iDreamPost
android-app
ios-app

రిషి సార్ ని కూడా చంపేశారుగా.. ఆధారాలతో చూపించేశారు..!

  • Published Feb 05, 2024 | 8:06 PM Updated Updated Feb 05, 2024 | 8:37 PM

ఎంతో ఉత్కంఠంగా కొనసాగుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో మరోసారి రిషి సార్ చనిపోయారంటు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆ ఆధారలను చూసి ప్రేక్షకుల గుండె బద్దలయ్యిపోయింది.

ఎంతో ఉత్కంఠంగా కొనసాగుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో మరోసారి రిషి సార్ చనిపోయారంటు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆ ఆధారలను చూసి ప్రేక్షకుల గుండె బద్దలయ్యిపోయింది.

  • Published Feb 05, 2024 | 8:06 PMUpdated Feb 05, 2024 | 8:37 PM
రిషి సార్ ని కూడా చంపేశారుగా.. ఆధారాలతో చూపించేశారు..!

ఒక ఎమోషనల్.. ప్రేమ, జీవిత గమ్యం, పంతం. ఈ నాలుగు కలగలిగిన సీరియల్ ఏదంటే టక్కున చెప్పే పేరు గుప్పెండత మనసు. కరోనా సమయంలో ప్రారంభమైన గుప్పెడంత మనసు సీరియల్ ఇప్పటి వరకు కొనసాగుతూ.. ప్రేక్షకులను అలరిస్తుంది. కొడుకు ప్రేమ కోసం తపించే ఓ తల్లి.. చదువుపై మమకారం ఉన్న అమ్మాయి.. చదువు కోసం కష్టపడే ఓ కుటుంబం ఇలా మొత్తానికి చదువు విలువలతో పాటు, రొమాంటిక్ లవ్ తో ఈ సీరియల్ ని రూపొందించారు. అయితే మొదట్లో రొటీన్ సీరియల్స్ లా ఉన్నా.. ఆ తర్వాత మాత్రం ఊహించిన స్థాయిలో ఈ సీరియల్ కి భారీ స్పందన వచ్చింది.

అప్పటి నుంచి ఎంతో ఇంట్రెస్టింగ్ గా ప్రసారం అవుతున్నా కార్తీకదీపం సీరియల్ ని సైతం పక్కుకు నెట్టేలా నెంబర్ 1స్థాయిలో ఈ సీరియల్ కొనసాగింది. ముఖ్యంగా ఈ సీరియల్ లో వసూధార, రిషి, జగతి ఈ మూడు క్యారెక్టర్లకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. మరి అంతలా ఎట్రక్ట్ అయిన ఆ పాత్రలను చంపేస్తుంటే.. అభిమానులు తట్టుకుంటారా. ఇప్పటికే ఈ సీరియల్ లో జగతి పాత్రను చంపేసి అభిమానులను ఏడిపించేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు మన హీరో రిషిని కూడా చంపేసి అందరిని షాక్ కు గురయ్యేలా చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఎంతో ఇంట్రస్టింగ్ గా కొనసాగుతూ గుప్పెండత మనసు సీరియల్ లో ఇది వరకే రిషి సార్ చనిపోయాడని చూపించిన సంగతి తెలిసిందే. కాగా, అప్పుడు.. ఓ డెడ్ బాడీని గుర్తు పట్టమని మార్చురీకి తీసుకుని వెళ్లి గుండెల్ని బద్దలయ్యేలా చేశారు. ఆ తర్వాత రిషి బ్రతికే ఉన్నాడంటూ చూపించారు. ఇదిలా ఉంటే.. మళ్లీ తాజాగా ఈరోజు జరగబోయే ఎపిసోడ్ లో మరోసారి రిషి చనిపోయాడంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సీరియల్ శైలేంద్ర మనిషి భద్ర తప్పించుకోవడంతో.. ఎప్పటిలానే వసు అండ్ కో బ్యాచ్ ముకుల్‌తో చర్చించుకుంటారు.

అంతలోనే ముకుల్ మీకు ఒక విషయం చెప్పాలి, గుర్తుపట్టలేని స్థితిలో ఓ డెడ్ బాడీ హాస్పిటల్ లో దొరికిందని చెప్తాడు. అయితే ఈసారి పక్క ఆధారాలతో రిషి వేసుకున్న టీ షర్ట్ ను చూపించడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది వసుధార. దీంతో మరోసారి ఈ సీరియల్ రిషి క్యారెక్టర్ ని చంపేశారు. దీనిని చూసిన ప్రేక్షకులు రిషి సార్ చనిపోయారంటు.. ప్రేక్షకులు అంతా తెగ కంగారు పడుతున్నారు. మరో వైపు హీరో పాత్రని చంపేస్తే అసలు సీరియల్ కే అర్థం ఉండదు. కాబట్టి ఇది నిజం కాదని, రిషి బ్రతికే ఉంటాడని ప్రేక్షకులు బలంగా నమ్ముతున్నారు. మరి, ఈరోజు జరగబోయే ఎపిసోడ్ లో రిషి చనిపోయడంటూ ఆధారలతో చూపించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş