iDreamPost
android-app
ios-app

కూతురికి రణ్ బీర్ దంపతులు ఖరీదైన గిఫ్ట్.. ఇన్ని కోట్లా!

  • Published Mar 29, 2024 | 2:01 PM Updated Updated Mar 29, 2024 | 2:01 PM

సాధారణంగా స్టార్ యాక్టర్స్ అంటే.. పుట్టుకతోనే ధనవంతులు అయిపోతుంటారు. అయితే, రణ్ బీర్ కూతురు రాహా కపూర్‌ మాత్రం బాలీవుడ్ స్టార్ కిడ్స్‌ లో చిన్నవయసులోనే.. అత్యంత ధనవంతురాలైన స్టార్ కిడ్ గా రికార్డు సృష్టించింది.

సాధారణంగా స్టార్ యాక్టర్స్ అంటే.. పుట్టుకతోనే ధనవంతులు అయిపోతుంటారు. అయితే, రణ్ బీర్ కూతురు రాహా కపూర్‌ మాత్రం బాలీవుడ్ స్టార్ కిడ్స్‌ లో చిన్నవయసులోనే.. అత్యంత ధనవంతురాలైన స్టార్ కిడ్ గా రికార్డు సృష్టించింది.

  • Published Mar 29, 2024 | 2:01 PMUpdated Mar 29, 2024 | 2:01 PM
కూతురికి రణ్ బీర్ దంపతులు ఖరీదైన గిఫ్ట్.. ఇన్ని కోట్లా!

బాలీవుడ్ యాక్టర్ రణ్ బీర్ కపూర్ .. యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో బాలీవుడ్ లోనే కాకుండా.. టాలీవుడ్ లోను.. తన మార్క్ ను సెట్ చేసుకున్నాడు రణ్ బీర్. ఇక రణ్ బీర్ వైఫ్ అలియా భట్ గురించి తెలియనిది కాదు. అటు బాలీవుడ్ , ఇటు టాలీవుడ్ లోను అందరికి పరిచయం ఉన్న జంట వీరు. అలాగే వీరి ముద్దుల కూతురు రాహా కపూర్ పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే, సాధారణంగా స్టార్ కిడ్స్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం సహజం. క్రమంగా వారు కూడా పాపులర్ అవుతూ ఉంటారు. అయితే, రాహా కపూర్ మాత్రం.. బాలీవుడ్ స్టార్ కిడ్స్‌ లో చిన్నవయసులోనే.. అత్యంత ధనవంతురాలైన స్టార్ కిడ్ గా రికార్డు సృష్టించింది. అది ఎలానో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

తాజాగా రణ్ బీర్ కపూర్, అలియా భట్‌తోపాటు నీతూ కపూర్ .. ముంబై బాంద్రా నడిబొడ్డున నిర్మాణంలో ఉన్న ఓ బంగ్లాలో కనిపించారు. అయితే, ఈ బంగ్లాకోసం రణ్ బీర్ కుటుంబం సుమారు రూ.250 కోట్లు ఖర్చు చేసిందని సమాచారం. ఈ ఖర్చు చూస్తే బాలీవుడ్ లో ఉన్న అందరు సెలెబ్రిటీల కంటే కూడా.. వీరిదే అధికంగా ఉన్నట్లు ఉంది. దీనితో ముంబైలో అత్యంత ఖరీదైన సెలబ్రిటీ భవనం ఇదేనని బాలీవుడ్ మీడియా వర్గాలు వెల్లడించాయి. పైగా ఈ భవనానికి రణ్ బీర్, అలియా దంపతులు.. తన కుమార్తె రాహా కపూర్ పేరు పెట్టనున్నట్లు సమాచారం. దీనితో.. ఏడాది వయసున్న రాహా కపూర్ బాలీవుడ్‌లోనే.. అత్యంత చిన్న వయుసులో ధనవంతురాలైన స్టార్ కిడ్ గా రికార్డు సృష్టించింది. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక కేవలం ఈ భవనమే కాకుండా.. దానితో పాటు బాంద్రా ప్రాంతంలో అలియా, రణ్బీర్ ఇద్దరికీ కలిపి.. నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయని.. దాని విలువ రూ.60 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. అంతేకాకుండా .. రాహా తో పాటు తన నానమ్మ నీతూ కపూర్ ఈ భవనానికి సహా యజమానిగా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఏదేమైనా ఇలాంటివి సినీ సెలెబ్రెటీలకు మాత్రమే సాధ్యం అని చెప్పి తీరాలి. ఇక రణ్ బీర్ సినిమాల విషయానికొస్తే.. యానిమల్ పార్ట్-2 సినిమాలో మరొక సారి అందరికి కనిపించనున్నాడు. ప్రస్తుతం రణ్ బీర్ , అలియా దంపతులు.. అటు సినెమాలతోను, ఇటు వ్యక్తిగత జీవితంలో తన కుటుంబంతోనూ చక్కగా లైఫ్ ను బ్యాలన్స్ చేస్తూ.. లీడ్ చేస్తున్నారు. మరి రణ్ బీర్ , అలియా ల ముద్దుల కూతురు రాహా.. చిన్న వయస్సులోనే .. ధనవంతురాలిలో ఒకరిగా రికార్డు క్రియేట్ చేయడంపై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss