iDreamPost
android-app
ios-app

ప్రభాస్ పక్కన కొత్త అమ్మాయి ఇమాన్ ఇస్మాయిల్ హీరోయిన్ గా పెట్టడానికి కారణం?

  • Published Aug 17, 2024 | 8:21 PM Updated Updated Aug 17, 2024 | 8:21 PM

Prabhas- Iman Esmail- Hanu Raghavapudi: ప్రభాస్- హను రాఘవపూడి సినిమా పూజా కార్యక్రమం అయిపోయింది. త్వరలోనే సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. అయితే ప్రభాస్ పక్కన తెలుగు వాళ్లకి తెలియని అమ్మాయిని హీరోయిన్ గా పెట్టడం కరెక్టేనా?

Prabhas- Iman Esmail- Hanu Raghavapudi: ప్రభాస్- హను రాఘవపూడి సినిమా పూజా కార్యక్రమం అయిపోయింది. త్వరలోనే సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. అయితే ప్రభాస్ పక్కన తెలుగు వాళ్లకి తెలియని అమ్మాయిని హీరోయిన్ గా పెట్టడం కరెక్టేనా?

  • Published Aug 17, 2024 | 8:21 PMUpdated Aug 17, 2024 | 8:21 PM
ప్రభాస్ పక్కన కొత్త అమ్మాయి ఇమాన్ ఇస్మాయిల్ హీరోయిన్ గా పెట్టడానికి కారణం?

హను రాఘవపూడి.. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నది ఈయనే. అందుకు కారణం తన కొత్త ప్రాజెక్ట్ కి సంబంధంచిం పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులోనూ ప్రాజెక్ట్ ప్రభాస్ తో కావడంతో పాన్ ఇండియా లెవల్లో ఈ వార్త, పూజ ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి. అలాగే ఇప్పుడు హను రాఘవపూడి హీరోయిన్ సెలక్షన్ గురించి కూడా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన ఇమాన్ ఇస్మాయిల్ అనే ఆమెను తెలుగులో హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాడు. ప్రభాస్ తో సినిమా అనగానే ఎవరైనా స్టార్ హీరోయిన్ ని సెలక్ట్ చేస్తారు. కానీ, ఒక ఫ్రెష్ ఫేస్ ని హను రాఘవపూడి ఎందుకు సెలక్ట్ చేసుకున్నాడో తెలుసా?

హను రాఘవపూడి ఒక సెన్సిటివ్ డైరెక్టర్. ఈయన టాలెంట్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తీసిన ఒక్కో సినిమా ఒక అద్భుతం అని చెప్పాలి. పైగా ప్రతి సినిమాలో కూడా హీరోయిన్ విషయంలో చాలా సెలక్టివ్ గా ఉంటాడు. ఎందుకంటే ఆయన సినిమా మొత్తం హీరోయిన్ సెంట్రిక్ గానే తిరుగుతూ ఉంటుంది. కథలో హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. హీరోయిన్ కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కోసారి హీరోయిన్ కే ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు ఒక ఫ్రెష్ ఫేస్ ని తీసుకువస్తూ ఉంటాడు. అందుకు కారణం వాళ్ల స్టార్డమ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ని పాడు చేయకూడదు అని. ఇప్పుడు అదే ఫార్ములాని ప్రభాస్ సినిమాకి కూడా అప్లయ్ చేస్తున్నాడు అని అర్థమవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Imanvi (@iman1013)

ఇమాన్ ఇస్మాయిలే ఎందుకు?:

ఎప్పటిలాగానే ఈ సినిమాలో కూడా హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉండే ఉంటుంది అనిపిస్తోంది. అందులోనూ ఫ్రీడమ్, బ్రిటీష్ సైన్యం మీద పోరాటాలు నేపథ్యంలో వస్తున్న చిత్రం. అదీకాక ప్రభాస్ హీరోగా చేస్తున్నాడు. ఇలాంటి మూవీలో ఇమాన్ ఇస్మాయిల్ లాంటి నటిని హీరోయిన్ గా తీసుకోవడానికి కారణం మళ్లీ ఫ్రెష్ ఫేస్ కావాలి అనుకున్నట్లుగానే ఉంది. అలాగే ఈ కథలో హీరోయిన్ పాత్ర డ్యాన్స్ బేస్డ్ గా ఉండచ్చు. లేదంటే ప్రొఫెషనల్ డ్యాన్సర్ కాబట్టి ఎక్స్ ప్రెషన్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే హీరోయిన్స్ ని హ్యాండిల్ చేయడంలో హను రాఘవపూడికి స్పెషల్ ట్యాలెంట్ ఉంది. తనకు కావాల్సిన విధంగా యాక్టింగ్ ని రాబట్టుకోగలడు. ఆ నమ్మకంతోనే ఇమాన్ ఇస్మాయిల్ ని ఎంపిక చేసుకుని ఉండచ్చు. అలాగే మరీ పాపులర్ అయినా కూడా ఫ్యాన్స్ దగ్గరి నుంచి చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. అవి తన హీరోయిన్ పాత్రకు అడ్డంకులు కావచ్చు. ఏది ఏమైనా కూడా ఇమాన్ ఇస్మాయిల్ సెలక్షన్ విషయంలో మాత్రం హను రాఘవపూడికి మంచి మార్కులే పడుతున్నాయి. మరి.. హను రాఘవపూడి హీరోయిన్ సెలక్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియేజయండి.

 

View this post on Instagram

 

A post shared by Imanvi (@iman1013)

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet