iDreamPost
android-app
ios-app

హీరోయిన్ లాంటి అమ్మాయి. సిద్ధార్థ్ మొదటి భార్య గురించి మీకు తెలియని నిజాలు!

Siddharth First Wife: సిద్ధార్థ్ హీరోగానే కాకుండా సింగర్ గా కూడా తన సత్తా ఏంటో చాటుతున్నాడు. ఎప్పుడూ సినిమా అప్ డేట్స్ తో వార్తల్లో ఉండే సిద్ధార్థ్ ఈ మధ్య వ్యక్తిగత విషయాలతో వైరల్ అవుతున్నాడు.

Siddharth First Wife: సిద్ధార్థ్ హీరోగానే కాకుండా సింగర్ గా కూడా తన సత్తా ఏంటో చాటుతున్నాడు. ఎప్పుడూ సినిమా అప్ డేట్స్ తో వార్తల్లో ఉండే సిద్ధార్థ్ ఈ మధ్య వ్యక్తిగత విషయాలతో వైరల్ అవుతున్నాడు.

హీరోయిన్ లాంటి అమ్మాయి. సిద్ధార్థ్ మొదటి భార్య గురించి మీకు తెలియని నిజాలు!

హీరో సిద్ధార్థ్ గురించి సౌత్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇతను పక్కింటి కుర్రాడిగా, లవర్ బాయ్ గా ఎన్నో పాత్రలు చేశాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. బాయ్స్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సిద్ధార్థ్ ఆ తర్వాత భిన్నమైన కథలు, కొత్తగా ఉండే పాత్రలు ఎంచుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు. అటు తమిళ్ ఇండస్ట్రీలో కూడా సిద్ధార్థ్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తాను అనుకున్నది అనుకున్నట్లుగా చెప్పడం సిద్ధార్థ్ కు ఉన్న ఒక లక్షణం. అయితే సిద్ధార్థ్ ఫిల్మ్ కెరీర్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, వ్యక్తిగత జీవితం గురించి మాత్రం చాలామందికి తెలియదు.

హీరో సిద్ధార్థ్ గురించి అందరికీ చాలా విషయాలు తెలుసు. కానీ, అతని వ్యక్తిగత జీవితం గురించి మాత్రం చాలా తక్కువ తెలుసు. తాజాగా హీరో సిద్ధార్థ్ రెండో వివాహం చేసుకున్నాడు అని వార్తలు వైరల్ అవుతున్నాయి. అది కూడా హీరోయిన్ అదితీరావ్ హైదరీని వివాహం చేసుకున్నాడు అంటున్నారు. వనపర్తిలోని రంగనాయకస్వామి ఆలయంలో ఈ వివాహం రహస్యంగా జరిగింది అంటున్నారు. చాలారోజులుగా సిద్ధార్థ్- అదితీరావ్ హైదరీ డేటింగ్ చేస్తున్నారు అని వార్తలు వైరల్ అయ్యాయి. అలాగే ఈ అమ్మడుకి చాలాసార్లు ఈ ప్రశ్న కూడా ఎదురైంది. ఆ సమయంలో కాస్త ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది.

సిద్ధార్థ్ కూడా అదితీరావ్ హైదరీతో ప్రేమ వ్యవహారం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు దాటేసే ప్రయత్నం చేశాడు. సోషల్ మీడియాలో మాత్రం వీళ్లిద్దరి ఫొటోలు, రీల్స్ తెగ వైరల్ అవుతూ ఉండేవి. ఇప్పుడు ఒక్కసారిగా పెళ్లి చేసుకున్నారు అంటూ వార్తలు వచ్చేశాయి. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ మొదటి భార్య గురించి ఇప్పుడు ప్రస్తావన వస్తోంది. అసలు ఆమె ఎవరు? వీళ్లిద్దరు ఎందుకు విడిపోయారు? అంటూ తెగ వెతికేస్తున్నారు. సిద్ధార్థ్ మొదటి భార్య పేరు మేఘన. ఢిల్లీ ఉన్నప్పుడు సిద్ధార్థ్ పక్కింట్లో ఉండేది. వారి మధ్య ఏర్పడిన పరిచయం.. ప్రేమగా మారింది. ఆ తర్వాత వాళ్లిద్దరు వివాహం చేసుకున్నారు.

సిద్ధార్థ్- మేఘనకు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వారిలో లైఫ్ లో ఏం జరిగిందో గానీ.. మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ సిద్ధార్థ్ పై చాలానే రూమర్స్ వచ్చాయి. కొన్నాళ్లు శృతిహాసన్ తో ప్రేమాయణం నడిపించాడు అన్నారు. ఆ తర్వాత సమంతతో కూడా సిద్ధార్థ్ ప్రేమలో ఉన్నాడు అంటూ చాలానే వార్తలు వచ్చాయి. ఇన్నాళ్ల తర్వాత అదితీరావ్ హైదరీతో సిద్ధార్థ్ డేటింగ్ చేస్తున్నాడు అన్నారు. ఇప్పుడు సడెన్ వారి పెళ్లి కూడా జరిగిపోయింది అంటూ వార్తలు వచ్చాయి. మరి.. సిద్ధార్థ్ రెండో పెళ్లి చేసుకున్నాడు అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis giriş