iDreamPost
android-app
ios-app

Satya: ఇమిటేషన్ ఇరగదీసిన సత్య.. వెల్ కమ్ టూ మై హార్ట్ అంటూ..!

  • Published Jul 04, 2023 | 1:17 PM Updated Updated Jul 04, 2023 | 2:13 PM
  • Published Jul 04, 2023 | 1:17 PMUpdated Jul 04, 2023 | 2:13 PM
Satya: ఇమిటేషన్ ఇరగదీసిన సత్య.. వెల్ కమ్ టూ మై హార్ట్ అంటూ..!

నాగశౌర్య ఇటీవల ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మళ్లీ జులై 7న రంగబలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే చిత్ర బృందం చాలా వినూత్నంగా ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి పిచ్చ వైరల్ అయ్యేలా గట్టిగానే ప్లాన్ చేశారు. అందులో భాగంగానే తెలుగు మీడియా జర్నలిస్టులను ఇమిటేట్ చేస్తూ ఒక స్పూఫ్ టీజర్ రిలీజ్ చేశారు.

అయితే ఈ టీజర్ కు బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. కమెడియన్ సత్య యాక్టింగ్ ఇరగదీశాడు అంటూ తెగ మెచ్చేసుకున్నారు. అయితే ఈ ఇంటర్వ్యూలో ఉన్న కొందరు మాత్రం వీడియో రిలీజ్ చేయకూడదను వాదించినట్లు చెప్పుకొచ్చారు. ఆ నేపథ్యంలోనే అసలు ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎట్టకేలకు ఈ ఇంటర్వ్యూకి సంబంధించి పార్ట్ 1 విడుదల చేశారు. ఈ పార్ట్ లో ఓపెన్ హార్ట్ విత్ సత్య, ఇంటర్వ్యూ విత్ దేవి ప్రియ అని ఇద్దరిని మాత్రమే చూపించారు. రేపు మళ్లీ పార్ట్ 2 రిలీజ్ చేస్తామంటూ చెప్పుకొచ్చారు.

వీడియో స్టార్టింగ్ లోనే ఇది కేవలం ఫన్ కోసం మాత్రమే చేస్తున్నామని.. జర్నలిస్టులంటే గౌరవం ఉందంటూ డిస్ క్లైమర్ కూడా వేశారు. ఇంక సత్య యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూకి ఇంత క్రేజ్ వచ్చింది అంటే అది సత్య ఇమిటేషన్ చూసే. వెల్ కమ్ టూ మై హార్ట్ అంటూ సత్య.. నాగ శౌర్యన ఒక ఆటఆడుకున్నాడు. దేవిప్రియ ఇంటర్వ్యూలో కూడా నాగశౌర్యకు చుక్కలు చూపించాడు. మొత్తానికి తాము కోరుకున్న ఇంటర్వ్యూ రిలీజ్ అయిందని నెటిజన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ