iDreamPost
android-app
ios-app

వీడియో: ఫ్యాన్‌ను సర్‌ప్రైజ్‌ చేసిన రష్మిక మందన్నా!

  • Published Dec 10, 2023 | 4:41 PM Updated Updated Dec 10, 2023 | 5:37 PM

రష్మిక మందన్నా.. రణబీర్‌ కపూర్‌ జంటగా నటించిన యానిమల్‌ సినిమా డిసెంబర్‌ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని భాషల్లో సినిమా హిట్‌ అయింది...

రష్మిక మందన్నా.. రణబీర్‌ కపూర్‌ జంటగా నటించిన యానిమల్‌ సినిమా డిసెంబర్‌ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని భాషల్లో సినిమా హిట్‌ అయింది...

  • Published Dec 10, 2023 | 4:41 PMUpdated Dec 10, 2023 | 5:37 PM
వీడియో: ఫ్యాన్‌ను సర్‌ప్రైజ్‌ చేసిన రష్మిక మందన్నా!

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా నటించిన తాజా చిత్రం ‘యానిమల్‌’ సూపర్‌ హిట్‌ అయింది. ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. విడుదలైన అన్ని చోట్లా రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 600లకుపైగా కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా యానిమల్‌ మ్యానియానే కనిపిస్తోంది. ఇక, యానిమల్‌ హిట్‌తో ఎంతో ఖుషీలో ఉన్న రష్మిక ఓ ఫ్యాన్‌ను సర్‌ప్రైజ్‌ చేసింది.

ఆ వివరాల్లోకి వెళితే.. రష్మికకు దేశ వ్యాప్తంగా ఉ‍న్న వేలాది మంది ఫ్యాన్స్‌లో ప్రమోద్‌ భాస్కర్‌ కూడా ఒకడు. ఇతడు సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా రష్మికకు మెసేజ్‌లు చేస్తూ ఉంటాడు. ఆమె పోస్టులపై కూడా కామెంట్లు పెడుతుంటాడు. ఓ రోజు రష్మికకు ప్రపోజ్‌ కూడా చేశాడు. ఇందుకు ఆమె ఫన్నీగా రిప్లై ఇచ్చింది. అయితే, ప్రమోద్‌ తాజాగా ‘కౌన్‌ బనేగా కరోడ్‌ పతి ప్రోగ్రామ్‌లో పాల్గొన్నాడు. షో సందర్భంగా తనకు రష్మిక అంటే చాలా ఇష్టమని ప్రమోద్‌ అమితాబ్‌ బచ్చన్‌తో చెప్పాడు.

సోషల్‌ మీడియాలో ఆమెకు ప్రపోజ్‌ కూడా చేశానని అన్నాడు. దీంతో అమితాబ్‌ వెంటనే రష్మికకు వీడియో కాల్‌ చేశాడు. ప్రమోద్‌తో మాట్లాడించాడు. ఈ ఊహించని పరిణామంతో ప్రమోద్‌ పట్టలేనంత సంతోషానికి గురయ్యాడు. నేరుగా ఆమెను కలవాలనుందన్న కోరికను తెలిపాడు. ఇందుకు రష్మిక ఒప్పుకుంది. త్వరలో నేరుగా కలుద్దాం అని అంది. అంతేకాదు! తాను కౌన్‌ బనేగా కరోడ్‌ పతి షోలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని కూడా అంది.

ఇక, అమితాబ్‌.. రష్మికపై ప్రశంసల జల్లులు కురపించాడు. రష్మిక నటించిన అన్ని సినిమాలు తాను చూస్తానని చెప్పాడు. ఆమె నటన బాగుంటుందని కూడా పొగిడాడు. బిగ్‌బీ అమితాబ్‌ తనను పొగడ్డంతో రష్మిక ఉక్కిరిబిక్కిరి అయింది. కాగా, రష్మిక తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనే కాదు.. హిందీలోనూ సినిమాలు చేసింది. బిగ్‌బీ అమితాబ్‌తో కలిసి కూడా నటించింది. 2022లో వచ్చిన గుడ్‌బై సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది.

ఈ చిత్రంలో అమితాబ్‌ కూతురిగా నటించింది. తర్వాత మిషన్‌ మంజు, యానిమల్‌ సినిమాలు చేసింది. వీటిలో యానిమల్‌ సంచలన హిట్‌ అయింది. రష్మిక ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాల్లో నటిస్తోంది. ఒకటి పుష్ప సీక్వెల్‌ పుష్ప 2 కాగా.. ది గళ్‌ ఫ్రెండ్‌,  రెయిన్‌ బో చిత్రాల్లో లీడ్‌ రోల్‌ చేస్తోంది. ప్రస్తుతం ఈ మూడు మూవీల షూటింగ్‌ శరా వేగంగా సాగుతోంది. మరి, రష్మిక తన ఫ్యాన్‌ను సర్‌ప్రైజ్‌ చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetJojobetHoliganbetJojobetHoliganbetjojobetgrandpashabetkralbetcasibomiptvjojobetcasibomcasibomGrandpashabetgrandpashabetepikbahis girişEscortes BelgiqueCasibomCasibomgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom