iDreamPost
android-app
ios-app

కల్కి ట్రైలర్ పై RGV బంపర్ ఆఫర్ .. ఏకంగా లక్ష ఇస్తానంటూ!

  • Published Jun 22, 2024 | 9:19 AM Updated Updated Jun 22, 2024 | 9:19 AM

RGV about Kalki Trailer :ఇప్పుడు మూవీ లవర్స్ ఎవరిని కదిలించినా కానీ.. అందరి నోటి నుంచి వినిపించేది కల్కి సినిమా గురించే టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసిన మరొక ట్రైలర్ ప్రేక్షకులకు ఇంకాస్త హైప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఈ ట్రైలర్ మీద రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించడం విశేషం.

RGV about Kalki Trailer :ఇప్పుడు మూవీ లవర్స్ ఎవరిని కదిలించినా కానీ.. అందరి నోటి నుంచి వినిపించేది కల్కి సినిమా గురించే టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసిన మరొక ట్రైలర్ ప్రేక్షకులకు ఇంకాస్త హైప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఈ ట్రైలర్ మీద రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించడం విశేషం.

  • Published Jun 22, 2024 | 9:19 AMUpdated Jun 22, 2024 | 9:19 AM
కల్కి ట్రైలర్ పై RGV బంపర్ ఆఫర్ .. ఏకంగా లక్ష ఇస్తానంటూ!

ఇప్పుడు సోషల్ మీడియాలో కల్కి సినిమాదే హావ. ఎక్కడ చూసిన అందరు ఈ సినిమా గురించే డిస్కషన్స్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్ ఇప్పుడు అందరికి మరింత హైప్ ఇచ్చింది. ఒక సినిమా కోసం ప్రేక్షకులలో ఇంత హైప్ క్రియేట్ చేయడం.. ఇదే మొదటి సారి ఏమో అని భావిస్తున్నారు ప్రేక్షకులు. ఇంకొక 5 రోజులలో ఈ సినిమా అసలు కథ ఏంటి అనేది అందరికి తెలిసిపోతుంది. జూన్ 27 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు.. ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ పై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఇప్పుడు ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటో చూసేద్దాం.

సెలెబ్రిటీల అందరి ట్వీట్స్ లో రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ ఎప్పుడు కాస్త డిఫ్ఫరెంట్ గా ఉంటాయన్న సంగతి.. అందరికి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో వర్మ పాజిటివ్ ట్వీట్స్ కూడా చేస్తున్నాడు. గతంలో కల్కి 2898 ఏడీ మూవీ గురించి… ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ.. విజువల్ వండర్ ఉందని స్పందించారు రామ్ గోపాల్ వర్మ. ఇక ఇప్పుడు తాజాగా రిలీజ్ ట్రైలర్ మీద కూడా వర్మ స్పందించారు. వర్మ ఈ సినిమా గురించి స్పందిస్తూ.. తన ట్విట్టర్లో ఆ ట్రైలర్‌ను షేర్ చేసి.. కొన్ని లైన్స్ రాసుకొచ్చారు. కానీ ట్విస్ట్ ఏంటంటే.. అక్కడ కొన్ని పదాలను ఫిల్ చేయకుండా.. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ టైప్ లో వదిలేశారు. ఆ పదాలను సరిగ్గా ఎవరైతే ఫిల్ చేస్తారో వారికి లక్ష ఇస్తానంటూ ప్రకటించారు. దీనితో ఆ ట్వీట్ కింద కొంతమంది రకరకాల కామెంట్స్ పెడుతూ ఉన్నారు. వర్మ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక తాజాగా కల్కి సినిమా నుంచి విడుదల చేసిన.. సెకండ్ ట్రైలర్ చూసిన ఎవరైనా వావ్ అనకుండా ఉండలేరు. ఈ ట్రైలర్ లో చూపించిన విజువల్ వండర్స్, యాక్షన్ సిక్వెన్సెస్ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. ముఖ్యంగా ప్రభాస్, అమితాబ్ మధ్య వచ్చిన సీన్స్ అయితే అదిరిపోయాయి అని చెప్పి తీరాలి. ఇక ఇప్పటికే నార్త్ లో ఈ సినిమా రెండు మిలియన్ డాలర్స్ క్రాస్ చేసి.. బాగా బజ్ సంపాదించుకుంటుంది. కాబట్టి జూన్ 27న ఈ సినిమా ఖచ్చితంగా రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందని… నిస్సందేహంగా చెప్పేయొచ్చు. మరి కల్కి సినిమాపై వర్మ స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom