iDreamPost
android-app
ios-app

రతిక గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న తల్లిదండ్రులు!

  • Published Oct 03, 2023 | 7:45 PM Updated Updated Oct 03, 2023 | 7:45 PM
  • Published Oct 03, 2023 | 7:45 PMUpdated Oct 03, 2023 | 7:45 PM
రతిక గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న తల్లిదండ్రులు!

బిగ్‌బాస్‌ షో మొదలైన నాలుగో వారంలోనే రతిక ఎలిమినేట్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే, రతిక బిగ్‌బాస్‌ హౌస్‌లో తన బిహేవియర్‌ కారణంగా చాలా నెగిటివిటీని మూటకట్టుకుంది. బయటకి వచ్చిన తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతోంది. ఆమెపై చాలా రకాల విమర్శలు వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ఆమెపై నెగిటివ్‌ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రతిక తల్లిదండ్రులు కూతురిపై వస్తున్న విమర్శలపై స్పందించారు. రతిక తండ్రి రాముడు, తల్లి అనిత తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వారు ఆ ఇంటర్వ్యూలో రతిక గురించి మాట్లాడుతూ..

తమ బిడ్డ బిగ్ బాస్ షోకి వెళ్లడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తను హౌస్‌లోకి వెళుతున్నట్లు తమకు తెలీదన్నారు. తమ కూతురికి అంత పేరు రావటం సంతోషంగా ఉందని అన్నారు. రతిక తమను బిడ్డలుగా సాకిందని, తమకు ఏం కావాలో.. అవి క్షణాల్లో తెచ్చిపెడుతుందని చెప్పారు. రతికకి తాము పెట్టిన పేరు ప్రియాంక అని సినిమాల్లోకి వచ్చిన తర్వాత రతికగా మార్చామని వెల్లడించారు. లైఫ్‌లో సెట్‌ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని తను చెప్పిందన్నారు.

తమ బిడ్డ లవ్ స్టోరీలంటూ వస్తున్నవన్నీ ఒట్టి పుకార్లేనన్నారు. లవ్‌ ఎఫైర్లు పుట్టించినవే తప్ప.. తమ కూతురికి లవ్ స్టోరీలు ఏమీ లేవని స్పష్టం చేశారు. రతికది అందిరితో కలిసిపోయే తత్వం అని చెప్పారు. ఆమెది చాలా మంచి గుణం అని అన్నారు. త్వరలోనే రతికకి పెళ్లి చేస్తామని వాళ్లు చెప్పారు. కూతురి గురించి చెబుతూ చాలా ఎమోషనల్‌ అయ్యారు. కన్నీళ్లు సైతం పెట్టుకున్నారు. మరి, రతిక తల్లిదండ్రులు ఆమె లవ్‌ ఎఫైర్లపై క్లారిటీ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom