iDreamPost
android-app
ios-app

RGV ‘వ్యూహం’ మూవీకి లైన్ క్లియర్.. రిలీజ్ ఎప్పుడంటే?

  • Published Feb 08, 2024 | 4:36 PM Updated Updated Feb 08, 2024 | 4:36 PM

RGV Vyuham Movie Release: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా రిలీజ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడు ఆ మూవీ రూట్ క్లియర్ అయ్యింది.

RGV Vyuham Movie Release: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా రిలీజ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడు ఆ మూవీ రూట్ క్లియర్ అయ్యింది.

  • Published Feb 08, 2024 | 4:36 PMUpdated Feb 08, 2024 | 4:36 PM
RGV ‘వ్యూహం’ మూవీకి లైన్ క్లియర్.. రిలీజ్ ఎప్పుడంటే?

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాకి కొన్ని అండ్డంకులు ఎదురైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి. ఆర్జీవీ వ్యూహం సినిమాకి హైకోర్టు రూట్ క్లియర్ చేసింది. వాస్తవానికి వ్యూహం సినిమా రెండు నెలల క్రితమే విడుదల కావాల్సి ఉంది. అప్పటికే సెన్సార్ సర్టిఫికేషన్ కూడా పొందింది. సరిగ్గా రిలీజ్ చేయాలి అనుకున్న సమయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యూహం సినిమా తెరకెక్కించారంటూ ఆరోపిస్తూ.. వ్యూహం ప్రదర్శన నిలిపివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.

ఒకసారి సెన్సార్ పూర్తైన సినిమాపై నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రతిష్టకు భంగం కలిగించే సినిమా తెరకెక్కించారంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికేట్ ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసేంది. అప్పటికే సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్ ని రద్దు చేశారు. హైకోర్టు తీర్పుపై వ్యూహం సినిమా నిర్మాత, దర్శకుడు పిటిషన్ దాఖలు చేశారు. వ్యూహం సినిమా టీమ్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు పరిశీలించింది. వ్యూహం సినిమాని మరోసారి పరిశీలించి కొత్తగా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ జారీ చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టు తీర్పుతో సెన్సార్ బోర్డు మరోసారి వ్యూహం సినిమాని పరిశీలించి U సర్టిఫికేట్ ని జారీ చేసింది. కోర్టు నిర్ణయంతో వ్యూహం సినిమా విడుదలకు రూట్ క్లియర్ అయినట్లు అయ్యింది. ఫిబ్రవరి 16న వ్యూహం సినిమా విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం జగన్ పాదయాత్ర నేపథ్యంలో డైరెక్టర్ మహీ తెరకెక్కించిన యాత్ర 2 మూవీ థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. 2009 నుంచి 2019 వరకు సీఎం జగన్ లైఫ్ ని బేస్ చేసుకుని ఈ మూవీని తెరకెక్కించారు. మరి.. వ్యూహం సినిమాకి రూట్ క్లియర్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet