iDreamPost
android-app
ios-app

ఆ స్టార్ హీరోయిన్లతో డేటింగ్ చేశా.. నన్ను మోసగాడు అన్నారు: స్టార్ హీరో

  • Published Jul 22, 2024 | 3:30 AM Updated Updated Jul 22, 2024 | 3:30 AM

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ స్టార్ హీరో తన లవ్, బ్రేక్, లైఫ్ గురించిన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ స్టార్ హీరో తన లవ్, బ్రేక్, లైఫ్ గురించిన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

  • Published Jul 22, 2024 | 3:30 AMUpdated Jul 22, 2024 | 3:30 AM
ఆ స్టార్ హీరోయిన్లతో డేటింగ్ చేశా.. నన్ను మోసగాడు అన్నారు: స్టార్ హీరో

ఇద్దరు స్టార్ హీరోయిన్లతో డేటింగ్ చేస్తే.. తనకు చీటర్ అనే ట్యాగ్ ఇచ్చారని, తన జీవితంలో సగం ఈ మోసగాడు అనే ముద్రతోనే జీవించానని చెప్పుకొచ్చాడు ఓ స్టార్ హీరో. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ స్టార్ హీరో తన లవ్, బ్రేక్, లైఫ్ గురించిన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఇటీవలే భారీ సక్సెస్ ను అందుకున్నాడు ఈ హీరో. మరి మోసగాడు అని ముద్రవేయించుకున్న ఆ యాక్టర్ ఎవరు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రణ్ బీర్ కపూర్.. బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోల్లో ఒకడు. ముఖ్యంగా ఇతడికి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ.. తనదైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం రామాయణం మూవీలో నటిస్తున్నాడు. ఇందులో రణ్ బీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తోంది. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రణ్ బీర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

రణ్ బీర్ కపూర్ మాట్లాడుతూ..”ఇద్దరు స్టార్ హీరోయిన్లతో నేను డేటింగ్ చేశాను. కానీ ఆ తర్వాత నన్ను వారి మాజీ ప్రియుడు అని పిలిచారు. అదీకాక నన్ను కాసినోవా అని, మోసగాడు అని వివిధ రకాల పేర్లతో పిలిచారు. నా లైఫ్ లో సగం చీటర్ అన్న ముద్రతోనే బతికాను. ఇప్పటికీ ఆ పేర్లతో నన్ను కొందరు పిలుస్తుంటారు. అయితే నేనెప్పుడు వారి గురించి చెడుగా చెప్పలేదు. నా కూతురు రాహా అంటే నాకు ప్రాణం. రాహాను చూస్తుంటే.. నా గుండెను తీసి నా చేతుల్లో పెట్టినట్లు ఉంటుంది. ఇక మా నాన్న(రిషీ కపూర్) కు కోపం ఎక్కువ. కానీ చాలా మంచివారు. ఆయన మాటకు ఏనాడూ ఎదురుచెప్పలేదు” అంటూ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రణ్ బీర్. కాగా.. రణ్ బీర్ దీపికా పదుకొణె, కత్రీనా కైఫ్ లతో డేటింగ్ చేశాడని అప్పట్లో చాలా వార్తలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet