రామ్ డబుల్ ఇస్మార్ట్ కు రెండో రోజు లానే 3వ రోజు.. కలెక్షన్స్ ఎంతంటే!

Double Ismart Movie 3rd Day Collections: వరుస సినిమాలతో ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న రామ్ పోతినేనికి.. సరైన హిట్ పడి చాలా కాలమే అయింది. ఈ క్రమంలో ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఈ మూవీ.. మరి 3వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం.

Double Ismart Movie 3rd Day Collections: వరుస సినిమాలతో ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న రామ్ పోతినేనికి.. సరైన హిట్ పడి చాలా కాలమే అయింది. ఈ క్రమంలో ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఈ మూవీ.. మరి 3వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం.

దర్శకుడు పూరి జగన్నాధ్ , రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చి ఇస్మార్ట్ శంకర్ సినిమాకు.. సిక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. అప్పటివరకు చాక్లేట్ బాయ్ లా కనిపించిన రామ్ ను.. ఒక్కసారి మాస్ యాంగిల్ లో చూపించేసరికి ప్రేక్షకులు కాస్త కొత్తగా ఫీల్ అయ్యారు. ఇక ఈ సినిమాకు కూడా రామ్ బాగానే కష్టపడ్డాడు. కానీ రిలీజ్ కు ముందున్నంత హైప్ మాత్రం రిలీజ్ తర్వాత కొనసాగడంలేదు. ఆగష్టు 15న రిలీజ్ అయినా అన్ని సినిమాలలో మొదటి రోజు రూ.15 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ముందంజలో నిలిచినా.. రెండో రోజు కలెక్షన్స్ పడిపోయాయి. ఇక మూడు రోజు కూడా రెండో రోజులానే కొనసాగింది. మరి డబుల్ ఇస్మార్ట్ మూడో రోజు కలెక్షన్స్ ఎంతో చూసేద్దాం.

డబుల్ ఇస్మార్ట్ సినిమాకు నైజాంలో రూ. 15.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.00 కోట్లు.. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల్లో కలుపుని రూ. 17.50 కోట్లు బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక , ఓవర్సీస్ హక్కులతో సహా వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు మొత్తం మీద రూ. 48.00 కోట్లు బిజినెస్ జరిగింది. లాంగ్ వీకెండ్ చూసుకుని సరైన సమయానికే సినిమాను రిలీజ్ చేసినా కూడా.. ఆశించిన స్థాయిలో మాత్రం కలెక్షన్స్ రాబట్టలేదు.. మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ దారుణంగా పడిపోగా.. మూడో రోజు కూడా అలానే కొనసాగింది. మూడు రోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.05 కోట్లు షేర్ రాగా.. వరల్డ్ వైడ్ గా అన్ని ప్రాంతాలలో కలుపుకుని.. మొత్తం రూ. 1.15 కోట్లు రాబట్టింది. మరి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేస్తుందో లేదో వేచి చూడాలి.

ఈ సినిమా కోసం రామ్ పోతినేని ఎంతలా కష్టపడ్డాడో ఆల్రెడీ.. సోషల్ మీడియాలో టాక్ వినే ఉంటారు. సినిమా అంతా కూడా రామ్ వన్ మ్యాన్ షో గా నడిచిందని చెప్పి తీరాల్సిందే. ఈసారైనా రామ్ హిట్ కొట్టేసి మంచి కమ్ బ్యాక్ ఇస్తాడని అనుకున్నారు కానీ అది జరగలేదు. మూవీ రిలీజ్ కు ముందు దర్శకుడు చెప్పినట్లు సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి.. ప్లాప్ అయినా ఇంకో సినిమా తీయాల్సిందే కాబట్టి.. రామ్ నెక్స్ట్ మూవీతో అయినా బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి. డబుల్ ఇస్మార్ట్ కు నెగిటివ్ టాక్ అయితే రాలేదు కానీ..ప్రస్తుతానికి మిక్స్డ్ టాక్ తో మూవీ.. థియేటర్ లో రన్ అవుతుంది. మరి ఈ మూవీ మూడవ రోజు కలెక్షన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments