iDreamPost
android-app
ios-app

Abijeet: అభిజిత్ కి అనారోగ్య సమస్యలు అంటూ ప్రచారం.. అసలు నిజం ఏంటంటే?

  • Published Oct 16, 2024 | 12:07 PM Updated Updated Oct 16, 2024 | 12:07 PM

Clarity On Abhijeet Health: బిగ్ బాస్ గురించి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే చర్చ జరుగుతోంది. అదే సమయంలో బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ గురించి కూడా బాగానే ప్రచారం అవుతోంది. అయితే కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. వాటిలో అసలు నిజం ఎంత ఉందో చూద్దాం.

Clarity On Abhijeet Health: బిగ్ బాస్ గురించి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే చర్చ జరుగుతోంది. అదే సమయంలో బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ గురించి కూడా బాగానే ప్రచారం అవుతోంది. అయితే కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. వాటిలో అసలు నిజం ఎంత ఉందో చూద్దాం.

  • Published Oct 16, 2024 | 12:07 PMUpdated Oct 16, 2024 | 12:07 PM
Abijeet: అభిజిత్ కి అనారోగ్య సమస్యలు అంటూ ప్రచారం.. అసలు నిజం ఏంటంటే?

బిగ్ బాస్.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్న పేరు. బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో 8వ సీజన్ కొనసాగుతోంది. ఈసారి కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. వైల్డ్ కార్డ్స్ వచ్చాక షోకి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. రాయల్స్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన 8 మందిలో ముక్కు అవినాష్ కూడా ఉన్నాడు. అవినాష్ కు రీసెంట్ గా గౌతమ్ తో గొడవ జరిగింది. ఆ సమయంలో హౌస్ లో కాస్త యుద్ధ వాతావరణం కనిపించింది. ఈ గొడవతో అందరూ అభిజిత్ ని గుర్తు చేసుకోవడం స్టార్ట్ చేశారు. సీజన్ 4లో కూడా ఇలాంటి ఒక గొడవ జరిగింది. ఇప్పుడు జరిగిన సినారియో వల్ల అంతా అభిజిత్ గురించి మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా.. ఇటీవల అభిజిత్ ఆరోగ్యం గురించి కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అభిజిత్ ని అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే అభిజిత్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు అంటూ చెబుతున్నారు. అసలు ఈ వార్తలు, కామెంట్స్ నిజం ఎంత వరకు ఉందో చూద్దాం.

బిగ్ బాస్ గురించి ప్రస్తావన వస్తే.. కొంతమంది పాత కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుంటారు. వారిలో అభిజిత్ పేరు ప్రముఖంగా ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 4లో అభిజిత్ తనదైన ఆటతో ఆడియన్స్ ని మెప్పించాడు. చాలా సందర్భాల్లో తన మెచ్యురిటీ, తన నిర్ణయాలతో ఆకట్టుకున్నాడు. అందుకే బిగ్ బాస్ సీజన్ 4 విజేతగా నిలిచాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీని కూడా అందుకున్నాడు. ఆ సమయంలో అభిజిత్ కు బయట విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. ఇంకేముంది.. కెరీర్ గాడిలో పడిపోయింది అని అంతా అనుకున్నారు. కానీ, సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది.

సీజన్ ముగిసిన ఏడాది తర్వాత కూడా అభిజిత్ బయట కనిపించలేదు. ఎవరికి టచ్ లో ఉన్నాడో కూడా తెలియదు. వరుస ఆఫర్లతో బిజీగా ఉంటాడు అనుకుంటే.. మొత్తానికి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అందరూ అప్పుడు కాస్త కంగారు కూడా పడ్డారు. ఆ సమయంలో అభిజిత్ స్వయంగా తన ఆరోగ్యం గురించి క్లారిటీ ఇచ్చాడు. తనకు కాస్త అనారోగ్య సమస్యలు ఉన్నందు వల్ల ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. మళ్లీ ఇప్పుడు మరోసారి అభిజిత్ ఆరోగ్యం గురించి చర్చ జరుగుతోంది. అభిజిత్ ను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వాదనలో నిజం లేదు అనే చెప్పాలి. ఎందుకంటే అభిజిత్ బిగ్ బాస్ తర్వాత రెండు వెబ్ సిరీస్లలో మెరిసాడు. 2022లో మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే సిరీస్ తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత 2024లో లావణ్య త్రిపాఠితో కలిసి మిస్ పర్ఫెక్ట్ అనే సిరీస్ చేశాడు. అయితే అభిజిత్ ఎక్కువగా ట్రావెలింగ్ చేయడానికే ఇష్టపడుతూ ఉంటాడు.

 

View this post on Instagram

 

A post shared by Abijeet (@abijeet11)

నేచర్ ని ఎక్స్ ప్లోర్ చేయడం అంటే అభిజిత్ కి చాలా ఇష్టం. పలు సందర్భాల్లో ఆ విషయాలను చెబుతూనే వచ్చాడు. తన సోషల్ మీడియాలో కూడా తన ట్రావెలింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇటీవల దసరా సందర్భంగా ఆయుధ పూజ వీడియో కూడా పోస్ట్ చేశాడు. అభిజిత్ ఆరోగ్యం గురించి ఎందుకు వార్తలు వచ్చాయి అంటే.. అతను ఇటీవల బాగా వెయిట్ పుటాన్ అయ్యాడు. ఆ విషయంలోనే ఈ వార్తలు వచ్చాయి. అయితే ట్రావెలింగ్ లో చిన్న దెబ్బ తగిలిందని తెలుస్తోంది. ఆ సమయంలోనే కాస్త బరువు పెరిగాడు అంటున్నారు. ఇప్పుడు మాత్రం ఫుల్ రికవర్ అయినట్లే కనిపిస్తున్నాడు. దసరా సందర్భంగా తన అభిమానులు అంతా చల్లగా ఉండాలి అంటూ కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అందరూ అందరితో మంచిగా ఉండాలి అంటూ కోరుకున్నాడు. త్వరలోనే మళ్లీ అభిమానులను పలకరిస్తాడు అని తెలుస్తోంది. మొత్తానికి అభిజిత్ ఆరోగ్యం గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు అనే చెప్పాలి.

 

View this post on Instagram

 

A post shared by Abijeet (@abijeet11)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş