iDreamPost
android-app
ios-app

Rev Party: నేను కూడా రేవ్ పార్టీకి వెళ్లాలనుకున్నాను.. బుల్లి తెర యాంకర్ షాకింగ్ కామెంట్స్!

  • Published Jun 02, 2024 | 11:40 AM Updated Updated Jun 02, 2024 | 11:40 AM

బెంగళూరు రేవ్ పార్టీ నిన్న మొన్నటి వరకు కూడా సోషల్ మీడియాలో దీని గురించే అంతా టాక్. సినీ నటి హేమతో పాటు ఎందరో పేరులు బయటకు వచ్చాయి . ఇక ఇపుడు మరొక బుల్లి తెర నటి పేరు కూడా.. ఈ సంభాషణలో వినిపిస్తుంది. దానికి సంబంధించిన వివరాలు చూసేద్దాం.

బెంగళూరు రేవ్ పార్టీ నిన్న మొన్నటి వరకు కూడా సోషల్ మీడియాలో దీని గురించే అంతా టాక్. సినీ నటి హేమతో పాటు ఎందరో పేరులు బయటకు వచ్చాయి . ఇక ఇపుడు మరొక బుల్లి తెర నటి పేరు కూడా.. ఈ సంభాషణలో వినిపిస్తుంది. దానికి సంబంధించిన వివరాలు చూసేద్దాం.

  • Published Jun 02, 2024 | 11:40 AMUpdated Jun 02, 2024 | 11:40 AM
Rev Party: నేను కూడా రేవ్ పార్టీకి వెళ్లాలనుకున్నాను.. బుల్లి తెర యాంకర్ షాకింగ్ కామెంట్స్!

రీతూ చౌదరి.. బుల్లి తెరపైన చిన్న చిన్న షోస్ లో యాంకరింగ్, గ్లామర్ షోస్ చేస్తూ .. ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మడు, ఇప్పుడు ఓ షో కు యాంకర్ గా కూడా వ్యవహరిస్తోంది. ఇటు సోషల్ మీడియాలోను ఈ అమ్మడి గురించి చూస్తూనే ఉంటున్నాము. అయితే ఇప్పుడు ఈ అమ్మడి ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే .. బెంగళూరు రేవ్ పార్టీ నిన్న మొన్నటి వరకు కూడా సోషల్ మీడియాలో దీని గురించే అంతా టాక్. సినీ నటి హేమతో పాటు ఎందరో పేరులు బయటకు వచ్చాయి . ఇక ఇప్పుడు రీతూ చౌదరి కూడా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో తానూ కూడా ఆ రేవ్ పార్టీకి వెళ్లాల్సి ఉందంటూ.. అందరికి షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇటీవల బెంగుళూరు రేవ్ పార్టీకి సంబంధించిన విషయంలో.. పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి.. చివరికి ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన సినీ నటి హేమ గురించి తెలియనిది కాదు. ఈ పార్టీకి హాజరైన వారందరికీ టెస్ట్స్ నిర్వహించడంతో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేల్చి చెప్పారు పోలీసులు. ఇక తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో రీతూ కూడా ఈ రేవ్ పార్టీ గురించి చర్చిండడంతో.. అందరికి ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. రీతూ రేవ్ పార్టీ గురించి మాట్లాడుతూ.. “నేను కూడా రేవ్ పార్టీకి వెళ్లాలని అనుకున్నాను. రేవ్ పార్టీ అంటే ఎలా ఉంటుందో చూడాలనుకున్నాను. అక్కడ ఏం చేస్తారో కూడా తెలియకపోవడం వలన ఓసారి వెళ్తే బావుంటుందని అనుకున్నాను. కానీ, ఇటీవల జరిగిన రేవ్ పార్టీకి సంబంధించిన కొన్ని విషయాలను విన్న తర్వాత.. ఇలా ఉంటుందా అని షాక్ అయ్యాను. ఇలాంటి పార్టీలకు అయితే నేను చాలా దూరం. తెలియక ముందు వెళ్లాలని అనిపించింది కానీ అదేంటో తెలిసిన తర్వాత.. దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అర్ధం అయింది” అంటూ రీతూ చౌదరి చెప్పుకొచ్చింది.

దీనితో ప్రస్తుతం రీతూ చౌదరి చేసిన కామెంట్స్.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పదింస్తున్నారు. ఇక రీతూ చౌదరి విషయానికొస్తే.. గోరింటాకు, సూర్య వంశం, ఇంటిగుట్టు వంటి సీరియల్స్ లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్స్ ను షేర్ చేస్తూ నిత్యం యాక్టివ్ గానే ఉంటుంది. మరి రేవ్ పార్టీ గురించి రీతూ స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom