iDreamPost
android-app
ios-app

సరదాగా కనిపించే రష్మీలో ఇంత బాధ ఉందా?లైవ్‌లో ఏడ్చేసింది!

  • Published Apr 24, 2024 | 5:48 PM Updated Updated Apr 24, 2024 | 5:48 PM

బుల్లితెరపై అలరిస్తున్న అతికొద్ది యాంకరమ్మల్లో ఒకరు రష్మీ గౌతమ్. సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ ఉంటుంది. తనపై సెటైర్స్ వేసిన తేలిగ్గానే తీసుకుంటుంది. అలాంటి రష్మీని ఏడిపించేశారు పండు అండ్ చైల్డ్ ఆర్టిస్టులు.

బుల్లితెరపై అలరిస్తున్న అతికొద్ది యాంకరమ్మల్లో ఒకరు రష్మీ గౌతమ్. సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ ఉంటుంది. తనపై సెటైర్స్ వేసిన తేలిగ్గానే తీసుకుంటుంది. అలాంటి రష్మీని ఏడిపించేశారు పండు అండ్ చైల్డ్ ఆర్టిస్టులు.

  • Published Apr 24, 2024 | 5:48 PMUpdated Apr 24, 2024 | 5:48 PM
సరదాగా కనిపించే రష్మీలో ఇంత బాధ ఉందా?లైవ్‌లో ఏడ్చేసింది!

వెండితెర నుండి బుల్లితెరపైకి వచ్చి తన యాంకరింగ్‌తో ఆకట్టుకుంటున్నబ్యూటీ రష్మీ గౌతమ్. టీవీ కామెడీ షో ఎక్స్ ట్రా జబర్థస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు కూడా యాంకర్‌గా వ్యవహరిస్తుంది. అలాగే సినిమాలు చేస్తూ అలరిస్తోంది. గత ఏడాది భోలా శంకర్ చిత్రంలో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఆమె జంతు ప్రేమికురాలు అన్న సంగతి విదితమే. తెరపై ఎంతో సరదాగా నవ్వుతూ, నవిస్తూ ఉంటే రష్మి వెరీ ఎమోషనల్ పర్సన్ కూడా. ఇప్పుడు మరోసారి ఆమె కన్నీటి పర్యంతం అయ్యింది. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఏడ్చేసింది. ఇంతకు ఆమె ఏడ్చేందుకు కారణమయ్యాడు ప్రముఖ డ్యాన్సర్ కమ్ యాంకర్ పండు అండ్ చైల్డ్ ఆర్టిస్టులు. ఇంతకు ఆమెను ఎందుకు ఏడిపించారు.. రష్మి ఏడవడానికి కారణమేమిటంటే..?

ప్రముఖ ఛానల్లో ఎంటర్ టైన్ చేస్తున్న షోల్లో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. ప్రతి వారం ఓ కొత్త కాన్సెప్ట్ తీసుకు వచ్చి.. షోను రసవత్తరంగా తీర్చిదిద్దుతున్నారు. జబర్థస్త్ నటీనటులంతా ఈ షోలో కూడా వచ్చి ఎంటర్ టైన్ చేస్తుంటారు. టాలెంటర్లను ఈ షో ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఉంటుంది. ఇందులో జడ్జిగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేస్తోంది నటి ఇంద్రజ.  రష్మీ గౌతమ్‌తో పాటు తన బెస్ట్ పెయిర్ సుడిగాలి సుధీర్ అప్పుడప్పుడు వచ్చి తన స్టైల్ యాంకరింగ్ చేసి మెప్పిస్తుంటాడు. ఆది, ఇతరులు కూడా  వచ్చి నవ్వులు పువ్వులు పూయిస్తుంటారు. కాగా, ఇప్పుడు బడులకు సమ్మర్ సెలవులు ఇచ్చేయడంతో ఈ వారం సమ్మర్ హాలీడేస్ కాన్సెప్ట్ తీసుకు వచ్చారు.

దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో జబర్థస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్‌లో నటిస్తున్న చిన్నారులంతా కనిపించి సందడి చేశారు. ఆది, రోషిణి కూడా వచ్చారు. అయితే ఈ ప్రోగ్రాం ఏప్రిల్ 28న ప్రసారం చేయనున్నారు. కాగా, ఏప్రిల్ 27న రష్మీ పుట్టిన రోజును పురస్కరించుకుని స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇందుల డ్యాన్సర్ పండు స్పెషల్ డ్యాన్స్ ఫెర్ఫామెన్స్ ఇచ్చాడు. అదే సమయంలో ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు పండు అండ్ చైల్డ్ ఆర్టిస్టులు. వారి సమక్షంలో ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూడగానే.. కన్నీరు కార్చింది. అందులో తనకు ఎంతో ఇష్టమైన తన కుక్క చుట్కీతో ఉన్న ఫోటో ఫ్రేమ్ చూసి..ఏడ్చేసింది. చుట్కీ..రష్మీ పెంపుడు జంతువు. ఇటీవల అనారోగ్య సమస్యలతో మరణించింది. ఇప్పుడు ఆ ఫోటో చూసి ఏడ్చేసింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet