మాస్ మహారాజా జోరు.. ‘ఈగల్’ డే వన్ కలెక్షన్లు ఎంతంటే?

Eagle Movie Day One Collections: ఈగల్ మూవీతో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. తొలిరోజు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే సాధించాడు. మరి ఈగల్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతో తెలుసుకుందాం.

Eagle Movie Day One Collections: ఈగల్ మూవీతో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. తొలిరోజు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే సాధించాడు. మరి ఈగల్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతో తెలుసుకుందాం.

మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించాలనే ప్రయత్నంలో డైరెక్టర్ కొంత మేర సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. థియేటర్ల దగ్గర పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ మూవీ తొలిరోజు అద్భుతమైన వసూళ్లను సాధించిందనే చెప్పాలి. రజినీకాంత్ లాల్ సలామ్ లాంటి చిత్రాలు ఉన్నప్పటికీ.. ఈగల్ కలెక్షన్లపై అవి ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. మరి మాస్ మహారాజా తొలిరోజు బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు కలెక్ట్ చేశాడో ఇప్పుడు చూద్దాం.

రవితేజ, అనుపమ పరమేశ్వర్, కావ్య థాపర్ కలిసి నటించిన చిత్రం ఈగల్. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే ఓ రేంజ్ బజ్ క్రియేట్ అయ్యింది. దానికి తగ్గట్లుగానే డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని హాలీవుడ్ రేంజ్ హంగులు అద్దుతూ వచ్చాడు. రిలీజ్ కు ముందే విడుదలైన గ్లింప్స్, టీజర్ ఈ మూవీపై ప్రేక్షకుల్లో మరింత హైప్ ను క్రియేట్ చేశాయి. ఇక భారీ అంచనాలతో ఫిబ్రవరి 9న థియేటర్లలోకి వచ్చిన ఈగల్.. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. కాగా.. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన రవితేజ, తొలిరోజు బాగానే రాబట్టాడు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఫస్ట్ డే దాదాపుగా రూ. 6 కోట్ల వరకు వసూల్ చేసినట్లు సినీ పండితులు చెబుతున్నారు. బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లో పడాలంటే ఇంకా 16 కోట్లు రాబట్టాల్సి ఉంది.

అయితే వీకెండ్ ఉండటంతో.. కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా పెద్ద సినిమాలు కూడా పోటీగా లేకపోవడం మాస్ మహారాజాకి కలిసొచ్చే అంశం. ఇక కథ విషయానికి వస్తే.. సహదేవ వర్మ(రవితేజ), జై(నవదీప్) ఓ కాటన్ ఫ్యాక్టరీని నడుపుతూ ఉంటారు. దాని ద్వారా వచ్చే లాభాలను స్థానిక ప్రజలకు పంచుతూ ఉంటారు. ఇక మరోవైపు దేశంలో జరిగే ఇల్లీగల్ వెపన్ దందాను ఈగల్ అనే ఒక ముఠా అడ్డుకుంటూ.. ఆ ఆయుధాలను కాటన్ ఫ్యాక్టరీకి చేరుస్తుంటుంది. అసలు సహదేవ వర్మ ఎవరు? ఆ గన్స్ ఆ ఫ్యాక్టరీకి ఎందుకు వస్తున్నాయి? 12 దేశాలు ఈగల్ ముఠాను ఎందుకు వెతుకుతున్నాయి? వీళ్లందరి గురించి ప్రజలకు తెలియజేయాలనుకున్న నళిని(అనుపమ పరమేశ్వరన్) ఎవరు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మరి తొలిరోజు మాస్ మహారాజా సాధించిన కలెక్షన్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: రవితేజ ఈగల్‌ మూవీ రివ్యూ

Show comments