iDreamPost
android-app
ios-app

రాకింగ్‌ రాకేష్‌ ఎమోషనల్‌.. నన్ను మోసం చేశారంటూ..

  • Published Oct 30, 2023 | 4:25 PM Updated Updated Nov 03, 2023 | 11:56 AM

ఆ సినిమాకు ‘ కేసీఆర్ ( కేశవ్‌ చంద్ర రమావత్‌) అన్న టైటిల్‌ ఖరారైంది. ఈ కేసీఆర్‌ సినిమాలో స్వయంగా రాకేషే హీరోగా నటిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా సినిమా లాంఛింగ్‌...

ఆ సినిమాకు ‘ కేసీఆర్ ( కేశవ్‌ చంద్ర రమావత్‌) అన్న టైటిల్‌ ఖరారైంది. ఈ కేసీఆర్‌ సినిమాలో స్వయంగా రాకేషే హీరోగా నటిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా సినిమా లాంఛింగ్‌...

  • Published Oct 30, 2023 | 4:25 PMUpdated Nov 03, 2023 | 11:56 AM
రాకింగ్‌ రాకేష్‌ ఎమోషనల్‌.. నన్ను మోసం చేశారంటూ..

తెలుగు సినిమా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ‘రాకింగ్‌ రాకేష్‌’. జబర్థస్త్‌ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాకేష్‌. పలు సినిమాల్లో కూడా నటించారు. ప్రస్తుతం సినిమాలు, షోలతో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే, రాకింగ్‌ రాకేష్‌ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఓ సినిమా నిర్మాణ బాధ్యతల కారణంగా ఆయన తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఇంతకీ సంగతేంటంటే.. రాకేష్‌ తన సొంత బ్యానర్‌లో ఓ సినిమా చేయబోతున్నారు.

ఆ సినిమాకు ‘ కేసీఆర్ ( కేశవ్‌ చంద్ర రమావత్‌) అన్న టైటిల్‌ ఖరారైంది. ఈ కేసీఆర్‌ సినిమాలో స్వయంగా రాకేషే హీరోగా నటిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా సినిమా లాంఛింగ్‌ జరిగింది. తెలంగాణ ప్రాంతంలోని బంజారాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు సమాచారం. ఇక, ఈ సినిమా గురించి తాజాగా రాకేష్‌ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. హీరో, హీరోయిన్లకు ఫ్యాన్స్‌ ఉన్నట్లుగానే కేసీఆర్‌కు ఫ్యాన్స్‌ ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు.

తాను కేసీఆర్‌కు పెద్ద ఫ్యాన్‌నని అన్నారు. ఆ కారణంతోనే కేసీఆర్‌ పేరుతో సినిమా తీస్తున్నానని అన్నారు. బినామీ డబ్బులతో సినిమా తీస్తున్నారన్న వార్తల్లో నిజం లేదన్నారు. కేసీఆర్‌ సినిమా కోసం.. తన తల్లికోసం కట్టించిన ఇంటిని తాకట్టు పెట్టానన్నారు. ఇంటి పేపర్లు తన దగ్గర లేవన్నారు. తన కారు అమ్మేశానని చెప్పారు. కొంతమంది కేసీఆర్‌ సినిమా చేస్తానని హ్యాండ్‌ ఇచ్చారని తెలిపారు. ఓ ప్రముఖ రచయిత మోసం వల్ల సినిమా మొదలవ్వక ముందే తన కారు అమ్మేశానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి, భార్య సుజాత తనను వెన్ను తట్టి ప్రోత్సహించారని వెల్లడించారు. సుజాత లాంటి భార్య దొరకటం తన అదృష్టం అని అన్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet