iDreamPost
android-app
ios-app

Animal ట్విట్టర్ రివ్యూ.. అంచనాలు మించి ఉంది.. ఇంటర్వెల్ ఫైట్ సూపర్ అంటూ

  • Published Dec 01, 2023 | 9:50 AM Updated Updated Dec 05, 2023 | 12:11 PM

అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన చిత్రం యానిమల్. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చూసిన వారు ట్విట్టర్ లో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఆ వివరాలు..

అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన చిత్రం యానిమల్. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చూసిన వారు ట్విట్టర్ లో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఆ వివరాలు..

  • Published Dec 01, 2023 | 9:50 AMUpdated Dec 05, 2023 | 12:11 PM
Animal ట్విట్టర్ రివ్యూ.. అంచనాలు మించి ఉంది.. ఇంటర్వెల్ ఫైట్ సూపర్ అంటూ

అర్జున్ రెడ్డి సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.. మరోసారి యానిమల్ సినిమాతో ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి వచ్చేశాడు. రణ్‌బీర్ కపూర్, రష్మికా మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం నేడు అనగా డిసెంబర్ 1, శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలను ఓ రేంజ్లో పెంచాయి. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ఓవర్సీస్ తో పాటు.. దేశ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఫస్ట్ డే ఫస్ట్ ఫో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు.. ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సినిమా సూపర్ గా ఉందని.. అంటున్నారు.

Animal మూవీ రివ్యూ – ఇక్కడ చదవండి 

సందీప్ రెడ్డి వంగా మార్క్ లోనే ఈ మూవీ ఉందని, సినిమా అన్ని అంచనాలను మించేలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇంటర్వెల్ ఫైట్ అద్భుతంగా ఉందని, ఫస్ట్ 15 నిమిషాలు అస్సలు మిస్ అవ్వొద్దని.. ఓవరాల్‌గా సినిమా అదిరిపోయిందని రివ్యూ ఇస్తున్నారు నెటిజనులు. యానిమల్ సినిమాలో మీరు తండ్రీకొడుకుల బంధాన్ని కొత్త కోణంలో చూడబోతున్నారు. మనలోని ఇంకో కోణం.. ఆ కోణాన్ని మనం చూడటానికి, చెప్పుకోవడానికి కూడా ఇష్టపడం.. కానీ ఆ కోణాన్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించారుని కామెంట్స్ చేస్తున్నారు.

బాలీవుడ్‌లో ఇప్పటి వరకు వచ్చిన ది బెస్ట్ మూవీ ఇదే.. సినిమాలో అందరూ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు.. వంగా మాస్టర్ పీస్ తీశాడు.. రన్ టైంతో ప్రయోగం చేయడమే కాక వయలెన్స్ తో కూడా అదరగొట్టేశాడు.. సినిమా మూడున్నర గంటలు ఉందా అనే ఫీలింగ్, బోరింగ్ రాకుండా అద్భుతంగా తెరకెక్కించాడు. రెగ్యులర్ బాలీవుడ్ సినిమాలా ఈ మూవీ అనిపించదు అంటూ నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ అద్భుతంగా నటించాడని.. ఈ జనరేషన్‌లోనే గ్రేటెస్ట్ యాక్టర్.. బాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే నటుడిలా ఈ సినిమాలో జీవించేశాడు.. బాబీ డియోల్ మాత్రం అందర్నీ భయపెట్టేశాడు.. బాడీ లాంగ్వేజ్‌తోనే మనలో భయాన్ని కలగజేశాడు.. ఓవరాల్‌గా ఈ మూవీ మాత్రం అద్భుతం.. అన్ని రికార్డులను బద్దలు కొట్టబోతోంది అని కొందరు నెటిజనులు ట్వీట్ చేశారు. మొత్తానికి యానిమల్ మూవీ బ్లాక్ బాస్టర్ అని తేల్చి చెప్పారు. మరి యానిమల్ సినిమా మీకు నచ్చిందా లేదా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommeritbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetholiganbet