iDreamPost
android-app
ios-app

ఏదైనా సక్సెస్ కిక్కే వేరబ్బా…..

  • Published Mar 20, 2024 | 4:38 PM Updated Updated Mar 20, 2024 | 4:41 PM

దాంతో పాటు అందులో హీరోయిన్ రష్మిక మందానా పాప్యులారిటీ కూడా కాశ్మీర్ టు కన్యాకుమారి వరకూ వైల్డ్ ఫైర్ లా అంటుకుంది. అదలా ఉంటుండగానే రష్మికను మరో పెను సంచలనం వరించింది. అదే యానిమల్ సినిమా.

దాంతో పాటు అందులో హీరోయిన్ రష్మిక మందానా పాప్యులారిటీ కూడా కాశ్మీర్ టు కన్యాకుమారి వరకూ వైల్డ్ ఫైర్ లా అంటుకుంది. అదలా ఉంటుండగానే రష్మికను మరో పెను సంచలనం వరించింది. అదే యానిమల్ సినిమా.

  • Published Mar 20, 2024 | 4:38 PMUpdated Mar 20, 2024 | 4:41 PM
ఏదైనా సక్సెస్ కిక్కే వేరబ్బా…..

మామ్మూలుగానే పుష్ఫ ఫస్ట్ పార్ట్ అంత పెద్ద హిట్ కాగానే అల్లు అర్జున్ ఇమేజ్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. దాంతో పాటు అందులో హీరోయిన్ రష్మిక మందానా పాప్యులారిటీ కూడా కాశ్మీర్ టు కన్యాకుమారి వరకూ వైల్డ్ ఫైర్ లా అంటుకుంది. అదలా ఉంటుండగానే రష్మికను మరో పెను సంచలనం వరించింది. అదే యానిమల్ సినిమా. ఇది వైల్డ్ ఫైర్ కూడా కాదు. ఇంకేదైనా పెద్ద పేరు పెట్టాలి. యానిమల్ సినిమా గురించి ఎవరెన్న మాట్లాడినా, ఇదేదో మెగాస్టార్ నటించిన కిరాతకుడు సినిమాకి కాపీ అన్నా, దీనిమీద రాజ్యసభలో కూడా దుమారం లేచినా, వాటన్నిటినీ పక్కనబెట్టిమరీ యానిమల్ బాక్సాఫీసు దగ్గర భీబత్సంగా మారింది.

సందీప్ వంగా చేసిన ఫ్యామిలీ డ్రామాయే గానీ, యూత్ ని, ఫ్యామిలీస్ ని ఈక్వల్ గా ఊపేసింది. ఇప్పుడు యానిమల్ బ్యూటీ రష్మిక పుష్ప 2 షూటింగ్ లో పాల్గొంటోంది అంటే కూడా అదే వీర సెన్సేషన్ అయిపోయింది సోషల్ మీడియాలో. షూటింగ్ కి రెడ్ సారీలో రష్మిక తయారై, స్పాట్ లోకి అడుగుపెడుతుంటే కూడా అదో మహా ఫెస్టివల్ లా మారింది. సోషల్ మీడియా ఆసేతు హిమాచలం ఒకటే గగ్గోలు పుట్టింది. ఆల్రెడీ, పుష్ఫ 2 ఆగస్టు 15న విడుదలవుతోంది అనే వార్త విని ఆలిండియా ఆడియన్స్ భాషతో సంబంధం లేకుండా వెర్రెత్తిపోతున్నారు. హీరో క్యారెక్టర్ ని డైరెక్టర్ సుకుమార్ ఎంత జాగ్రత్తగా చెక్కేడో, అంతే గొప్పగా అల్లు అర్జున్ కూడా పెరఫార్మ్ చేయడంతో పుష్ఫ ఓ చరిత్రని క్రియేట్ చేయగలిగింది.

Rashmika mandanna success

 

దీని మీద హై ఎక్స్ పెక్టేషన్స్ ఆకాశాన్ని అంటుకున్నాయి. గన్ షాట్ గా వెయ్యికోట్ల ఫిగర్ ని క్రాస్ చేసేస్తుందన్న టాక్ మొత్తం అన్ని చోట్లా ఉన్నా అపోజిషన్ సినిమాలను కూడా లెక్కబెట్టుకుని, బాలీవుడ్ మీడియా పుష్ఫ 2 గ్రాస్ మీద గందరగోళం చేస్తున్నారు. కన్నడలో శివరాజ్ కుమార్ సినిమాతో హిందీలో మరో జెయింట్ ఫిల్మ్ అదే రోజున రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకునే సరికి ట్రేడ్ పండిట్స్ అడ్డూఆపూ లేని కేలిక్యులేషన్స్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.దీనంతటికీ, ఈ రెడ్ సారీ రష్మిక అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మారింది. ఈ మధ్యనే రష్మిక మీద రాంగ్ పోష్టులు ప్రత్యక్షం కాగానే అమితాబ్ దగ్గర్నుంచీ జోక్యం చేసుకుని, పెద్దపద్దవాళ్ళనుకున్నవాళ్ళు కూడా ఆమెకు అండగా నిల బడడం, రష్మిక జెంటిల్ గా ప్రవర్తించడంతో….ఆమెకు సానుభూతితో పాటు, ఎంతో సపోర్ట్ కూడా లభించింది. ఇవన్నీ రష్మికని ఓవర్ నైట్ ని చేసేశాయి. అందుకే సోషల్ మీడియాలో ఇంత హల్ చల్. ఏదైనా సక్సెస్ కిక్కే వేరబ్బా….

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişcasibom