iDreamPost
android-app
ios-app

Ali Fazal: తండ్రైన మీర్జాపూర్ హీరో అలీ ఫజల్

  • Published Jul 18, 2024 | 5:16 PM Updated Updated Jul 18, 2024 | 5:16 PM

Ali Fazal.. బాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో ఒకరైన రిచా చద్దా, అలీ ఫజల్ పేరెంట్స్ అయ్యారు. రెండు సార్లు వివాహం చేసుకుని వార్తల్లో నిలిచి ఈ జంట తాజాగా తల్లిదండ్రులయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు మీర్జాపూర్ హీరో అలీ.

Ali Fazal.. బాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో ఒకరైన రిచా చద్దా, అలీ ఫజల్ పేరెంట్స్ అయ్యారు. రెండు సార్లు వివాహం చేసుకుని వార్తల్లో నిలిచి ఈ జంట తాజాగా తల్లిదండ్రులయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు మీర్జాపూర్ హీరో అలీ.

  • Published Jul 18, 2024 | 5:16 PMUpdated Jul 18, 2024 | 5:16 PM
Ali Fazal: తండ్రైన మీర్జాపూర్ హీరో అలీ ఫజల్

మీర్జాపూర్ నటుడు ఇంట ఆనందం వెల్లు విరుస్తుంది. బాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో ఒకరైన రిచా చద్దా, అలీ ఫజల్ పేరెంట్స్ అయ్యారు. 2020, 22లో రెండు సార్లు ఈ జంట వివాహం చేసుకుంది. కాగా, తాజాగా రిచా ప్రెగ్నెంట్ విషయాన్ని పంచుకున్నారు. ఇప్పుడు రిచా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ నెల 16న ఆడ పిల్లను జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అలీ, రిచా ఫిబ్రవరిలో సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. కాగా, కొద్ది రోజుల క్రితం రిచా బేబీ బంప్ ఫోటో షూట్లను తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేసుకుంది. అలీ తెలుగు సినిమాల్లో నటించలేదు కానీ.. మీర్జాపూర్ సిరీస్ ద్వారా సుపరిచితం. మీర్జాపూర్‌ వెబ్ సిరీస్ హీరోగా, గోవింద్ పాత్రలో మెప్పించాడు.

ఇటీవల మీర్జాపూర్ 3 వచ్చిన సంగతి విదితమే. అయితే మీర్జాపూర్, మీర్జాపూర్ 2 కన్నా రీసెంబ్ సిరీస్ అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు అన్న విమర్శ ఉంది. ఇక వీరి ప్రేమ విషయానికి వస్తే.. రిచా చద్దా, అలీ ఫజల్ 2015 నుండి డేటింగ్‌లో ఉన్నారు. 2017లో వీరి ప్రేమ వ్యవహారాన్ని వెల్లడించాడు ఈ నటుడు. 2020లో కోవిడ్ సమయంలో ఈ ఇద్దరు వివాహం చేసుకోగా.. రెండేళ్ల తర్వాత 2022లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి గ్రాండ్‌గా వెడ్డింగ్ చేసుకుని వార్తల్లో నిలిచారు. ఈ జంట బిగ్ స్క్రీన్ పై కలిసి నటించింది. ఫుక్రే, ఫుక్రే రిటర్న్స్‌లో నటించారు. ఇదిలా ఉంటే.. సంజయ్ లీలా భన్సాలీ ప్రాజెక్ట్ హీరా మండీ వెబ్ సిరీస్‌లో లజ్జో పాత్రలో మెరిసింది రిచా.

ప్రస్తుతం రిచా చేతిలో అబి తో పార్టీ షురూ హు హైలో చేస్తోంది. ఇక అలీ ఫజల్.. కేవలం హిందీ సినిమాలే కాకుండా పలు చిత్రాల్లో మెరిశాడు. త్రీ ఈడియట్స్ నుండి మొదలైన అతడి ప్రయాణం సక్సెస్ ఫుల్ గా దూసుకెళుతుంది. ఫర్ హియర్ ఆర్ టు గో వంటి ఇండో అమెరికన్ మూవీతో పాటు హాలీవుడ్ మూవీస్ ఫ్యూరియస్ 7, డెత్ ఆన్ ది నీల్, ఖాందార్‌లో కూడా నటించాడు. అలాగే ఓ చైనా మూవీతో పాటు ఇంగ్లీస్ చిత్రంలో మెరిశారు. ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో వస్తున్న థగ్ లైఫ్ చిత్రంతో కోలీవుడ్ నాట అడుగుపెట్టబోతున్నాడు ఈ బాలీవుడ్ యంగ్ హీరో.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss