద క్రియేట్ అవుతున్న హైప్ గురించి తెలియనిది కాదు. దీని గురించి ఇంకా తెలుసుకోవాల్సిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అంటే సినిమాలోని ఐటెం సాంగ్ గురించే. మరో రెండు వారాల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్ గా రిలీజ్ అయినా ట్రైలర్ తో సినిమా మీద క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి పెరిగిపోయింది. ఎప్పుడెప్పుడు తెరపై బన్నీని చూద్దామా అని అంతా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర్లో ఉన్నా కూడా.. సినిమా మీద రూమర్స్ మాత్రం ఇంకా ఆగడం లేదు. పైగా అది కూడా మ్యూజిక్ విషయంలోనే టార్గెట్ చేసినట్లు.. దీని గురించి ఎక్కువ టాక్ నడుస్తుంది. అనేక కారణాల వలన సుక్కు లాస్ట్ మినిట్ లో చాలా పెద్ద డెసిషన్ తీసుకున్న మాట వాస్తవమే.

పుష్ప 2 సినిమాలో పాటలు , కొంత భాగం బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు మాత్రమే దేవి శ్రీ వర్క్ చేశాడు. ఇక మిగిలిన సినిమా కోసం ఎస్. థమన్, అజనీష్ లోక్ నాథ్, సామ్ సిఎస్.. వర్క్ చేస్తున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ లోని కొన్ని యాక్షన్ బ్లాక్స్ కు థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అలాగే అజనీష్ జాతర సీన్స్ లాంటి పూనకాలు తెప్పించే ఫ్రేమ్స్ కు బిజిఎం కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక మరో కొన్ని పోర్షన్స్ కు సామ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ అందిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ముగ్గురు కూడా వారికి అప్పగించిన పనిని పూర్తి చేసినట్లుగా సమాచారం. అయితే ఇప్పుడు దీని గురించి వినిపిస్తున్న టాక్ ఏంటంటే, ఫైనల్ రష్ చూసిన సుక్కు.. అజనీష్ , సామ్ వర్క్ పట్ల శాటిస్ఫై అయ్యాడట. కానీ తమన్ మ్యూజిక్ పట్ల మాత్రం కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడట. ఇంకాస్త బెటర్ వర్క్ చేయాలనీ సూచించడంతో.. ప్రస్తుతం తమన్ అదే పనిలో ఉన్నట్లుగా టాక్ స్ప్రెడ్ అవుతుంది. కానీ దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.

ఎందుకంటే ఇటీవల థమన్ ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ.. పుష్ప 2 విషయంలో సుక్కు తనకు అప్పగించిన వర్క్ కంప్లీట్ అయిందని.. డైరెక్టర్ , హీరో మ్యూజిక్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పారు. దీనితో ఇప్పుడు మ్యూజిక్ విషయంలో వినిపిస్తున్న పుకార్లు అందరికి ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అంతే కాకుండా సినిమాలో ఇంకా ఒక సాంగ్ , ఫైట్ కు సంబంధించిన షూట్ కూడా బ్యాలెన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి ఇది అవునా కాదా అనే విషయంలో మూవీ మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కానీ మూవీ మేకర్స్ మాత్రం అనుకున్న టైం కు సినిమా రిలీజ్ చేయాలనీ చాలా అగ్రెసివ్ గా వర్క్ చేస్తున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయిపోయింది కాబట్టి.. ఇప్పుడు సౌత్ లో ప్రచారం మొదలు పెట్టనున్నారు. లాస్ట్ మినిట్ లో కూడా ఇన్ని రూమర్స్ వస్తున్నా సరే.. మూవీ టీం మాత్రం చాలా ఫోకస్డ్ గా తమ పని తాము చేసుకుంటూ పోతుంది. ఇక రానున్న రోజుల్లో సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet