iDreamPost
android-app
ios-app

యానిమల్ ఫస్ట్ డే కలెక్షన్స్.. రణ్‌బీర్ కెరీర్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్

  • Published Dec 02, 2023 | 10:13 AM Updated Updated Dec 02, 2023 | 11:22 AM

Animal Movie First Day Collection..సెన్సెషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో.. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన జంటగా తెరకెక్కిన యానిమాల్ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మరి ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..

Animal Movie First Day Collection..సెన్సెషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో.. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన జంటగా తెరకెక్కిన యానిమాల్ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మరి ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..

  • Published Dec 02, 2023 | 10:13 AMUpdated Dec 02, 2023 | 11:22 AM
యానిమల్ ఫస్ట్ డే కలెక్షన్స్.. రణ్‌బీర్ కెరీర్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్

అర్జున్ రెడ్డి సినిమాతో టోటల్ సౌత్ ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేశాడు.. ఆ తర్వాత దాన్నే హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి.. బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసి.. దేశం మొత్తం తన పేరు మారుమోగాల చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాల తర్వాత సందీప్ రెడ్డిపై ఓ రేంజ్ లో అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రకటించిన యానిమల్ సినిమా మీద కూడా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు పెరిగిపోయాయి. టీ సిరీస్ నిర్మాణంలో.. రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా.. తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక రణ్‌బీర్ కపూర్ కెరీర్లోనే ఆల్ టైమ్ బెస్ట్ పర్ఫామెన్స్ ఈ చిత్రంలో ఇచ్చాడని.. ప్రశంసించారు ప్రేక్షకులు. తండ్రీకొడుకుల అనుబంధంతో తెరకెక్కిన ఈ చిత్రం.. సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మరి యానిమల్ ఫస్ట్ డే కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

సుమారు 200 కోట్ల రూపాయలతో యానిమల్ సినిమా తెరకెక్కించారని టాక్. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 210 కోట్ల షేర్, 400 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేయాల్సిన అవశ్యకత ఏర్పడింది. ఈ క్రమంలోనే భారీ అంచనాల మధ్య.. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా 4000 థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఇక మొదటిరోజే అన్నీ అంచనాలను దాటేసింది యానిమల్ మూవీ. ఇండస్ట్రీ ట్రాకర్ సాక్ నిల్ ప్రకారం.. మొదటి రోజే భారతదేశంలో రూ.71 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా ఓవర్సీస్‌లో తొలి రోజున సుమారుగా 45 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా యానిమల్ సినిమా ఫస్ట్ డే నాడు రూ.116 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లుగా సమాచారం. ఈ సంవత్సరంలో.. మొదటి రోజునే అత్యంత గౌరవనీయమైన మైలురాయిని దాటిన మూడవ బాలీవుడ్ చిత్రంగా యానిమల్ సినిమా నిలిచింది. మొదటి రోజు మార్నింగ్ షోలు మధ్యాహ్నం షోలు 46 శాతం, 54 శాతం ఆక్యుపెన్సీ జరిగినగట్లు నివేదికలు వెల్లడించాయి.

యానిమల్ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉండటం.. టీజర్, ట్రైలర్ వాటిని మరింత పెంచడంతో.. మూవీ విడుదలకు ముందే దాదాపు 5 లక్షల టికెట్స్ సేల్ అయినట్లుగా తెలిసింది. బాహుబలి 2, జవాన్, పఠాన్, కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత రిలీజ్ కు ముందే భారీ సంఖ్యలో టికెట్స్ బుక్ అయిన చిత్రాల జాబితాలో ఐదవ స్థానంలో యానిమల్ సినిమా నిలిచింది. తెలంగాణ, ఆంధ్రాలో ఈ సినిమాకు అత్యధిక కలెక్షన్స్ వస్తున్నాయి.

గతంలో రణబీర్ నటించిన బ్రహ్మాస్త్ర భారత్ లో రూ.36 కోట్లు వసూలు చేసింది. అంతకు ముందు అతను నటించిన సంజు మొదటి రోజే రూ.34 కోట్లు రాబట్టగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లు రాబట్టింది. కానీ యానిమల్ మాత్రం తొలి రోజు.. ఇండియాలో 65 కోట్ల రూపాయల వసూలు చేసి.. అతడి కెరీర్ లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచిపోయింది.

ఇక ఈ వీకెండ్‏లో యానిమల్ సినిమా సులభంగా రూ.350 కోట్ల వరకు వసూలు చేస్తుందని గతంలో చిత్రయూనిట్ అంచనా వేసింది. హిందీలో కబీర్ సింగ్ రూపొందించిన ఐదేళ్ల తర్వాత సందీప్ తెరకెక్కించిన సినిమా యానిమల్. కబీర్ సింగ్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.400 కోట్లు వసూళ్లు చేశాడు. యానిమల్ సినిమా అంతకు మించి వసూలు చేస్తుందని అంచాన వేస్తున్నారు.


Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş