iDreamPost
android-app
ios-app

KCR సినిమా నుంచి బ్రేకింగ్‌ న్యూస్‌.. రాకేష్‌ ఎమోషనల్‌ వీడియో!

  • Published Nov 15, 2023 | 9:02 AM Updated Updated Nov 15, 2023 | 9:02 AM

ప్రముఖ నటుడు జబర్థస్త్‌ ఫేమ్‌ రాకింగ్‌ రాకేష్‌ నిర్మిస్తున్న కేసీఆర్‌ సినిమా గత కొద్దిరోజుల నుంచి చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇక, ఈ సినిమా కారణంగా కొంతమంది చేతిలో తాను మోసపోయానని రాకేష్‌ పేర్కొన్నారు.

ప్రముఖ నటుడు జబర్థస్త్‌ ఫేమ్‌ రాకింగ్‌ రాకేష్‌ నిర్మిస్తున్న కేసీఆర్‌ సినిమా గత కొద్దిరోజుల నుంచి చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇక, ఈ సినిమా కారణంగా కొంతమంది చేతిలో తాను మోసపోయానని రాకేష్‌ పేర్కొన్నారు.

  • Published Nov 15, 2023 | 9:02 AMUpdated Nov 15, 2023 | 9:02 AM
KCR సినిమా నుంచి బ్రేకింగ్‌ న్యూస్‌.. రాకేష్‌ ఎమోషనల్‌ వీడియో!

జబర్థస్త్‌ కమెడియన్‌ రాకింగ్‌ రాకేష్‌ నిర్మాతగా ‘కేసీఆర్‌’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాకేష్‌ ‘ కేసీఆర్‌’ చిత్రం కోసం ఎన్నో కష్టనష్టాలకు ఓడ్చారు. ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటిని సైతం తాకట్టు పెట్టి నిర్మాణ బాధ్యతల్ని చేపట్టారు. ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తయింది. ఈ రెండు మూడు రోజుల్లో విడుదల కావాల్సి ఉండింది. ఈ సినిమా ఈ టైంలో రిలీజ్‌ చేయాలని రాకేష్‌ చాలా కష్టాలు పడ్డాడు. అయితే, రాకింగ్‌ రాకేష్‌కు ఈసీ షాక్‌ ఇచ్చింది. సినిమా విడుదల వాయిదా పడింది.

ఈ మేరకు ఆయన మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో ఆయన మాట్లాడుతూ.. ‘‘ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. సో.. నేనొక ముఖ్యమైన విషయం షేర్‌ చేసుకోవటానికి మీ ముందుకు రావటం జరిగింది. నేను ఒక మూవీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ మూవీ ఈ నెల రిలీజ్‌ చేద్దామని చాలా చాలా రకాలుగా.. సినిమా అంటే ఆశామాషీ విషయం కాదు.

మీ అందరికీ తెలుసు.. ఈ మూవీ ఈ టైంకు రిలీజ్‌ చేయడానికి మా ఎంతో మంది.. మా డైరెక్టర్‌ గారి దగ్గరినుంచి టెక్నీషియన్స్‌ దగ్గరి వరకు అందరూ రాత్రింబవళ్లు చాలా ఎక్కువగా కష్టపడ్డారు. కానీ, మనం ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలిచినట్లు.. అనుకున్న టైంకు..అంటే ఈ టైంకు రిలీజ్‌ చేద్దామని పక్కా ప్లాన్‌ చేసుకున్నాం.. నా వెనకాల ఉండి చాలా మంది నన్ను ముందుకు నడిపారు. నా మూవీ గురించి ఓ బిగ్‌ న్యూస్‌ అండ్‌.. బ్రేకింగ్‌ న్యూస్‌.. ఈసీ ఆర్డర్స్‌ ఇవ్వటం జరిగింది. కొన్ని ప్రత్యేకమైన సినిమాలకు.. నేను తీసింది ఓ బయోపిక్‌ క్యాటగిరీకో.. ఇంకో క్యాటగిరీకో సంబంధించిందో రివీల్‌ చేయదల్చుకోలేదు.

దాని గురించి ఈసీ దగ్గరకు వెళ్లి వివరించాను. కానీ, ఓ సెక్షన్‌ ప్రకారం ఎలక్షన్ల ముందు ఇలాంటి సినిమాలు రిలీజ్‌ అవ్వకూడదని రూల్‌ ఉంది. ఎలక్షన్ల ముందు కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని తెలుసు కానీ, మొత్తానికే ఇలా ఉంటుందని తెలీదు. ఏది జరిగినా మన మంచికే.. బ్యాడ్‌ అనుకోను గుడ్‌ అనుకుంటాను. పబ్లిసిటీ చేసుకోవటానికి టైం దొరికింది అనుకుంటా. మీ అందరి సహాయ సహకారాలు నాకు కావాలి’’ అంటూ ఎమోషనల్‌ అయ్యారు. మరి, రాకింగ్‌ రాకేష్‌ నిర్మిస్తున్న కేసీఆర్‌ విడుదల ఈసీ కారణంగా వాయిదా పడ్డంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Rocking Rakesh (@jabardasthrakesh)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom