iDreamPost
android-app
ios-app

చెక్ బౌన్స్ కేసులో స్టార్ హీరోయిన్ కు ఫైన్!

  • Author Soma Sekhar Published - 06:03 PM, Thu - 27 July 23
  • Author Soma Sekhar Published - 06:03 PM, Thu - 27 July 23
చెక్ బౌన్స్ కేసులో స్టార్ హీరోయిన్ కు ఫైన్!

సాధారణంగా హీరోలు, హీరోయిన్స్ చిక్కుకునే ప్రధాన సమస్యల్లో ఒకటి చెక్ బౌన్స్ కేసు. ఇండస్ట్రీలో తరచుగా వినిపించే పేరు చెక్ బౌన్స్ కేసు. ఆ నిర్మాత నన్ను మోసం చేశాడు.. ఈ నిర్మాత నన్ను మోసం చేశాడు అంటూ ఎన్నో సార్లు హీరోలు, హీరోయిన్స్ గతంలో చెక్ బౌన్స్ కేసులు పెట్టిన సంగతి తెసిందే. అయితే ఈసారి రివర్స్ లో ఓ స్టార్ హీరోయిన్ చెక్ బౌన్స్ కేసులో చిక్కుకుంది. దాంతో ఆమెకు కోర్టు ఫైన్ కూడా విధించింది. ఓ నిర్మాతకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో.. సదరు నిర్మాత ఆ స్టార్ హీరోయిన్ పై కేసు పెట్టాడు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ప్రముఖ బాలీవుడ్ నటి అమీషా పటేల్ గతంలో ఓ చెక్ బౌన్స్ కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ ప్రొడ్యూసర్ అజయ్ కుమార్ ఓ సినిమా విషయంలో అమీషా పటేల్ పై చెక్ బౌన్స్ కేసు వేశాడు. మూవీ నిర్మిస్తానంటూ తన దగ్గర నుంచి రూ. 2.5 కోట్లు తీసుకుని, సినిమా నిర్మించకపోవడమే కాకుండా.. తన డబ్బులు తనకు ఇవ్వలేదని రాంచీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశాడు అజయ్ కుమార్. దీంతో ఈ కేసుపై రాంచీ కోర్టులో పలు మార్లు విచారణ కూడా జరిగింది.

అయితే ఈ విచరణకు అమీషా పటేల్ హాజరుకాలేదు. దాంతో ఏప్రిల్ 6న ఆమెకు కోర్టు వారెంట్ ఇష్యూ చేసింది. చేసేదేమీ లేక అమీషా పటేల్ రాంచీలోని సివిల్ కోర్ట్ లో లొంగిపోయింది. విచారణ జరిపిన కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. కాగా.. ఇదే కేసులో ఆమె తరపున వాదించే లాయర్ లేకపోవడంతో.. అమీషా పటేల్ కు రాంచీ కోర్టు రూ. 500 జరిమానాగా విధించింది. ఇక ఈ కేసు గురించి తదుపరి విచారణను ఆగస్టు 7కి వాయిదా వేసింది న్యాయస్థానం. మరి సెలబ్రిటీ హోదాలో ఉండి అమీషా పటేల్ ఈ విధంగా ఫైన్ కట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: స్పీడ్ పెంచిన వరుణ్ తేజ్.. ఇంట్రెస్టింగ్ టైటిల్ తో మరో పాన్ ఇండియా మూవీ!

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbabilonbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom