కోర్టు మెట్లెక్కిన రేణు దేశాయ్.. ఎందుకంటే?

  • Author ajaykrishna Published - 12:03 PM, Sat - 5 August 23
  • Author ajaykrishna Published - 12:03 PM, Sat - 5 August 23
కోర్టు మెట్లెక్కిన రేణు దేశాయ్.. ఎందుకంటే?

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ లో ఆక్వా మెరైన్ పార్క్‌ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా సినీ ప్రముఖులు తమ గొంతు వినిపిస్తున్నారు. నగర శివారులోని కొత్వాల్‌ గూడలో ఆక్వా మెరైన్ పార్క్, పక్షిశాల ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఆక్వా మెరైన్ పార్క్ కోసం కృత్రిమ సరస్సును సృష్టించడం పర్యావరణానికి ప్రమాదం అని.. వెంటనే పార్క్ ఏర్పాటు చర్యలను నిలిపివేయాలని నటి, సోషల్ యాక్టివిస్ట్ రేణు దేశాయ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విషయంపై రేణు దేశాయ్ తో పాటు నటి శ్రీదివ్య, సదా, డైరెక్టర్ శశికిరణ్ తిక్క లతో పాటు మరికొందరు ఇండస్ట్రీకి చెందినవారు జూన్ 27న ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

రేణు దేశాయ్ తో పాటు సినీ ప్రముఖులు వేసిన పిటిషన్ ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. వీరి పిటిషన్ ని పరిశీలించిన చీఫ్ జస్టిస్ ఉజ్వల్ భూయాన్, జస్టిస్ ఎన్. తుకారామ్ జి.. ఇలాంటి పార్కుల నిర్మాణం సింగపూర్, మలేషియా లాంటి దేశాలలో జరిగింది. మన దేశంలో ఎందుకు జరగకూడదు అని కోర్టు ప్రశ్నించింది. దానికి పిటిషనర్ తరపు లాయర్ శ్రీరమ్య స్పందిస్తూ.. ఎలాంటి పర్యావరణ అధ్యయనం లేకుండా ఏర్పాటు చేసే ఈ పార్క్ లతో అటు జలచరాలకు, అడవి ప్రాణులకు ప్రమాదం ఉందని తెలిపారు. వీరి వాదనలు పరిగణలోకి తీసుకొని.. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి, పశుసంవర్థక శాఖ అధికారులకు, ఫిషరీస్, హెచ్‌ఎమ్‌డీ‌ఏ లకు నోటీసులు జారీ చేసింది.క

ఇక పిటిషన్ వేసిన వారిలో డైరెక్టర్ శ‌శికిర‌ణ్.. ‘ప‌ర్యావ‌ర‌ణానికి చేటు చేసే విధంగా ఉన్న ఈ ప్రాజెక్ట్‌ ఆపాలని మేం చేస్తున్న ఈ పోరాటానికి మీ సపోర్ట్ కావాలి. ఆక్వా మెరైన్ పార్క్‌ ల నిర్మాణం ప‌ర్యావ‌ర‌ణాన్ని దెబ్బ తీస్తాయి. ఇలాంటి పార్క్ ల నిర్మాణాన్ని ఆల్రెడీ ఇతర దేశాలు వ్యతిరేకిస్తున్నాయి’ అని అన్నారు. అలాగే నటి సదా మాట్లాడుతూ.. “మూడు వేల గ్యాల‌న్ల నీటితో నిర్మాణం అయ్యే ఇలాంటి ఆక్వా పార్క్‌లు నీటి స‌మ‌స్యకు కార‌ణమవుతాయి. సహజంగా బ్రతికే జీవులను తెచ్చి.. ఇలా కృత్రిమంగా ఏర్పాటు చేసే నీటిలో ఉంచడం వాటి మనుగడకు ప్రమాదమని” చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రేణు దేశాయ్ తో పాటు సెలబ్రిటీలంతా ఆక్వా పార్క్ నిర్మాణం ఆపాలని కోర్టు మెట్లు ఎక్కడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments