iDreamPost
android-app
ios-app

రణబీర్ vs ప్రభాస్! కొత్తగా ఈ గొడవేంటి? పెద్ద పోటీనే!

  • Published Jan 25, 2024 | 5:13 PM Updated Updated Jan 25, 2024 | 5:13 PM

గత డిసెంబర్ లో బాక్సాఫీసును షేక్ చేసేశాయి కొన్ని సినిమాలు. వాటిల్లో ఒకటి సలార్. షారూఖ్ ఖాన్ వంటి స్టార్ నటుడు బరిలో ఉన్నా ఏ మాత్రం భయపడకుండా.. సలార్ మూవీని విడుదల చేశాడు దర్శకుడు. అనుకున్నట్లుగానే కాటేరమ్మ కొడుకు కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తుంది. అయితే..

గత డిసెంబర్ లో బాక్సాఫీసును షేక్ చేసేశాయి కొన్ని సినిమాలు. వాటిల్లో ఒకటి సలార్. షారూఖ్ ఖాన్ వంటి స్టార్ నటుడు బరిలో ఉన్నా ఏ మాత్రం భయపడకుండా.. సలార్ మూవీని విడుదల చేశాడు దర్శకుడు. అనుకున్నట్లుగానే కాటేరమ్మ కొడుకు కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తుంది. అయితే..

  • Published Jan 25, 2024 | 5:13 PMUpdated Jan 25, 2024 | 5:13 PM
రణబీర్ vs ప్రభాస్! కొత్తగా ఈ గొడవేంటి? పెద్ద పోటీనే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- కేజీఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం సలార్-ది సీజ్ ఫైర్. డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రభాస్ న్యూ లుక్స్, యాక్షన్ ఎలివేషన్స్ చూసి.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. ఆరున్నర ఆకలిని ఈ మూవీతో తీర్చేశాడు దర్శకుడు. మొత్తం రూ. 600 కోట్లకు పైగా కొల్లగొట్టిందీ చిత్రం. పృధ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శృతిహాసన్, ఈశ్వరిరావు, బాబీ సింహ, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించిన సంగతి విదితమే. ప్రభాస్ తన కటౌట్ తోనే బాక్సాఫీసు వద్ద ఊచకోత కోశాడు.  తాజాగా ఈ మూవీ ఇటీవల ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యి.. అక్కడ కూడా ప్రభంజనం సృష్టిస్తోంది.

థియేటర్లలో విడుదలై నెల రోజులు కాకుండానే ఈ చిత్రం ఓటీటీలో సందడి చేస్తోంది. భారీ మొత్తానికే ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకుంది నెట్ ఫ్లిక్స్. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు రిలీజ్ సమయంలో మిస్ అయిన వారు.. అలాగే అల్రెడీ చూసిన వారు సైతం సలార్ చిత్రాన్ని వాచ్ చేశారు. దీంతో ఇటీవల కాలంలో ఎక్కువ మంది చూసిన మూవీగా రికార్డు సృష్టిస్తోంది. నెట్ ఫ్లిక్స్ టాప్-10 గ్లోబల్ చార్ట్స్ (ఇంగ్లీష్ కేటగిరి కాకుండా)లో మూడవ స్థానంలో నిలిచింది సలార్ మూవీ. గత వారంలో ఓటీటీలో సూపర్ వ్యూస్ రాబట్టుకుందీ చిత్రం. అయితే దీని కన్నా మూడు వారాల ముందు థియేటర్లలో సందడి చేసిన మూవీ యానిమల్ ఇంకా నెట్ ఫ్లిక్స్‌లో విడుదల కాలేదు . గత నెలలో డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలైంది రణబీర్ -సందీప్ రెడ్డి వంగా కాంబో  చిత్రం.

సలార్ మూవీ నెట్ ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ అవుతుంది అంటూ.. వరుస ట్వీట్స్ పెట్టింది. అలాగే.. యానిమల్ ఓటీటీ ఎప్పుడు వస్తుందంటూ టీజ్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది సలార్ టీం. దీనిపై యానిమల్ టీం స్పందించింది. ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించింది. జనవరి 26న రాబోతున్నట్లు చెప్పకనే చెప్పేసింది. ఇది కూడా నెట్ ఫ్లిక్స్‌లోనే రాబోతుంది. అయితే వారం వ్యవధిలో ఈ మూవీ విడుదల కావడంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సలార్ మూవీకి యానిమల్ గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వ్యూస్ పరంగా సలార్ ట్రెండింగ్‌లో ఉండగా.. ఇప్పుడు యానిమల్ విడుదల అవుతున్న నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ పడుతుందని అనుకుంటున్నారు ఫ్యాన్స్, సినీ విశ్లేషకులు. అలాగే సలార్ ఓటీటీలో విడుదలై.. వారం కాకుండానే.. యానిమల్ రిలీజ్ కావడంతో ప్రభాస్ ప్యాన్స్.. నెట్ ఫ్లిక్స్ పై ఫైర్ అవుతున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet