iDreamPost
android-app
ios-app

ఆ సన్నివేశాలు లీక్ కావడంపై నటి రుహనీ శర్మ ఫైర్!

  • Published Aug 24, 2024 | 7:19 PM Updated Updated Aug 24, 2024 | 7:19 PM

Ruhani Sharma.. ప్రస్తుతం సోషల్ మీడియా విపరీతంగా బజ్ నడుస్తున్న మూవీ ఆగ్రా. చిలసౌ మూవీతో కుర్రకారు హృదయాలను మీటిన రుహానీ శర్మ ఇందులో నటించింది. అయితే ఆ మూవీలోని కొన్ని సన్నివేశాలు లీక్ కావడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ నోట్ పంచుకుంది.

Ruhani Sharma.. ప్రస్తుతం సోషల్ మీడియా విపరీతంగా బజ్ నడుస్తున్న మూవీ ఆగ్రా. చిలసౌ మూవీతో కుర్రకారు హృదయాలను మీటిన రుహానీ శర్మ ఇందులో నటించింది. అయితే ఆ మూవీలోని కొన్ని సన్నివేశాలు లీక్ కావడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ నోట్ పంచుకుంది.

  • Published Aug 24, 2024 | 7:19 PMUpdated Aug 24, 2024 | 7:19 PM
ఆ సన్నివేశాలు లీక్ కావడంపై నటి రుహనీ శర్మ ఫైర్!

చిలసౌ మూవీతో కుర్రకారును తన వైపు తిప్పుకున్న బ్యూటీ రుహానీ శర్మ. అనుష్క శర్మ కజిన్‌గా ఇటీవల పాపులర్ అయిన ఈ బ్యూటీ. తాజాగా గత ఏడాది నటించిన చిత్రం ఆగ్రా. 2019లో షూటింగ్ ముగించుకుని డైరెక్టుగా 2023 ఫిల్మ్ ఫెస్టివల్‌లో విడుదలైంది. ప్రశంసలతో పాటు అవార్డులు వచ్చాయి. ఇటీవల ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజయ్యింది. ఏంటీ మన రూహానీ శర్మేనా అనేంతలా రెచ్చిపోయి నటించింది. మాల క్యారెక్టర్‌లో ఆమె పరిమితికి మించిన శృంగార సన్నివేశాల్లో నటించింది. అయితే తెలుగులో స్ట్రీమింగ్ చేయలేదు. అయితే ఈ సినిమా పైరసీ సైట్లలో రిలీజైంది. బోల్డ్ సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ఫైర్ అవుతూ సుదీర్ఘమైన పోస్టు పంచుకుంది.

‘హే ఎవ్రీవన్.. నేను నటించిన ఆగ్రా సినిమాలోని సన్నివేశాలు లీక్ అయినప్పటి నుంచి ఆవేదనలో ఉన్నా. నా బాధను వివరించడానికి నిరుత్సాహం అనేది కూడా చిన్నమాటే. మా కష్టాన్ని, అంకితభావాన్ని మర్చిపోయి ఇలా లీక్ చేయడం బాధగా ఉంది. ఇలాంటి చిత్రాలను రూపొందించడం పెద్ద సవాలు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి. అలాంటి సినిమాలను మీ ముందుకు తీసుకురావడానికి స్వేదం, రక్తం చిందించాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా నన్ను జడ్జ్ చేస్తున్నారు. ఆగ్రా అనేది కేవలం మూవీ మాత్రమే కాదు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైన ఓ లేబర్ ఆఫ్ లవ్. ఏ కళాకారుడికైనా అదొక ప్రతిష్టాత్మక గౌరవం. ఈ మూవీ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. అనేక అవార్డులు గెలుచుకుంది. ఇంత గొప్ప ప్రాజెక్టులో పనిచేసినందుకు నేను గర్వపడుతున్నారు. మా సినిమా శైలిని గుర్తించాలని కోరుతున్నాను. కళ అనేది ఎన్నో భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. మా శ్రమను వృథా చేయకండి. సినిమా వైవిధ్యాన్ని గౌరవిద్దాం. ప్రేమ, గౌరవంతో సృజనాత్మక ప్రయాణాన్ని కొనసాగిద్దాం’ అంటూ నోట్ పంచుకుంది.

తిత్లీ సినిమాతో బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన కాను బేల్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాలో శృంగార సన్నివేశాల కన్నా భారతీయ కుటుంబ వ్యవస్థలను నిలదీసిన విధానమే ఎక్కువ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా కొంత మంది ఈ సీన్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక రుహనీ శర్మ కెరీర్ విషయానికి వస్తే.. చిలసౌతో మొదలైన ఆమె తెలుగు జర్నీ కంటిన్యూగా సాగింది. హిట్ మూవీతో పాటు దర్డీ హరీ, నూటొక్క జిల్లాల అందగాడు, హర్- చాప్టర్ 1, సైంధవ్, ఆపరేషన్ వాలంటైన్, శ్రీరంగ నీతులు చిత్రాలు చేసింది. లవ్ మీలో క్యామియో చేసిన రుహనీ.. మీట్ క్యూట్ లో కూడా ఓ సెగ్మెంట్ లో కనిపిస్తుంది. ఇటీవల బ్లాక్ అవుట్ అనే ఓటీటీ మూవీతో పలకరించిన ఆమె మాస్క్ అనే తమిళ చిత్రంలో నటిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Ruhani Sharma (@ruhanisharma94)

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwoongrandpashabetcasibomcasibomcasibombetcio giriş