iDreamPost
android-app
ios-app

పుష్ప2 లో రష్మిక క్యారెక్టర్ ఇదేనా.. ఇక అసలు బొమ్మ కనిపిస్తుంది

  • Published Nov 25, 2024 | 5:43 PM Updated Updated Nov 25, 2024 | 5:43 PM

బన్నీని తెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో.. రష్మిక క్యారెక్టర్ ఎలా ఉండబోతుందా అని కూడా ఓ వర్గం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే సుకుమార్ సినిమాలలో హీరోయిన్స్ కు ఓ స్పెషల్ యాట్రక్షన్ ఉంటుంది. కేవలం వారికోసమే ఈ క్యారెక్టర్స్ డిసైన్ చేశాడా అనే రేంజ్ లో ఆ పాత్రలు తెరపై కదులుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే రష్మిక క్యారెక్టర్ పై కూడా అంచనాలు బాగా పెరిగాయి.

బన్నీని తెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో.. రష్మిక క్యారెక్టర్ ఎలా ఉండబోతుందా అని కూడా ఓ వర్గం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే సుకుమార్ సినిమాలలో హీరోయిన్స్ కు ఓ స్పెషల్ యాట్రక్షన్ ఉంటుంది. కేవలం వారికోసమే ఈ క్యారెక్టర్స్ డిసైన్ చేశాడా అనే రేంజ్ లో ఆ పాత్రలు తెరపై కదులుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే రష్మిక క్యారెక్టర్ పై కూడా అంచనాలు బాగా పెరిగాయి.

  • Published Nov 25, 2024 | 5:43 PMUpdated Nov 25, 2024 | 5:43 PM
పుష్ప2 లో రష్మిక క్యారెక్టర్ ఇదేనా.. ఇక అసలు బొమ్మ కనిపిస్తుంది

పుష్ప 2 సినిమా మీద ఎలాంటి బజ్ నడుస్తుందో తెలియనిది కాదు. రోజు రోజుకి సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. ఇక రీసెంట్ గా జరిగిన ఈవెంట్ లో ఐటెం సాంగ్ ను కూడా లాంచ్ చేశారు. ఇప్పుడిప్పుడే ఈ సాంగ్ స్లో పాయిజన్ లా సోషల్ మీడియాలో పాకేస్తుంది. మెల్లగా ఇది కూడా ఊ అంటావా రేంజ్ లో హిట్ అందుకోవడం ఖాయం. అటు సుకుమార్ మాత్రం లాస్ట్ మినిట్ లో వర్క్స్ లో మునిగితేలుతున్నాడు. అయినా సరే సినిమా మాత్రం అనుకున్న టైం కి వచ్చి తీరుతుంది. అందులో అసలు తగ్గేదేలే అంటున్నారు  మేకర్స్. బన్నీని తెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో.. రష్మిక క్యారెక్టర్ ఎలా ఉండబోతుందా అని కూడా ఓ వర్గం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే సుకుమార్ సినిమాలలో హీరోయిన్స్ కు ఓ స్పెషల్ యాట్రక్షన్ ఉంటుంది. కేవలం వారికోసమే ఈ క్యారెక్టర్స్ డిసైన్ చేశాడా అనే రేంజ్ లో ఆ పాత్రలు తెరపై కదులుతూ ఉంటాయి.

ఈ క్రమంలోనే రష్మిక క్యారెక్టర్ పై కూడా అంచనాలు బాగా పెరిగాయి. ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకాస్త ఎక్కువగానే ఊహాగానాలు మొదలయ్యాయి. ఓ రెండు మూడు రోజులు సోషల్ మీడియా అంత రష్మిక గురించే టాక్ నడిచింది. పార్ట్ 1 లో రష్మిక పాత్ర కనిపించేది తక్కువే అయినా ఆ సీన్స్ మాత్రం చాలా కీలకంగా ఉంటాయి. ఇక ఇప్పుడు పార్ట్ 2 లో ఆమె పాత్ర మరింత బలంగా ఉంటుందని అంతా అంటున్నారు. ట్రైలర్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది. శ్రీవల్లి క్యారెక్టర్ తోనే స్టోరీ ఊహించని మలుపు తిరుగుతుందట. పైగా ఈ క్యారెక్టర్ తోనే మూవీలోని మరో మెయిన్ క్యారెక్టర్ లింక్ అయ్యి ఉంటుందట. అంతే కాకుండా ఊహించని ట్విస్ట్ కూడా ఉండబోతుందని సమాచారం. మొన్నీమధ్యన కట్టప్ప లాంటి క్యారెక్టర్ ఒకటి సినిమాలో ఉంటుందని అంతా అన్నారు. ఇప్పుడు రష్మీక క్యారెక్టర్ ఊహించని ట్విస్ట్ కు దారి తీస్తుంది అంటే.. ఏమై ఉంటుందా అని ఊహాగానాలు మొదలయ్యాయి. పైగా ట్రైలర్ లో చూపించిన సీన్స్ లో రష్మీక చాలా ఇంటెన్స్ గా నటించినట్లు కనిపించింది. సో మొత్తానికి సుక్కు ఈసారి శ్రీవల్లిని క్యారెక్టర్ తో చాలా బలమైన కథను చూపించబోతున్నాడనిపిస్తుంది. ఇది కనుక వర్క్ అవుట్ అయితే ఇక థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం.

ఇక ఈ క్యారెక్టర్ తో పాటు తెరపై ఇంకా చాలా కొత్త క్యారెక్టర్స్ కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయట. ఫహద్ ఫాజిల్ , శ్రీతేజ్, సునీల్, అనుసూయ భరద్వాజ్, జగదీప్ ప్రతాప్ భండారి, శ్రీలీల, దయానంద్ రెడ్డి, రావు రమేష్, జగపతి బాబు క్యారెక్టర్స్ హైలెట్ అవుతాయని టాక్. అటు ట్రైలర్ ను రికార్డ్ బ్రేకింగ్ రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు ఐటెం సాంగ్ కూడా కొన్ని రోజుల్లో గట్టిగానే సౌండ్ చేసేలా ఉంది. ఇలా రోజు రోజుకి సినిమా మీద ఊరిస్తూ వస్తున్న అప్డేట్స్ మరింత ఎగ్జైట్మెంట్ పెంచుతున్నాయి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom