iDreamPost
android-app
ios-app

రేవ్ పార్టీ వివాదం.. హేమకు మంచు విష్ణు మద్దతు!

  • Published May 25, 2024 | 7:56 PM Updated Updated May 25, 2024 | 7:56 PM

Rave Party Case- Manchu Vishnu Supports Hema: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రేవ్ పార్టీ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో నటి హేమ మీద పెద్దఎత్తున ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. ఈ తరుణంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు నటి హేమకు మద్దతు తెలిపాడు.

Rave Party Case- Manchu Vishnu Supports Hema: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రేవ్ పార్టీ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో నటి హేమ మీద పెద్దఎత్తున ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. ఈ తరుణంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు నటి హేమకు మద్దతు తెలిపాడు.

  • Published May 25, 2024 | 7:56 PMUpdated May 25, 2024 | 7:56 PM
రేవ్ పార్టీ వివాదం.. హేమకు మంచు విష్ణు మద్దతు!

ప్రస్తుతం కర్ణాటకను మాత్రమే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న విషయం రేవ్ పార్టీ. బెంగళూరు పోలీసులు తాజాగా నటి హేమకు రేవ్ పార్టీకి సంబంధించి నోటీసులు కూడా జారీ చేశారు. సోమవారం(మే 27)న విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. హేమ మాత్రం తాను ఏ రేవ్ పార్టీకి వెళ్లలేదంటూ వీడియోలు కూడా విడుదల చేస్తోంది. ఇలాంటి తరుణంలో నటి హేమకు మా అధ్యక్షుడు మంచు విష్ణు తన మద్దతును తెలియజేశారు. తాను ఇంకా దోషిగా తేలలేదని.. కాబట్టి ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఆమెను బంగపరిచే విధంగా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ సూచించారు.

రేవ్ పార్టీ కేసులో మొదటి నుంచి నటి హేమ పేరు వినిపిస్తూనే ఉంది. ఆమె మొదటి నుంచి తనకు ఆ రేవ్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అంటూ ఖండిస్తూనే ఉంది. అంతేకాకుండా తాను ఏ రేవ్ పార్టీలకు వెళ్లలేదంటూ వీడియోలు కూడా విడుదల చేస్తోంది. మొదట తాను హైదరాబాద్ లోనే ఉన్నాను అంటూ వీడియో మెసేజ్ రిలీజ్ చేసింది. ఆ తర్వాత బిర్యానీ వండుతూ ఒక వీడియో పెట్టింది. ఇలా తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలను హేమా ఖండిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో బెంగళూరు పోలీసులు హేమకు నోటీసులు జారీ చేశారు. మే 27, సోమవారం విచారణకు హాజరు కావాలంటూ కోరరారు. నోటీసులు వచ్చిన తర్వాత హేమ మీద విమర్శలు ఎక్కువయ్యాయి. ఇలాంటి తరుణంలో మంచు విష్ణు.. హేమకు మద్దతుగా నిలిచాడు.

మంచు విష్ణు చేసిన పోస్ట్ లో ఏం చెప్పాడంటే.. “ఇటీవల వెలుగు చూసిన రేవ్ పార్టీకి సంబంధించి పలువురు వ్యక్తులు, మీడియా సంస్థలు ఎలాంటి ఆధారాలు లేకుండా నటి హేమ మీద నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేసి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండని నేను కోరుకుంటున్నాను. దోషిగా తేలే వరకు నటి హేమ నిర్దోషే. ఒక ఫొటో ఆధారంగా పుకార్లను ప్రాచరం చేసే ముందు.. ఆమె ఒక భార్య, ఒక తల్లి అని మర్చిపోవద్దు. ఎలాంటి ఇల్లీగల్ చర్యలను అయినా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఖండిస్తుంది. నటి హేమను దోషిగా చూపిస్తూ పోలీసులు ఏదైనా ఆధారాలను చూపిస్తే.. మా అసోసియేషన్ తప్పకుండా యాక్షన్ తీసుకుంటుంది. అప్పటి వరకు ఇలాంటి ప్రచారాలు చేయకండి” అంటూ మంచు విష్ణు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

నటి హేమకు నోటీసులు, రావడం ఆమె కచ్చితంగా రేవ్ పార్టీలో పాల్గొంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ.. సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మంచు విష్ణు ఆమెకు మద్దతు తెలిపారు. హీరోగా, మా అధ్యక్షుడిగా మంచు విష్ణు చేసిన ఈ విజ్ఞప్తితో నటి హేమ విషయంలో ప్రాచారాలు, వార్తలు తగ్గుతాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలాగే ఆమె నిజంగానే రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు తేలితే మా అధ్యక్షుడిగా తాను చర్యలు తీసుకుంటాను అనే విషయాన్ని కూడా మంచు విష్ణు స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఈ రేవ్ పార్టీకి సంబంధించి బెంగళూరు పోలీసులు విచారణలో వేగం పెంచారు. ఇప్పటికే పాజిటివ్ వచ్చింది అనుకున్న అనుమానితులు అందరికీ నోటీసులు పంపారు. ఈ కేసు ఎప్పుడు కొలిక్కి వస్తుందో వేచి చూడాలి. నటి హేమకు మంచు విష్ణు మద్దతు తెలపడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet