ఇంతకీ RRR-2 ఉన్నట్లా లేనట్లా ?

ఎంతైనా సిక్వెల్స్ తీయడంలో రాజమౌళి దిట్ట అని చెప్పి తీరాల్సిందే. బాహుబలి 1,2 తో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసాడు. ఇక ఆ తర్వాత RRR తో ఇంకో హిస్టరీ క్రియేట్ చేసాడు. అయితే ఇప్పుడు RRR-2 గురించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. దానికి సంబందించిన విషయాలు చూసేద్దాం.

ఎంతైనా సిక్వెల్స్ తీయడంలో రాజమౌళి దిట్ట అని చెప్పి తీరాల్సిందే. బాహుబలి 1,2 తో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసాడు. ఇక ఆ తర్వాత RRR తో ఇంకో హిస్టరీ క్రియేట్ చేసాడు. అయితే ఇప్పుడు RRR-2 గురించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. దానికి సంబందించిన విషయాలు చూసేద్దాం.

టాలీవుడ్ హాలీవుడ్ అని తేడా లేకుండా రాజమౌళి తీసిన RRR మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా హాలీవుడ్ ప్రేక్షకులు ఈ మూవీ మేకింగ్ కి మెస్మరైజ్ అయ్యారు.పైగా ఈ మూవీకి ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా దక్కడంతో ఇంటర్నేషనల్ లెవెల్ లో ఈ మూవీ పేరు మోతమోగిపోయింది. ఇక అప్పటినుంచి అడపా దడపా RRR-2 గురించి డిస్కషన్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ వాటిని ఎవరు అంతగా పట్టించుకోలేదు. అయితే రీసెంట్ గా లండన్లో జరిగిన ఓ ఈవెంట్ లో RRR-2 సిక్వెల్ ఉంటుందన్నట్లుగా మాట్లాడారు. దీనితో ఇప్పుడు ఈ సిక్వెల్ పై మరోసారి ఆశలు చిగురించాయి. మీడియా సోషల్ మీడియాలో RRR-2 పక్కా ఉంటుంది అన్నట్లుగా చెప్తున్నారు. కానీ నెటిజన్లు మాత్రం కాస్త డౌట్ పడుతున్నారు. ఒకవేళ ఈ సిక్వెల్ ఉన్నా కూడా ఇప్పటిలో అయితే ఉండదని అంతా అంటున్నారు. ఎందుకంటే మొదటి పార్ట్ ఎండింగ్ లో సెకండ్ పార్ట్ కు ఎలాంటి లీడ్ ఇవ్వలేదు. అలాగే ఇటు చరణ్ అటు తారక్ ఇద్దరు అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ గా ఉన్నారు. అటు జక్కన్న కూడా మహేష్ ప్రాజెక్ట్ తో బిజీ గా ఉన్నారు. సో ఇవన్నీ కంప్లీట్ అవ్వాలంటే ఎంత లేదన్నా మూడేళ్లు పడుతుంది.

పైగా ఈ మూవీలో ఇద్దరు మల్టీస్టారర్లు ఉండడం వలన.. ఆ సమయంలో హీరోల స్క్రీన్ స్పేస్ గురించి కాస్త హెచ్చు తగ్గులు వచ్చినట్టు అభిమానులు కామెంట్స్ చేశారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే రాజమౌళి సెకండ్ పార్ట్ తీస్తాడా లేదా అని అంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ మరోవైపు జక్కన్నే మూవీ ఉంటుంది అన్నారు కాబట్టి నిజంగానే ఉంటుందేమో అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఇక రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టు ‘మహాభారతం’ పట్టాలెక్కడంలో ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. బ్యాక్ టు బ్యాక్ ఇన్ని ప్రాజెక్ట్స్ పెట్టుకుని జక్కన్న RRR-2 తీస్తాడా లేదా అనేది ఇప్పుడు అందరికి సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments