iDreamPost
android-app
ios-app

అతి సామాన్యంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి.. ఇప్పుడు ఇండస్ట్రీలో సెగలు రేపుతోంది!

  • Published Aug 05, 2024 | 3:21 PM Updated Updated Aug 05, 2024 | 4:32 PM

ఈ ఫోటోలో మిడిల్లో అతి సామాన్యంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. వర్థమాన నటి. ఇండస్ట్రీలోకి రాకముందే పాపులారిటీని తెచ్చుకుంది. సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ఇంతకు ఎవరో తెలుసా..?

ఈ ఫోటోలో మిడిల్లో అతి సామాన్యంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. వర్థమాన నటి. ఇండస్ట్రీలోకి రాకముందే పాపులారిటీని తెచ్చుకుంది. సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ఇంతకు ఎవరో తెలుసా..?

  • Published Aug 05, 2024 | 3:21 PMUpdated Aug 05, 2024 | 4:32 PM
అతి సామాన్యంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి.. ఇప్పుడు ఇండస్ట్రీలో సెగలు రేపుతోంది!

గతంలో హీరోయిన్ అవ్వాలంటే పెద్ద ప్రాసెస్ ఉండేది. కొన్ని ఫోటోలు పట్టుకుని స్టూడియోలు చుట్టూ లేదా ఫిల్మ్ కంపెనీలు చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాలి. ఆడిషన్స్ ఇవ్వాలి. డైరెక్టర్ ఓకే అంటే నిర్మాతకు నచ్చదు. ప్రొడ్యూసర్ ఓకే అన్న అమ్మాయి హీరోకు నచ్చదు. దీంతో ఆడిషన్స్ లెవల్లోనే ఎంతో మంది అమ్మాయిలు వెనుదిరుగుతుంటారు. అయితే ఈ తలనొప్పి వ్యవహారాన్ని భర్తీ చేస్తోంది సోషల్ మీడియా. ఇన్ స్టా, ఎక్స్, ఫేస్ బుక్, యూట్యూబ్ వీడియోలతో ఫేమ్ సంపాదించుకుంటున్నారు కొంత మంది. రీల్స్, షార్ట్స్ చేస్తూ సినీ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇందులో క్లిక్ అయితే చాలు ఛాన్సులు వాటంతట అవే వస్తున్నాయి. వీరి ఫ్రొఫైల్ చూసి దర్శక నిర్మాతలు అవకాశాలిస్తున్నారు. అందుకే అప్ కమింగ్ యాక్టర్స్ అండ్ వెల్ నౌన్ హీరోయిన్స్ సైతం సోషల్ మీడియానే నమ్ముకుంటున్నారు.

ఇదిగో ఈ ఫోటోలో మధ్యలో నిలబడిన యువతిని చూశారు కదా.. తనను తాను పబ్లిసిటీ చేసుకునేలోపే ఫేమస్ అయ్యింది. ఓ డైరెక్టర్ కళ్లల్లో పడి.. ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చేసింది. ఆమె ఎవరు అంటూ తన వివరాలను నెటిజన్లను దర్శకుడు ప్రశ్నించేలా చేసుకుంది. అంతేనా ఈ మగువకు ఆ స్టార్ డైరెక్టర్ ఫిదా అవ్వడంతో పాటు సినిమా ఆఫర్ కూడా ఇచ్చాడు. అలా సినిమా విడుదల కన్నా ముందే పాపులారిటీని తెచ్చుకుంటుంది. ఇక సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫోటోలు చూస్తే యువకులు మతిపోగొట్టుకోవాల్సిందే. తన కళ్లతో, నడుమ అందాలతో,రింగుల జుట్టుతో.. అందమైన కట్టుబొట్టుతో యూత్‌కు వలవేసిన ఈమె ఎవరంటే..శ్రీ లక్ష్మీ సతీష్. కేరళలోని కొట్టాయంకు చెందిన ఈ బ్యూటీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.

తన వీడియోలు పెడుతూ ఫాలోవర్స్ పెంచుకునే పనిలో ఉన్న శ్రీలక్ష్మీ.. ఎల్లో శారీలో చేసిన ఓ వీడియోతో ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేసేసింది. ఈ వీడియోను చూసిన ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తన ఎక్స్ ఖాతాలో ఆమె ఫోటోలు పంచుకుంటూ ఈమె ఎవరు అంటూ ప్రశ్నించాడు. దీంతో నెటిజన్లు ఆమె ఎవరో వివరాలు పంచుకున్నారు. ఆర్జీవీ కళ్లకు ఆరాధ్య దేవతలా కనిపించిన ఈ బ్యూటీకి వెంటనే మూవీ ఆఫర్ ఇచ్చాడు. అలా శ్రీలక్ష్మీ సతీష్ కాస్తా.. ఆరాధ్య దేవిగా నామకరణం చేసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది. ఏదైతే శారీలో ఆర్జీవీని కట్టిపడేసిందో.. అదే శారీ టైటిల్‌తో రాబోతుంది. ఆర్జీవి డెన్ ప్రొడక్షన్‌లో తెరకెక్కుతోంది శారీ మూవీ. ఈ చిత్రానికి గిరి కృష్ణ కమల్ దర్శకుడు. ఈ మధ్య విడుదలైన వాటర్ సాంగ్ పాటలో శ్రీలక్ష్మీ సెగలు రేపుతుంది. త్వరలో శారీ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతుంది.

 

View this post on Instagram

 

A post shared by AaradhyaDevi (@iamaaradhyadevi)

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio