sai
sai
కోలీవుడ్ స్టార్ హీరో, డైరెక్టర్, నిర్మాత విజయ్ ఆంటోని ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె.. ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు తన గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విజయ్ ఆంటోని కుమార్తె పేరు మీరా తమిళ మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం మీరా ప్లస్ 2 అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఇంటర్ చదువుతోన్న బాలిక.. అందునా హీరో కుమార్తె.. ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోవడం.. అందరిని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. అయితే మీరా ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోవడం వెనక కారణం ఏంటి అంటే..
చదువులో తీవ్రమైన ఒత్తిడి, డిప్రెషన్ కారణంగానే.. విజయ్ ఆంటోని కుమార్తె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంటర్ చదివే బాలిక మీద అంత ఒత్తిడి ఏంటి.. మీరా కేవలం చదువు పరంగానే ఒత్తిడి ఎదుర్కొంటుందా.. లేక వేరే ఇతర సమస్యలతో బాధపడుతుందా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక మీరా ఆత్మహత్య చేసుకున్న సంగతి గమనించిన వెంటనే.. ఆమెను సమీపంలోని కావేరి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మృతి చెందినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
చెన్నైలోని డీడీకే రోడ్డులో విజయ్ ఆంటోని ఫ్యామిలీ నివాసం ఉంటోంది. ఇక కుమార్తె మృతి మీద విజయ్ ఆంటోని ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కూతురి మరణం పట్ల కుంగిపోయిన విజయ్ ఆంటోనికి అభిమానులు ధైర్యం చెబుతున్నారు. బాధపడకు అన్నా.. ధైర్యంగా ఉండు అంటూ సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. గతంలో విజయ్ ఆంటోని ఆత్మహత్య ఆలోచనలు ఎందుకు వస్తాయి.. పిల్లల విషయంలో.. తల్లిదండ్రుల ఆలోచనా ధోరణి ఎలా ఉండాలి అనే అంశాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలో మీరా ఆత్మహత్య నేపథ్యంలో ఈ వీడియోలు మరోసారి వైరల్ అవుతున్నాయి.
#VijayAntony about suicidal thoughtspic.twitter.com/sqQGEx70h4
— Cine Promoters (@cinepromoters) September 19, 2023